తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నటుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా చిట్ చాట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్టీఆర్ జాతీయ నాయకుడు. ఎన్టీఆర్ గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే వారంత మూర్ఖులు ఎవరు ఉండరు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టిందే కాంగ్రెస్ పార్టీ’ అని అన్నారు.

