loader

ఐఫోన్‌ను హ్యాక్‌ చేస్తే కోట్ల రూపాయలు- ఆపిల్‌

ఐఫోన్‌ను హ్యాక్‌ చేస్తే కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు ఆపిల్‌ సంస్థ ప్రకటించింది. యాపిల్ సెక్యూరిటీ బౌంటీ కార్యక్రమంలో భాగంగా ఐఫోన్‌ సిస్టమ్స్‌ను బ్రేక్‌ చేసిన వారికి రూ.16 కోట్ల నగదు బహుమతిని అందిస్తామని ప్రకటించింది. ఆపిల్ కంపెనీ సెక్యూరిటీ బౌంటీ కింద ఐదు రకాల కేటగిరీల్లో అవార్డ్స్ పొందవచ్చు. లాక్‌స్క్రీన్ బైపాస్ వంటి ఫిజికల్ యాక్సెస్ ద్వారా డివైజ్ అటాక్ యూజర్ ఇంటరాక్షన్‌తో నెట్‌వర్క్ హ్యాక్ చేయడంగా ద్వారా,సింగిల్-క్లిక్‌తో సెన్సిటివ్ డేటాకు అనధికార యాక్సెస్,వన్-క్లిక్‌తో ప్రివిలేజ్ ఎలివేషన్‌తో […]

జెలెన్‌స్కీ కీలక నిర్ణయం: ట్రంప్, పుతిన్ భేటీ తర్వాత వాషింగ్టన్‌కు పయనం

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ స్పందించారు. ఈ చర్చల తర్వాత తాను “నిర్మాణాత్మక సహకారానికి” సిద్ధంగా ఉన్నానని జెలెన్‌స్కీ ప్రకటించడం అంతర్జాతీయంగా ఆసక్తి రేకెత్తించింది. ఈ పరిణామాల నేపథ్యంలో జెలెన్‌స్కీ రాబోయే సోమవారం వాషింగ్టన్‌కు పయనం కానున్నారు. ముఖ్యంగా ట్రంప్‌తో ప్రత్యక్షంగా భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది.

భారత్ కు భారీ ఊరట.. సుంకాలపై వెనక్కి తగ్గిన ట్రంప్

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నదని కోపించిన ట్రంప్ భారత్ పై 50శాతం సుంకాలను విధించింది. అయితే నిన్న అలాస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో ట్రంప్ జరిపిన చర్చలు అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. ష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై ఇప్పుడు కొత్త సుంకాలు విధించడాన్ని తాను పరిగణించాల్సిన అవసరం లేదని ట్రంప్ అన్నారు. మరో రెండు లేదా మూడువారాల్లో ఈ అంశాన్ని పునఃపరిశీలిస్తామని చెప్పుకొచ్చారు. టారీఫ్ ల విషయం తాను కాస్త […]

సీనియర్ టెర్రరిస్ట్ ను లేపేశాం: ఇజ్రాయెల్

గాజా స్ట్రిప్‌లో హమాస్‌కు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. Israel భద్రతా దళాలు దక్షిణ గాజాలో వైమానిక దాడి జరిపాయి. ఖాన్ యూనిస్ ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో హమాస్‌కు చెందిన సీనియర్ నేత నాసెర్ మౌస్సా హతమయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీని కూడా ఇజ్రాయెల్ విడుదల చేసింది.ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకారం, నాసెర్ మౌస్సా హమాస్ రఫా బ్రిగేడ్‌కు అత్యంత కీలకమైన నేత. అతను ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే బాధ్యత తీసుకున్నాడు. పైగా, ఇజ్రాయెల్‌పై దాడుల […]

ఆస్ట్రేలియాలో స్వాతంత్య వేడుకలు..ఖలిస్థానీయులు.. భారతీయుల మధ్య గొడవ

మెల్‌బోర్న్‌లోని కాన్సులేట్ కార్యాలయంలో స్వాతంత్య దినోత్సవ వేడుకల నిర్వహణలో ఖలిస్థానీయులు రెచ్చిపోయారు. ఈ కార్యక్రమానికి అడ్డొచ్చి గందరగోళం సృష్టించారు. దేశభక్తి గీతాలు పాడుతుండగా కొందరు ఖలిస్థానీలు అక్కడికి వచ్చారు. ఖలిస్థానీ జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ భారతీయులు, ఖలిస్థానీ మద్దతుదారుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.  ఖలిస్థానీ మద్దతుదారులపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. స్వాతంత్య దినోత్సం రోజున ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గూగుల్ క్రోమ్‌ను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చిన భారత సంతతికి చెందిన సీఈఓ

టెక్ ప్రపంచంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌ను కొనుగోలు చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్‌ పర్‌ప్లెక్సిటీ ముందుకొచ్చింది. అమెరికన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ పర్‌ప్లెక్సిటీ AI వ్యవస్థాపకుడు, CEO అరవింద్ శ్రీనివాస్ గూగుల్ క్రోమ్‌ను కొనుగోలు చేయడానికి $34.5 బిలియన్ల (రూ. 3,02,152 కోట్లకు పైగా) ఆఫర్ ఇచ్చారు.

ట్రంప్ అత్యంత అపఖ్యాతి పొందిన నేరస్థుడు.. ఎలాన్ మస్క్‌కు మరో తలనొప్పి

టెస్లా, ఎక్స్ దిగ్గజ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‍బాట్ గ్రోక్.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‍ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా గ్రోక్ ఈ వ్యాఖ్యలు చేసింది. “వాషింగ్టన్ డీసీలో అత్యంత అపఖ్యాతి పొందిన నేరస్థుడు ఎవరు?” అని అడగ్గా.. గ్రోక్ నేరుగా డోనాల్డ్ ట్రంప్ పేరును ప్రస్తావించింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించడంతో.. మస్క్‌కు మరో […]

భారత్​ దౌత్యవేత్తలకు గ్యాస్, వాటర్ కట్ చేసిన పాక్

పాకిస్థాన్ మరోసారి భారత్​​ విషయంలో తన వక్రబుద్ధిని చూపించింది. ఇస్లామాబాద్​ లోని భారత దౌత్యవేత్తల పట్ల పాకిస్థాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. దౌత్యవేత్తల నివాసాలకు నీరు, గ్యాస్ వార్త పత్రికలు వంటి నిత్యావసర వస్తువల సరఫరాను నిలిపివేసినట్లు అంతర్జాతీయ మీడియా రాసుకొచ్చింది. అంతేకాకుండా భారత రాయబారులపై నిఘాను కూడా పెంచినట్లుగా తెలుస్తోంది. భారత దౌత్యవేత్తల కార్యకలాపాలను నిశితంగా గమనించడానికి అదనపు సిబ్బందిని నియమించినట్లు తెలుస్తోంది

యాపిల్‌పై ఎలాన్ మస్క్ తీవ్రహెచ్చరికలు

టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేధ AI ఆధిపత్య పోరు మరింత తీవ్రరూపం దాల్చింది. టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, టెక్ దిగ్గజం యాపిల్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ న్యాయపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించారు. యాపిల్ తన యాప్ స్టోర్‌లో ఓపెన్ఏఐకి చెందిన చాట్‌జీపీటీకి అనైతికంగా కొమ్ముకాస్తోందని, ఇది తమ సొంత ఏఐ స్టార్టప్ ‘ఎక్స్‌ఏఐ’ ఎదుగుదలను అడ్డుకుంటోందని ఆయన మండిపడ్డారు.

అసీం మునీర్​ పై నిప్పులు చెరిగిన పెంటగాన్‌ మాజీ అధికారి

పర్యటనలో ఉండగానే అణు బెరింపులకు పాల్పపడిన పాకిస్థాన్‌ సైన్యాధిపతి అసీం మునీర్​ను పెంటగాన్ మాజీ అధికారి తీవ్రంగా విమర్శించారు. మునీర్ సూట్​లో ఉన్న కరుడుగట్టిన ఉగ్రవాది, అల్‌ఖైదా మాజీ చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ అని మైఖెల్‌ రూబిన్ అన్నారు. సగం ప్రపంచాన్ని అణ్వాయుధాలతో నాశనం చేస్తామని బెదిరిస్తున్న పాకిస్థాన్​ చట్టబద్ధమైన దేశంగా ఉండే హక్కును కోల్పోయిందని మండిపడ్డారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON