2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఛాంపియన్ అయిన “రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు” (ఆర్సీబీ) ఫ్రాంచైజీ కొనుగోలుకు బడా సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. వాటిలో అదానీ, జిందాల్, పూనావాలాలు సహా రెండు అమెరికన్ బేస్డ్ కంపెనీలు కూడా ఉండడం గమనార్హం. ఆర్సీబీ ఫ్రాంచైజీ కొనుగోలు విషయంలో అదర్ పూనావాలా ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం.

