వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడలోని స్పెషల్ మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయన్ను పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించి, ప్రలోభపెట్టారన్న ఆరోపణలతో కాకినాడలోని సర్పవరం పోలీసు స్టేషన్‌లో ఆయనపై ఈ నెల 21న కేసు నమోదైంది. ఈ క్రమంలో శుక్రవారం అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

