loader

తాలిబాన్‌లే టార్గెట్‌గా పాక్‌ ఆర్మీ ఎయిర్‌ స్ట్రైక్.. 30 మంది మృతి!

తమ దేశంలోని ఉగ్రవాదుల టార్గెట్‌ పాకిస్థాన్‌ ఆర్మీ ఎయిర్ స్ట్రైక్‌లు చేపట్టింది, అఫ్ఘాన్ సరిహద్దులోని కైబర్ పక్తూంఖ్వా ప్రాంతంలో ఉన్న తిరాహ్ వ్యాలీలో రాత్రి 2 గంటల సమయంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ (PAF) JF-17 ఫైటర్ జెట్‌లతో 8 LS-6 బాంబులు ఉద్గారించింది. ఇది పాకిస్తాన్ తాలిబాన్ (TTP) ఉగ్రవాదులపై లక్ష్యంగా చేసిన దాడిగా తెలుస్తోంది. ఉగ్రవాదుల టార్గెట్‌ పాక్‌ ఆర్మీ చేసి ఈ దాడుల్లో సుమారు 20-30 మంది వరకు మరణించినట్టు సమాచారం. మృతుల్లో […]

చైనా సంచలన నిర్ణయం.. అమెరికా H-1Bకి పోటీగా K వీసా! ప్రపంచ ప్రతిభకు ఆహ్వానం..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ ప్రతిభావంతులైన నిపుణులను, ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం (STEM) రంగాలను ఆకర్షించే లక్ష్యంతో చైనా కొత్త K వీసా కేటగిరీని ప్రవేశపెడుతున్నట్లు ఆదివారం అధికారిక ప్రకటనలో తెలిపింది. చైనాలోకి విదేశీయుల రాకపోకల నిర్వహణపై నిబంధనలను సవరిస్తూ.. అక్టోబర్ 1, 2025 నుండి ఈ కే వీసాను అమలులోకి తేనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు వర్క్ వీసా నియమాలను కఠినతరం చేస్తున్న సమయంలో చైనా K వీసా తీసుకోరావడం సంచలనంగా మారింది.

పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించిన యూకే, కెనడా

చారిత్రక పరిణామం చోటుచేసుకుంది. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా ఆదివారం నాడు అధికారికంగా గుర్తించాయి. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ నుంచి వ్యతిరేకత ఎదురైనప్పటికీ యూకే, కెనడా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యప్రాశ్చంలో సుస్థిర శాంతి నెలకొనేందుకు ద్విదేశ విధానానికి ఒట్టావా మద్దతిస్తోందని కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలకు ‘సార్వభౌమాధికార, ప్రజాస్వామ్య, సుస్థిర పాలస్తీనా’ ఏర్పాటు కీలకమని పేర్కొంది.

హెచ్-1బీ వీసాదారులను అడ్డుకునేందుకు ఆన్‌లైన్ భారీ ఆపరేషన్

హెచ్-1బీ వీసా ఫీజు పెంపు ప్రకటన ఎన్నారైలను ఉక్కిరిబిక్కిరి చేసింది. నిబంధనల్లో అస్పష్టత, వెంటనే అమెరికాకు తిరిగి రావాలంటూ ఎన్నారైలకు టెక్ కంపెనీల పిలుపు కారణంగా భారతీయులు అనేక మంది నానా రకాల ఇబ్బందులు పడ్డారు. సెలవులకు ఇండియాకు వచ్చిన భారతీయులు సహా వివిధ దేశాల్లోని ఎన్నారైలు అమెరికాకు క్యూకట్టారు. 4Chan ఆన్‌లైన్ ఫోరమ్ యూజర్లు కొందరు విమాన టికెట్లను బ్లాక్ చేసి భారతీయులకు టిక్కెట్ల దొరకకుండా చేశారని తెలుస్తోంది. టిక్కెట్లు కొంటామంటూ వాటిని రిజర్వ్‌లో పెట్టి […]

అవినీతికి వ్యతిరేకంగా నిరసనలు

ఫిలిప్పీన్స్‌లో అవినీతి వ్యతిరేక నిరసనలు ఉధృతమయ్యాయి. వేలాది మంది రోడ్లపైకి చేరి ప్రభుత్వంపై నినాదాలు చేశారు. అతిపెద్ద ర్యాలీలు లునెటాలో, క్యూజోన్ నగరంలోని పీపుల్ పవర్ మాన్యుమెంట్ వద్ద ట్రిలియన్ పెసో మార్చ్ అవినీతిని అరికట్టాలని, ప్రజల హక్కులను కాపాడాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. వరద నియంత్రణ ప్రాజెక్టులలో అవినీతిని ఖండిస్తూ సెప్టెంబర్ 21 ఆదివారం దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతమయ్యాయి.

అమెరికా గన్ కల్చర్‌కి భారత మహిళ బలి..దారుణంగా కాల్చి చంపిన దుండగుడు

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. తన స్టోర్‌లో దోపిడీకి యత్నించిన దుండగుడిని.. ధైర్యంగా ఎదిరించిన భారత సంతతికి చెందిన మహిళను.. వెంబడించి మరీ అత్యంత కిరాతకంగా కాల్చి చంపాడు. ఈ దారుణ సంఘటన యూనియన్ కౌంటీలోని పిక్నీ స్ట్రీట్‌లో చోటుచేసుకుంది. మృతురాలు గుజరాత్‌కు చెందిన కిరణ్ పటేల్‌గా గుర్తించారు. దోపిడీ చేయడానికి వచ్చిన అతన్ని కిరణ్ పటేల్ ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఒక వస్తువును అతనిపై విసిరి, స్టోర్‌ బయటికి పరుగెత్తారు. కోపంతో ఉన్న దుండగుడు ఆమెను […]

ఢాకా నుంచి చిట్టగాంగ్‌ వరకు భారీ భూకంపం.. 7.7 తీవ్రతతో వణికించిన ప్రకంపనలు!

భారతదేశ పొరుగు దేశాన్ని భారీ భూకంపం వణికించింది. మయన్మార్‌ను 7.7 తీవ్రతతో భూకంపం కుదిపేసింది. ఢాకా, చిట్టగాంగ్‌తో సహా బంగ్లాదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. అయితే, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని బంగ్లాదేశ్ వాతావరణ శాఖ తెలిపింది. దీని కేంద్రం మయన్మార్‌లోని మండలే, బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉంది. దీని కేంద్రం మయన్మార్‌లోని సాగింగ్‌కు వాయువ్యంగా 16 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతులో నమోదు చేసుకుంది. బంగ్లాదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో దీని ప్రభావం కనిపించింది.

H1-B వీసాపై స్వరం మార్చిన ట్రంప్‌.. వైట్‌ హౌజ్‌ నుంచి మరో కీలక ప్రకటన

H1-B వీసాపై వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుత వీసాలకు, రెన్యువల్స్ కి తాజా ఫీజు పెంపు నిబంధన వర్తించదని వెల్లడించింది. కొత్తగా వచ్చే ఏడాది నుంచి జారీ చేయనున్న వీసాలకు మాత్రమే లక్ష డాలర్ల ఫీజు వర్తిస్తుందని వైట్‌హౌస్‌ స్పష్టం చేసింది. 2025 లాటరీ వీసాలకు సైతం పాత ఫీజులే వర్తిస్తాయని వెల్లడించింది. అయితే కొత్తగా హెచ్‌1 బి వీసాకు దరఖాస్తు చేసుకునే వారు లక్ష డాలర్ల ఫీజు జీవిత కాలానికి ఒకసారి మాత్రమే చెల్లించాల్సి […]

అత్యధిక హెచ్‌1బీ వీసా ఉద్యోగులను కలిగిన కంపెనీ ఇదే..

భారత టెక్ సంస్థలతో పాటు అమెరికాకు చెందిన పలు టెక్ కంపెనీలు కూడా హెచ్1బీ వీసాలతో ఎక్కువ మంది భారతీయులను నియమించుకుంటున్నాయి యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరం జూన్ 30 వరకు అమెరికా జారీ చేసిన మొత్తం వీసాల్లో అమెజాన్ సంస్థ ఎక్కువగా దక్కించుకుంది. అమెజాన్- 10,044 | TCS- 5,505 | మైక్రోసాఫ్ట్- 5,189 | మెటా- 5123 | ఆపిల్- 4,202 | గూగుల్ […]

టెలికాం సర్వీసుల్లో అంతరాయం.. అమెరికాలో 1,800 విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం

అగ్రరాజ్యం అమెరికాలో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. టెలికాం సర్వీసుల్లో సాంకేతిక సమస్య డల్లాస్‌ సహా మరో రెండు విమానాశ్రయాల్ల 1,800కిపైగా విమానాలు ఆలస్యం అయ్యాయి. వందలాది విమానాలు రద్దయ్యాయి. ఎఫ్‌ఏఏ (FAA)తో సంబంధం లేని స్థానిక టెలిఫోన్‌ కంపెనీ పరికరాల్లో సమస్య కారణంగా సమస్య తలెత్తినట్లు ఎఫ్‌ఏఏ తెలిపింది. సమస్యను గుర్తించేందుకు టెలిఫోన్‌ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON