loader

ఇంధన ట్యాంక్‌పై డ్రోన్‌ దాడి.. దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత

ఇజ్రాయెల్‌, అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌.. డ్రోన్‌ దాడుల ను తీవ్రతరం చేసింది. తన పొరుగుదేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. ఇవాళ (సోమవారం) తెల్లవారుజామున దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్‌ దాడులు చేసింది. ఒక డ్రోన్‌ ఇంధన ట్యాంక్‌ను ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. దాంతో విమానాశ్రయంలోని అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. విమానాశ్రయాన్ని మూసివేసినట్లు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు ప్రకటించారు.

ఇస్ఫహాన్‌లోని ఇరాన్‌ అణుకేంద్రంపై వైమానిక దాడులు

ఇరాన్‌ దేశానికి చెందిన అత్యంత కీలకమైన అణుకేంద్రంపై ఇజ్రాయెల్‌, అమెరికా దేశాలు వైమానిక దాడులకు పాల్పడ్డాయి. అణుకేంద్రం ఉన్న ఇస్ఫహాన్‌ నగరంపై అమెరికా-ఇజ్రాయెల్‌ విమానాలు విరుచుకుపడుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఇస్ఫహాన్‌లోని వివిధ ప్రదేశాల్లో భారీ పేలుళ్లు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చాలాచోట్ల భారీ ఎత్తున నల్లపొగ ఆకాశాన్ని కమ్మేసింది. అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడులు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.

హార్ముజ్‌ జలసంధి బంద్‌ ఆ రెండు దేశాల నౌకలకే.. స్పష్టంచేసిన ఇరాన్

హార్ముజ్‌ జలసంధి విషయంలో ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం అమెరికా, ఇజ్రాయెల్‌ నౌకలకే జలసంధిని మూసివేశామని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇతర దేశాల నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చన్నారు. అయితే భద్రతా సమస్యల కారణంగా అనేక దేశాలు ముందుకు రావడంలేదని చెప్పారు. ప్రస్తుతం హర్మూజ్ జలసంధి మీదుగా అనేక చమురు ట్యాంకర్లు, నౌకలు ప్రయాణిస్తున్నాయని ఇరాన్‌ మంత్రి తెలిపారు. నూతన సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీకు ఎటువంటి సమస్యా […]

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను నిలిపేస్తున్న ఇన్‌స్టాగ్రామ్

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ తన యూజర్లకు ఒక ముఖ్యమైన అలర్ట్ జారీ చేసింది. మే 8, 2026 నుండి యాప్‌లో అందుబాటులో ఉన్న ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను తొలగిస్తున్నట్లు మెటా ప్రకటించింది. ఈ ఫీచర్‌ను నిలిపివేయడానికి ప్రధానంగా అంతర్జాతీయ నియంత్రణ సంస్థల ఒత్తిడి కారణమని తెలుస్తోంది. ఆన్‌లైన్ భద్రత మరియు చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను అరికట్టడానికి ప్రభుత్వాలు కొత్త నిబంధనలు తీసుకువస్తున్నాయి. బ్రిటన్ మరియు యూరోపియన్ దేశాల్లో అమలులో ఉన్న కఠినమైన చట్టాలకు అనుగుణంగా మెటా […]

ఇరాన్​పై 10వేల AI డ్రోన్స్​తో అమెరికా ఎటాక్​!

ఇరాన్​తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా దాదాపు 10వేల ఏఐ డ్రోన్​లను పశ్చిమాసియాలో మోహరించిందని యూఎస్ బ్రాడ్​కాస్టర్​ ఏబీసీ న్యూస్​ తెలిపింది. మెరోప్స్​ అని పిలిచే ఈ డ్రోన్​లను, మాజీ గూగుల్ సీఈఓ ఎరిక్ స్మిత్​కు చెందిన పెరెన్నియల్ అటానమీ అభివృద్ధి చేసింది. ఈ  డ్రోన్స్  శత్రువులకు చెందిన డ్రోన్​లను వేటాడి నాశనం చేయడానికి రూపొందించారు. ఇప్పటికే వీటిని ఉక్రెయిన్ వార్​లోనూ ఉపయోగించారు. ఈ మెరోప్స్​, ఇరాన్​ నుంచి రష్యా కొనుగోలు చేసిన షాహెద్ డ్రోన్లను కూల్చివేశాయని […]

బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా.. మరో యుద్ధానికి తెర లేచిందా?

ప్రపంచం ఇప్పటికే రెండు యుద్ధాలలో చిక్కుకుంది. ఈలోగా, ఉత్తర కొరియా శనివారం (మార్చి 14) బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. దక్షిణ కొరియా, జపాన్ దీనిని ధృవీకరించాయి. ఉత్తర – దక్షిణ కొరియాలు తూర్పు సముద్రం అని పిలిచే జపాన్ సముద్రం వైపు ఈ క్షిపణిని ప్రయోగించాయి. ఉత్తర కొరియా సముద్రం వైపు అనుమానిత బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని దక్షిణ కొరియా చెబుతోంది. ఈ ఘటన జపాన్‌ను ఉలిక్కిపడేలా చేసింది. ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి ఉండవచ్చని […]

మా వద్ద సూసైడ్ బోట్స్ ఉన్నాయ్: ఇరాన్ మిలిటరీ

తమ వద్ద ఆత్మాహుతి బోట్స్ ఉన్నాయని ఇరాన్ సైనిక దళం తాజాగా హెచ్చరించింది. భూగర్భ సొరంగాల్లో దాచి ఉంచిన రకరకాల డ్రోన్స్, నౌకలను ధ్వంసం చేయగలిగిన మిసైల్స్, నీళ్లల్లో అమర్చే మైన్స్ వంటివి ఉన్న వీడియోను అక్కడి మీడియా విడుదల చేసింది. అయితే, ఈ ఫుటేజీ ఎప్పటిదనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. పర్షియన్ గల్ఫ్‌లో చమురు రవాణా నౌకలపై దాడుల కోసం ఈ పడవలనే వాడినట్టు తెలుస్తోంది.

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

ఫిఫా వరల్డ్‌కప్ 2026  ఈ ఏడాది జూన్ 11 నుంచి జూలై 19 వరకు అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. “ప్రస్తుత యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఇరాన్ ఆటగాళ్లు అమెరికాకు వస్తే, వారి ప్రాణాలకు లేదా భద్రతకు మేము ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేము. వారు ఈ వరల్డ్‌కప్‌కు దూరంగా ఉండటమే అందరికీ […]

కోమాలో ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌!.. మొజ్తబా ఖమేనీ కాలు కోల్పోయారు: ది సన్

ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ కోమాలో ఉన్నట్లు బ్రిటన్‌కు చెందిన వార్తాపత్రిక ‘ది సన్‌’ పేర్కొంది. మొజ్తబా ఖమేనీ చికిత్స గురించి ఒక ఇరాన్‌ నేత వివరాలు వెల్లడించినట్లు ‘ది సన్‌’ తెలిపింది. ‘మా నాయుకుడు చాలా తీవ్రమైన స్థితిలో ఉన్నారు. ఒకటి లేదా రెండు కాళ్ళు తెగిపోయాయి. కాలేయం, కడుపు కూడా చీలిపోయింది. ఆయన స్పష్టంగా కోమాలో ఉన్నారు’ అని ఆ ఇరాన్‌ నేత అన్నట్లు పేర్కొంది.

మేము కేవలం గర్భాలం కాదు: జపాన్ మహిళల ‘స్టెరిలైజేషన్’ పోరాటం

జపాన్‌లో సంతానోత్పత్తి రేటు వేగంగా పడిపోతున్న నేపథ్యంలో, ప్రభుత్వం జనాభాను పెంచేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. నా శరీరం కేవలం ప్రసూతి కోసం ఉద్దేశించినది కాదు” అనే నినాదంతో కజియా మరియు మరో నలుగురు మహిళలు జపాన్ కోర్టులో దావా వేశారు. తమకు సంతానం వద్దు అనుకునే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని వారు వాదిస్తున్నారు. జపాన్ సమాజం మహిళలను కేవలం పిల్లలను కనే యంత్రాలుగా చూస్తోందని 29 ఏళ్ల కజానే కజియా ఆరోపిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON