loader

ఐరాస వేదికగా పాక్‌ ప్రధానికి గట్టిగా బదులిచ్చిన పేటల్‌ గహ్లోత్‌..

పాకిస్థాన్ తన విదేశాంగ విధానంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ వేదికలపై అబద్ధాలను చెబుతోందంటూ ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, ఎగుమతి చేయడంలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని, అంతర్జాతీయ వేదికపై పాక్‌ ప్రధానిని కడిగిపారేసిన ఈ యువ దౌత్యవేత్త గురించి ప్రస్తుతం తీవ్రంగా చర్చ నడుస్తోంది. పేటల్‌ గహ్లోత్‌ న్యూఢిల్లీలో జన్మించారు. ముంబైలోని సెయింట్‌ జేవియర్‌ కాలేజీ నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. 2015లో IFS లో చేరి దౌత్యవేత్తగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఈ […]

పాక్ ప్రధాని, ఆర్మీచీఫ్ తో ట్రంప్ ప్రత్యేక భేటీ

మారిన రాజకీయ, వాణిజ్య సమీకరణాల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ లకు వైట్ హౌస్ లో ఘనస్వాగతం పలికారు. ఈ పరిణామం ఇరుదేశాల మధ్య సంబంధాలలో కొత్త అధ్యాయానికి సంకేతంగా నిలుస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి మర్కో రూబియో కూడా హాజరైన ఈ సమావేశానికి ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ,పాకిస్తాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్ ఇద్దరూ ‘గొప్ప నాయకులు’ అని కొనియాడారు.

అరెస్టు భయంతో సుదీర్ఘ మార్గంలో నెతన్యాహు ప్రయాణం..

ఐక్యరాజ్య సమితి సమావేశానికి హాజరు అయ్యేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అసాధారణ మార్గంలో అమెరికాకు వెళ్లారు. యుద్ధ నేరాల ఆరోపణలపై అరెస్టు వారెంట్లు జారీ కావడంతో యూరప్ గగనతలం మీదుగా వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. సాధారణ మార్గం కాకుండా మొత్తంగా 373 మైళ్ల దూరం (600 కిలో మీటర్లు) అదనంగా ప్రయాణించి అమెరికా చేరుకున్నారు. ఫ్రాన్స్ అనుమతి ఉన్నా ఆ మార్గాన్ని ఎందుకు వద్దనుకున్నారో తెలియదని ఫ్రెంచ్ అధికారి తెలిపారు.

పదవిని వదిలేస్తా : జెలెన్‌స్కీ

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఒక సంచలన నిర్ణయం వెల్లడించారు. రష్యాతో యుద్ధం ముగిసిన తర్వాత తాను పదవిని వదులుకుంటానని ఆయన స్పష్టం చేశారు. అధ్యక్ష పదవిని కొనసాగించడం తన లక్ష్యం కాదని చెప్పారు. ప్రజలకు శాంతిని తీసుకురావడమే తన ప్రాధాన్యం అని స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటే పార్లమెంటు చర్చించాలని కూడా కోరారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.

అమెరికా పొమ్మంటే మా దేశానికి రండి…ఉద్యోగులకు జర్మనీ ఆహ్వానం

విదేశాల్లో పని చేయాలని ఆశపడేవారికి జర్మనీ నుంచి మంచి ఆఫర్ వచ్చింది. అమెరికాలో హెచ్-1బి వీసాల సమస్యలు కొనసాగుతున్న తరుణంలో, జర్మనీ నుంచి ఉద్యోగులకు ఆహ్వానం అందుతోంది. జర్మనీలో ఉన్న భారతీయ రాయబారి ఫిలిప్ అకెర్మాన్ ఎక్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇండియన్ ఎంప్లాయిస్‌కి పిలుపునిచ్చారు. అమెరికా హెచ్-1బి వీసా ఫీజు పెంపు నేపథ్యంలో, జర్మనీ భారతీయులకి ఒక స్థిరమైన, నమ్మకమైన వలస విధానంతో మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ఆయన చెప్పారు.

ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు

అస్సాం సంగీత ప్రపంచంలో అగ్రగామిగా నిలిచిన జుబీన్ గార్గ్ మరణం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఆయన అంత్యక్రియలకు హాజరైన జనసంద్రం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద అంత్యక్రియల గ్యాదరింగ్‌గా దీనిని గుర్తించారు. మైఖేల్ జాక్సన్, పోప్ జాన్ పాల్ II, క్వీన్ ఎలిజబెత్ II తర్వాత ఇంతటి పెద్ద సంఖ్యలో ప్రజలు ఒక కళాకారుడి అంతిమ వీడ్కోలు కార్యక్రమానికి హాజరవడం విశేషమని లిమ్కా బుక్ పేర్కొంది.

చైనాతో జాగ్రత్త.. భారత్‌ను హెచ్చరించిన టిబెట్ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే

ప్రవాసంలో ఉన్న టిబెటన్ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ లోబ్సాంగ్ సంగే సంచలన విషయం వెల్లడించారు. చైనాతో భారత్ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. న్యూఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం భారతీయ రాజకీయనేతలను ప్రభావితం చేసేందుకు చురుకుగా ప్రయత్నిస్తుంటుందని, చివరకు ప్రభుత్వ మార్పుకు సైతం ప్రణాళిక వేస్తుందని అన్నారు. ‘ఎలైట్ -ఆప్షన్ అనేది చైనా అనాదిగా అనుసరిస్తున్న వ్యూహం’ అని ఎన్డీటీవీకి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.

లెజెండరీ అంపైర్ డికీ బిర్డ్ కన్నుమూత

క్రికెట్‌ను ప్రాణంగా ప్రేమించి.. అంపైరింగ్‌ వృత్తిలో విశేషంగా రాణించిన డికీ బిర్డ్ (Dickie Bird) కన్నుమూశాడు. ఇంగ్లండ్‌కు చెందిన ఆయన మంగళవారం తుది శ్వాస విడిచాడు. తనదైన అంపైరింగ్‌తో అభిమానుల మనసులు చూరగొన్న డికీ వృద్ధాప్య సమస్యలతో 92 ఏళ్ల వయసులో మరణించాడు. ఆయన మృతి పట్ల యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్ సంతాపం తెలియజేసింది.  ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో చిరస్థాయిగా ఆయన పేరు నిలిచిపోతుంది అని యార్క్‌షైర్ క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది.

హనుమాన్ విగ్రహం.. అమెరికా నేత వివాదాస్పద వ్యాఖ్యలు!

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం షుగర్ ల్యాండ్ నగరంలోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయం ప్రాంగణంలో ఇటీవలే 90 అడుగుల ఎత్తైన భారీ హనుమాన్ విగ్రహంను ప్రతిష్ఠించారు. టెక్సాస్ రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “టెక్సాస్‌లో ఒక నకిలీ హిందూ దేవుడి నకిలీ విగ్రహాన్ని మనం ఎందుకు అనుమతిస్తున్నాం? మనది ఒక క్రైస్తవ దేశం” అని ఆయన పేర్కొన్నారు. మరో పోస్టులో బైబిల్‌లోని వాక్యాలను ఉటంకిస్తూ, విగ్రహారాధనను వ్యతిరేకించారు.

ఆకాశంలో డ్రోన్ల కలకలం..40కి పైగా విమానాలు రద్దు

యూరోప్ పరిధిలో అనుకోకుండా ఆకాశంలో భారీ సంఖ్యలో డ్రోన్లు కనిపించడం పెద్ద గందరగోళానికి దారి తీసింది. దీంతో కోపెన్‌హేగెన్ (డెన్మార్క్), ఒస్లో (నార్వే) ఎయిర్‌పోర్టులు డ్రోన్ల కారణంగా సజావుగా పనిచేయలేకపోయాయి. విమానాల ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన అధికారులు 40కిపైగా విమానాలను రద్దు చేశారు. మరికొన్ని విమానాలను ఇతర ఎయిర్‌పోర్టులకు మళ్లించారు. ఈ సంఘటనలు ప్రయాణికులకు ఇబ్బందులను కలిగించాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON