loader

వనం వదిలి జనంలోకి.. HCUలో బుల్డోజర్లతో బెదిరిన జీవాలు

హెచ్‌సీయూ కంచ గచ్చిబౌలిలో ప్రశాంతంగా బతికిన మూగజీవాలు నేడు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నాయి. చెట్లను, ఆవాసాలను బుల్డోజర్లు నేలమట్టం చేస్తుంటే బెదిరిన జింకలు గమ్యం ఎటో తెలియకుండా పరుగులు తీస్తున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో జింకలు సంచరిస్తూ కనిపిస్తున్నాయి. శుక్రవారం గోపన్‌పల్లి, ఎన్టీఆర్‌ నగర్‌లో ఓ జింక హృదయవిదారకంగా తిరుగుతూ కనిపించింది. రహదారిపై ఉన్న పలు షాపుల్లోకి వెళ్తూ, బయటకు వస్తూ భయపడుతూ నిపించింది. ఎన్టీఆర్‌ నగర్‌ ప్రధాన రహదారిపై పరుగెత్తగా వీధి కుక్కలు వెంటపడ్డాయి. స్థానికులు […]

హెచ్‌సియులో హైకోర్టు రిజిస్ట్రార్

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గురువారం ఉదయం హైకోర్టు రిజిస్ట్రార్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములను పరిశీలించారు. దాదాపుగా ఐదు కిలోమీటర్ల కాలినడకన పర్యటించి వివరాలు సేకరించారు. దాదాపు నాలుగైదు గంటల పాటు రిజిస్ట్రార్ హెచ్‌సియు భూములకు సంబంధించిన వివరాలు క్షుణ్ణంగా పరిశీలించారు. యూనివర్సిటీ విద్యార్థులు, ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నాయకులు రిజిస్ట్రార్‌ను కలిసి వర్సిటీలో ధ్వంసమైన భూమిని చూపించారు. అన్ని వరాలు సేకరించి విశ్లేషించి హైకోర్టు రిజిస్ట్రార్ నివేదిక రూపొందించి సుప్రీంకోర్టుకు సమర్పించారు.

న్యాక్‌ ఇంజినీర్లపై వేటు

జీహెచ్‌ఎంసీలో 27 మంది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్స్‌(న్యాక్‌) ఇంజినీర్లపై వేటు వేస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇలంబర్తి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. అక్రమ నిర్మాణాల విషయంలో న్యాక్‌ ఇంజినీర్లు డబ్బులు తీసుకున్నట్లు కమిషనర్‌కు పలువురు బాధితులు స్వయంగా ఫిర్యాదు చేశారు. విజిలెన్స్‌ విభాగాన్ని రంగంలోకి దింపి సమగ్ర విచారణకు ఆదేశాలు జారీశారు. జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా 100 మంది న్యాక్‌ ఇంజినీర్లు ఉండగా, ప్రధానంగా 27 మంది అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు విధుల నుంచి తొలగిస్తూ […]

హెచ్ఎండీఏ పరిధిలోకి 11 జిల్లాలు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. HMDA పరిధిలోకి మరో 36 రెవెన్యూ విలేజ్లు చేరాయి. 11 జిల్లాలకు చెందిన 104 మండలాలు, 1355 గ్రామాలు ఇకపై హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీగా పిలుస్తారు. ప్రారంభ సమయంలో దీని విస్తీర్ణం కేవలం 650 చదరపు కిలోమీటర్లే ఇప్పుడు అది పదివేల కిలోమీటర్లకు చేరింది.

స్పీకర్‌పై సుప్రీం అసహనం

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల అనర్హతపై మరోసారి సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మార్చి 22 వరకూ సమా ధా నం ఇవ్వాలని ఆదేశించింది. ప్రతిసారీ రీజనబుల్ టైమ్ కావాలని ప్రభుత్వం కోరుతుండటంతో సుప్రీంకోర్టు మండిపడింది. రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే వరకా అని అసహనం వ్యక్తం చేసింది.

బేగంపేట విమానాశ్రయం నుంచి కమర్షియల్ విమానాలు

బేగంపేట విమానాశ్రయం నుంచి త్వరలోనే కమర్షియల్ విమానాల రాక పోకలు ప్రారంభం కానున్నాయి. దీంతోపాటు డొమెస్టిక్ సేవలను కూడా ఇక్కడ పు నరుద్ధరిస్తే శంషాబాద్ ఎయిర్‌పోర్టుపై ఒత్తిడి తగ్గుతుందని కేంద్ర విమానయాన సంస్థ భావిస్తున్నట్టుగా తెలిసింది.ప్రస్తుతం ఇక్కడి నుంచి విఐపి లు ప్రయాణించే విమానాలు, ప్రైవేటు ఫ్లైట్ల ల్యాండింగ్‌కు ఇక్క డ అనుమతి ఉంది. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు హైదరాబాద్ పర్యటనకు వస్తే ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.

తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల..

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2025 ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఎగ్జామ్స్ హాల్ టికెట్లు విడుదల చేసింది. పరీక్షలు మార్చి 6 నుండి 25 వరకు జరుగుతాయి. హాల్ టికెట్లు https://tgbie.cgg.gov.in/  ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సారి హాల్ టిక్కెట్ల‌పై క్యూర్ కోడ్‌ను అమ‌ర్చ‌నున్నారు. క్యూర్ కోడ్‌ను  స్కాన్ చేస్తే.. త‌మ ఎగ్జామ్ సెంట‌ర్‌ను విద్యార్థులు ఈజీగా క‌నుకోవ‌చ్చు.

హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. హాజరు కానున్న 120 దేశాల యువతులు

విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌కు మరో అరుదైన కార్యక్రమానికి వేదికగా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే.. మిస్ వరల్డ్ పోటీలు ఈసారి హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి. మే 7వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రారంభ, ముగింపు వేడుకలు అంగరంగా వైభవంగా జరగనున్నాయి. భారత్‌లో మిస్ వరల్డ్ పోటీలు జరిగి దాదాపు 30 ఏళ్లు కావస్తోంది. ఈ క్రమంలోనే ఈ ప్రపంచ సుందరి అందాల పోటీలను 28 ఏళ్ల తర్వాత భారత్‌లో నిర్వహిస్తుండటం గమనార్హం.

తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు..

తెలంగాణ రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. యువతకు ఉపాధి కల్పిస్తూ, ఆదాయ వనరులుగా నిలిచే విధంగా పర్యాటక శాఖ తన కార్యాచరణను రూపొందించుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. పర్యాటక రంగానికి సంబంధించి ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం, రాష్ట్రంలోని ప్రకృతి సౌందర్యం, సాంస్కృతిక ప్రాముఖ్యతను ఉపయోగించుకొని కొత్త ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

తెలంగాణలో బెన్‌ఫిట్ షోలు రద్దు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో సినిమాలకు ఇకపై ఎలాంటి బెన్ ఫిట్ షోలు చూసే వీలు లేదు. ఈమేరకు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమా టికెట్ ధరలు, స్పెషల్ షోలకు సంబంధించిన అనుమతులపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కీలక నిర్ణయం వెలువరించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సినిమాటోగ్రఫి చట్టం ప్రకారం అందరూ నడుచుకోవాలని సూచించింది. ఆ చట్టం ప్రకారం.. అర్ధరాత్రి ఒకటిన్నర తర్వాత.. ఉదయం 8 గంటల 40 నిమిషాలకు ముందు ఎలాంటి షోలు అనుమతించొద్దని ఆదేశించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON