టీఆర్ఎస్ పేరు తనకు రాసిపెట్టి ఉందేమోననని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ‘‘తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)’’ కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని సమస్త తెలంగాణ సమాజానికి తెలియ చేయడానికి సంతోషిస్తున్నామని కవిత పేర్కొన్నారు. రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం తాను చేసిన కృషిని కొనసాగిస్తూ… ఇక ముందు కూడా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా అంకితభావంతో పని చేస్తానని కవిత చెప్పుకొచ్చారు.

