గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను బాల్య దశలోనే అడ్డుకోవడానికి హెచ్‌పీవీ వ్యాక్సినేన్ అనే బృహత్తర కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించాయి. ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. టీకా వేయించుకునే పిల్లలు కచ్చితంగా టిఫిన్ లేదా భోజనం చేసి రావాలని అన్నారు. ఖాళీ కడుపుతో రావద్దని సూచించారు. టీకా వేసుకున్న ఒక అరగంట పాటు ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. టీకా వేసిన చోట కొంచెం నొప్పి ఉంటుందని, జ్వరం కూడా రావచ్చని చెప్పారు. అలర్జీలు ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా సరే టీకా వేయించుకోవద్దని సూచిస్తున్నారు.

