loader

నేను చెప్పినట్టు చేయకపోతే.. హమాస్‌కు డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ వార్నింగ్

ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు పాలస్తీనా ఉగ్ర సంస్థ హమాస్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు మరి కొన్ని గంటల్లో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ హమాస్‌కు తుది హెచ్చరిక చేశారు. తాను సూచించినట్టు గాజాపై హమాస్ తన అధికారాన్ని వదులుకోకపోతే భూమ్మీద లేకుండా పోతుందని హెచ్చరించారు. గాజాపై దాడుల నిలిపివేతకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ సిద్ధంగానే ఉన్నారని అన్నారు. అమెరికా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లేందుకు ఆయన సిద్ధమేనని చెప్పారు.

ఎలోన్ మస్క్ కారణంగా నెట్‌ఫ్లిక్స్ రూ.2 లక్షల కోట్ల నష్టం!

మస్క్, కొంతమంది నెట్‌ఫ్లిక్స్ లింగమార్పిడి సమస్యలను ప్రోత్సహిస్తోందని, ‘వోక్ ఎజెండా’ను ప్రచారం చేస్తోందని ఆరోపించారు పిల్లల మానసిక ఆరోగ్యం కోసం, నెట్‌ఫ్లిక్స్ చూడటం ఆపాలని మస్క్ అన్నారు మస్క్ సోషల్ మీడియా పోస్ట్ తర్వాత, నెట్‌ఫ్లిక్స్ షేర్లు పడిపోవడం ప్రారంభించాయి. ట్రేడింగ్ రోజులు గడిచేకొద్దీ కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.2 లక్షల కోట్లు తగ్గింది.

తమ దేశంలో ఖలిస్థానీ సంస్థలకు నిధులు అందుతున్నాయని అంగీకరించిన కెనడా

కెనడా ప్రభుత్వం ఇటీవలే ఖలిస్థానీ వేర్పాటువాద సంస్థలకు నిధులు తమ దేశం నుంచే వాస్తవాన్ని తొలిసారి అధికారికంగా అంగీకరించింది.కెనడా ప్రభుత్వం ఈ విషయాన్ని తన మానీలాండరింగ్, ఉగ్రవాద ఫండింగ్ పరిశీలనలలో భాగంగా ప్రకటించింది. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్ వంటి ఖలిస్థానీ వేర్పాటువాద గ్రూపులతో పాటు హమాస్, హెజ్‌బొల్లా వంటి సంస్థలు కూడా కెనడాలోని వ్యక్తులు, సంస్థల నుంచి ఆర్థిక సహాయం పొందుతున్నాయని ఆ నివేదిక వెల్లడించింది.

జపాన్‌ను వణికించిన భారీ భూకంపం..

జపాన్‌లో భారీ భూకంపం వచ్చింది. హోన్షు తూర్పు తీరానికి సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 6.0గా నమోదయింది. 50 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్లు లోతులో ఉందని వెల్లడించింది. భూకంపం ధాటికి భూకంపం ధాటికి పలు చోట్ల భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల పాక్షికంగా కూలిపోయాయి. తీర ప్రాంతం కావడం వల్ల సముద్రం అల్లకల్లోలానికి గురైంది. 

ఉక్రెయిన్‌ ప్రయాణికుల రైలుపై రష్యా డ్రోన్ దాడి

రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత తీవ్రం అవుతోంది. ఉక్రెయిన్‌లోని ఉత్తర సుమీ ప్రాంతంలోని ఒక రైల్వే స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యన్ దళాలు డ్రోన్‌లతో దాడి చేశాయి. ఈ దాడి సమయంలో కీవ్‌కు వెళ్తున్న ఒక ప్రయాణికుల రైలుపై బాంబులు పడ్డాయి. ఫలితంగా, రైల్‌లోని కొన్ని బోగీలు మంటల్లో కాలిపోయాయి. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రాణ నష్టం గురించి ఇంకా స్పష్టమైన సమాచారం లేదు.

సింగ‌పూర్ హోట‌ల్‌లో సెక్స్ వ‌ర్క‌ర్ల‌పై దాడి.. ఇద్ద‌రు భార‌తీయ టూరిస్టుల‌కు జైలుశిక్ష‌

సింగ‌పూర్‌లోని హోట‌ల్‌లో సెక్స్ వ‌ర్క‌ర్ల‌పై దాడి చేసిన ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు భార‌తీయ టూరిస్టు ల‌కు జైలుశిక్ష ప‌డింది. దాడితో పాటు దొంగ‌తనానికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ ఇద్ద‌రికీ అయిదేళ్ల శిక్ష ఖ‌రారు చేశారు. దీంతో పాటు ఒక్కొక్క‌రికి 12 లాఠీబెబ్బ‌ల శిక్ష కూడా వేశారు. నిందితుల‌ను 23 ఏళ్ల అర‌క్కొయిసామి డైస‌న్‌, 27 ఏళ్ల రాజేంద్ర‌న్ మైల‌ర‌స‌న్‌గా గుర్తించారు.

లాస్‌ ఏంజిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. అగ్నిగోళంగా ఆకాశం..

అమెరికా కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజిల్స్‌ నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దక్షిణంగా ఉన్న శివారు ప్రాంతమైన ఎల్‌ సెగుండో ప్రాంతంలో గల చెవ్రాన్‌ చమురు శుద్ధి కర్మాగారం లో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి మంటలు చెలరేగాయి. కాసేపటికే మంటలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఎగసిపడడ్డాయి. దీంతో ఆకాశం మొత్తం అగ్నిగోళాన్ని తలపించింది.

కెనడాలో భారతీయ సినిమాలపై దాడులు

కెనడాలో భారతీయ చిత్రాలను ప్రదర్శిస్తున్న థియేటర్‌పై దుండగులు దాడి చేయడంతో కలకలం రేగింది. దక్షిణాసియాకు చెందిన సినిమాలు ప్రదర్శిస్తున్నందుకు వ్యతిరేకంగా ఈ చర్యలు జరిగినట్లు సమాచారం. ఈ హింసాత్మక ఘటనల తరువాత, థియేటర్ యాజమాన్యం తాత్కాలికంగా భారతీయ సినిమాల ప్రదర్శనలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఘటన కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లోని ఓక్‌విల్ నగరంలోని Film.Ca Cinemasలో చోటుచేసుకుంది.

భారత్, చైనా డీల్.. విమాన సర్వీసుల పునఃప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

కోవిడ్-19 , గల్వాన్‌ లోయలో సైనికుల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా ఐదేళ్లుగా నిలిచిపోయిన భారత్-చైనా విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయి. అక్టోబరు 2న భారత విదేశాంగ శాఖ ఈ ఒప్పందాన్ని ప్రకటించింది. ఈ నెల 26 నుంచి విమాన సేవలు మొదలవుతాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడుతున్నాయి. పర్యాటకం, వాణిజ్యం, వ్యాపార భాగస్వామ్యాలను ప్రోత్సహించడమే లక్ష్యం. ఇండిగో కోల్‌కతా-గ్వాంగ్జూ సర్వీసులను ప్రకటించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON