loader

ముస్లిం దేశాలను తప్పుదోవ పట్టించిన ట్రంప్?

మధ్యప్రాచ్య శాంతి ప్రయత్నాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా పీస్ డీల్ కు ఖతర్, పాకిస్తాన్ సహా ఎనిమిది ముస్లిం దేశాలు ఇప్పటికే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే<span;>హమాస్‌కు ఒరిజినల్ డీల్ కాకుండా వేరే పేపర్స్ పంపినట్లు అమెరికా ఆధారిత మీడియా రిపోర్టులు వెలువరించాయి. దీంతో ఈ ఒప్పందంపై కొత్త వివాదం తలెత్తింది.

వికిపీడియాకు కౌంట‌ర్‌గా గ్రోకిపీడియా.. ప్ర‌క‌టించిన ఎల‌న్ మ‌స్క్‌

స్పేస్ఎక్స్, టెస్లా సీఈవో ఎల‌న్ మ‌స్క్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వికిపీడియా త‌ర‌హాలో అంత‌కంటే మెరుగైన గ్రోకిపీడియా(Grokipedia)ను డెవ‌ల‌ప్ చేస్తున్న‌ట్లు తెలిపారు. ఆయ‌న కంపెనీకి చెందిన ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ స్టార్ట‌ప్ xAI ఆ కొత్త ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియాను డెవ‌ల‌ప్ చేస్తున్న‌ది. ఈ ప్లాట్‌ఫామ్‌కు గ్రోక్ టెక్నాల‌జీ వాడ‌నున్నారు. మ‌నుషుల‌కు ఏఐ ఉప‌యోగ‌ప‌డే రీతిలో ఉండాల‌ని ఎల‌న్ మ‌స్క్ ఆశిస్తున్న త‌ర‌హాలో కొత్త ఇన్‌సైక్లోపీడియా ఉంటుంద‌ని భావిస్తున్నారు.

అమెరికాలో షట్‌డౌన్ ప్రారంభం

అమెరికాలో దాదాపు ఏడు సంవత్సరాల విరామం తర్వాత తొలిసారిగా అమెరికా షట్ డౌన్ బాట పట్టింది. ప్రభుత్వ ఖర్చులకు నిధులు సమకూర్చే బిల్లును సెనేట్ ఆమోదించడంలో విఫలం కావడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది అటువంటి పరిస్థితిలో, అమెరికా ప్రభుత్వం అనవసర సేవలను నిలిపివేయవలసి వస్తుంది. నిధుల ఆమోదించబడే వరకు అవసరం లేని ప్రభుత్వ విభాగాలు, సేవలు మూసివేయాలి. దీనిని అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ అని పిలుస్తారు.

ఐఐటీ హైదరాబాద్‌తో ఆటా ఒప్పందం

అమెరికన్ తెలుగు అసోసియేషన్ IIT Hyderabad తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఇంజినీరింగ్‌లో దేశంలోనే 7వ ర్యాంక్, ఆవిష్కరణల్లో 6వ ర్యాంక్ సాధించిన ఐఐటీ హైదరాబాద్‌తో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తెలుగు డయాస్పోరాకు చెందిన విద్యార్థులకు ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించడమే ఈ ఒప్పందం లక్ష్యం. ఇటీవల వాషింగ్టన్ డీసీ లో జరిగిన కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ […]

ట్రంప్ ప్రకటనతో గాజాలో యుద్ధం ముగింపుకు సన్నాహాలు?

డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన ఈ శాంతి ప్రణాళికకు మొత్తం 8 అరబ్, ముస్లిం దేశాలు తమ సమ్మతిని తెలిపాయి. హమాస్ కనుక శాంతి ప్రతిపాదనను అంగీకరిస్తే, యుద్ధం తక్షణమే ముగుస్తుందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ సైన్యం గాజా నుంచి వెనక్కి తగ్గుతుందని.. అన్ని సైనిక కార్యకలాపాలు నిలిపివేయబడతాయన్నారు. ఒకవేళ హమాస్ ఈ శాంతి ప్రణాళికను తిరస్కరిస్తే, హమాస్‌ను పూర్తిగా నాశనం చేయడానికి ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇస్తుంది. ఇజ్రాయెల్ సైన్యంతో కలిసి అమెరికా సైన్యం […]

ట్రంప్ షాక్: అమెరికాలో లక్ష మంది ఉద్యోగులు ఔట్!

డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాల కారణంగా, నేటి నుంచే (సెప్టెంబర్ 30) దాదాపు లక్ష మంది ఫెడరల్ ఉద్యోగులు తమ విధులనుంచి వైదొలిగారు. డిఫర్డ్ రెసిగ్నేషన్ ప్రోగ్రామ్ (DRP)’ పేరుతో ట్రంప్ సర్కార్ ఒక ప్రత్యేక పథకాన్ని అమలు చేసింది. దీని ప్రకారం, ఉద్యోగులు సెప్టెంబర్ 30లోపు స్వచ్ఛంద రాజీనామా చేస్తే, ఆ తేది వరకు పనికి రాకపోయినా పూర్తి జీతభత్యాలు పొందే వీలు కల్పించారు. కొత్త నియామకాలపై నిషేధం,వంటి చర్యలతో, వేలాది మంది ఉద్యోగులు […]

సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తాం: నేపాల్‌ ప్రధాని కర్కి

తమ మధ్యంతర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం సకాలంలోనే సాధారణ ఎన్నికలు నిర్వహించడానికి కట్టుబడి ఉందని నేపాల్ ప్రధాని సుశీలా కర్కి వెల్లడించారు. నేపాల్‌లో అత్యంత వైభవంగా జరుపుకునే పండగల్లో విజయదశమి ఒకటి. బడాదషైన్ అని ఈ పండగను పిలుస్తారు. ఈ సందర్భంగా ప్రధాని కర్కిల్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ షెడ్యూల్ తేదీకే ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

ట్రంప్ సంచలన నిర్ణయం.. ఈసారి సినిమాలపై..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆయన దృష్టి సినిమాలపై పడింది. అమెరికా వెలుపల నిర్మించే చిత్రాలపై 100 శాతం సుంకం విధిస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా కాలిఫోర్నియాకు ఉన్న అసమర్థ, బలహీన గవర్నర్ వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. దీర్ఘకాలికంగా ఉన్న ఈ సమస్యను 100 శాతం సుంకం విధించడం ద్వారా పరిష్కరించి అమెరికాను మరోసారి అగ్రస్థానంలో నిలుపుతాను’’ అని ట్రూత్‌లో ట్రంప్ పేర్కొన్నారు.

పాల‌స్తీనాకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డ‌మంటే.. యూదుల‌ను చంప‌డ‌మే: నెత‌న్య‌హూ

ఐక్య‌రాజ్య‌స‌మితి స‌మావేశాల్లో ఇజ్రాయిల్ ప్ర‌ధాని బెంజిమిన్ నెత‌న్య‌హూ ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో కొన్ని దేశాల ప్ర‌తినిధులు వాకౌట్ చేశారు. ఈ ఘ‌ట‌న శుక్ర‌వారం జ‌రిగింది. కొన్ని దేశాల ప్ర‌తినిధులు మాత్రం నెత‌న్య‌హూ మాట్లాడుతున్న స‌మ‌యంలో లేచి నిల‌బ‌డి చ‌ప్ప‌ట్లు కొట్టారు. పాల‌స్తీనాకు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని వాదిస్తున్న ప‌శ్చిమ దేశాల‌ను నెత‌న్య‌హూ త‌ప్పుప‌ట్టారు. యూదుల‌ను ఊచ‌కోత కోసేందుకు ప‌శ్చిమ దేశాలు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు.

హెలికాప్టర్‌లో ట్రంప్‌ దంపతులు గొడవ..? వీడియో వైరల్‌

న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాలకు ట్రంప్‌ తన భార్య మెలానియాతో కలిసి హాజరైన విషయం తెలిసిందే. సమావేశాల అనంతరం మెరైన్‌ వన్ హెలికాప్టర్‌లో అధ్యక్షుడి దంపతులు తిరుగు పయనమయ్యారు. ఆ సమయంలో హెలికాప్టర్‌లో ఎదురెదురుగా కూర్చున్న ట్రంప్‌-మెలానియా ఒకరివైపు ఒకరు వేలు చూపించుకుంటూ మాట్లాడుతూ కనిపించారు. వారిద్దరూ ఏదో విషయంపై గొడవ పడుతున్నట్లు ఆ వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON