తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు నిత్యాన్న ప్రసాదంలో ఉపయోగించే.. పవిత్ర నెయ్యి ఇప్పుడు కొత్త రూపంలో నిల్వ చేయనున్నారు. ఆధునిక సాంకేతికతతో, అధిక నాణ్యతతో, దీర్ఘకాల నిల్వ సామర్థ్యంతో కొత్త ట్యాంకులు, యంత్రాల నిర్మాణం వేగంగా సాగుతోంది. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న పెద్ద చేయి.. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎన్. శ్రీనివాసన్. ఆయన సహకారంతో మొత్తం 2.24 లక్షల కిలోల నెయ్యిని నిల్వ ఉంచే సామర్థ్యంతో నాలుగు కొత్త ట్యాంకర్లు సిద్ధం చేశారు.

