loader

భారత్ మద్దతిస్తుందని ఆశిస్తున్నాం: US

 అమెరికా ట్రెజరీ సెక్రటరీ ‘స్కాట్ బెస్సెంట్’ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాకు వ్యతిరేకంగా భారత్ మద్దతు ఇవ్వాలని ఆశిస్తున్నట్లు    రేర్ ఎర్త్ మెటల్స్’ ఉత్పత్తి, సరఫరాపై చైనా పెంచుకుంటున్న ఆధిపత్యాన్ని అడ్డుకోవడంలో భారత్, యూరోపియన్ దేశాలు అమెరికాతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ సామగ్రి తయారీలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. చైనా ఈ వనరులలో దాదాపు 70% సరఫరాను నియంత్రిస్తుండటంతో, అమెరికా […]

కీలక సమాచారం లీక్‌.. అమెరికాలో భారత సంతతి నిపుణులు అరెస్ట్‌

అమెరికా నిఘా సంస్థలు దిగ్భ్రాంతికరమైన విషయాన్ని వెల్లడించాయి. భారత సంతతికి చెందిన ప్రముఖ అమెరికా విశ్లేషకుడు, దక్షిణాసియా విధానంపై అమెరికా విదేశాంగ శాఖ ఉద్యోగి, సలహాదారుడు ఆష్లే టెల్లిస్ రహస్య పత్రాలను దాచిపెట్టి చైనా ప్రభుత్వ అధికారులను కలిశాడనే ఆరోపణలపై అరెస్టు అయ్యారు.విదేశాంగ శాఖలో సీనియర్ సలహాదారుగా, యుద్ధ శాఖ కోసం కాంట్రాక్టర్‌గా పనిచేసిన టెల్లిస్, రహస్య పత్రాలను చట్టవిరుద్ధంగా నిల్వ చేశాడని అమెరికా న్యాయ శాఖ పేర్కొంది.

అట్లాంటాలో పలకబలపంతో తానా పాఠశాల తరగతులు ప్రారంభం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ‘పాఠశాల’ పేరుతో అమెరికాలోని తెలుగు చిన్నారులకు తెలుగు భాషను నేర్పిస్తున్న సంగతి తెలిసిందే. పాఠశాల 2025 – 26 నూతన విద్యా సంవత్సరం అట్లాంటాలో ‘‘పలక బలపం’’ కార్యక్రమంతో విజయవంతంగా ప్రారంభమైంది. గురువుల పరిచయాలతో.. తల్లిదండ్రులు, విద్యార్థులతో ప్రత్యక్ష సంభాషణలతో కార్యక్రమం ఆత్మీయంగా సాగింది. పిల్లల నిరంతర అభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా డిజిటల్‌ రైటింగ్‌ బోర్డులు బహుమతిగా అందజేశారు.

విశాఖకు గూగుల్‌.. ఏఐ హబ్‌ విశేషాలను ప్రధానికి వివరించిన సుందర్‌ పిచాయ్‌

టెక్‌ దిగ్గజం గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్‌ 1 గిగా వాట్‌ సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ డేటా సెంటర్‌ ఆసియాలోనే గూగుల్ సంస్థకు అతి పెద్ద డేటా సెంటర్‌గా నిలవనుంది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ఫోన్‌లో మాట్లాడారు. తమ కంపెనీ తొలి ఏఐ హబ్‌ విశేషాలను ప్రధానికి వివరించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

మరియాకు నోబెల్ ప్రైజ్ పై ఆ దేశ అధ్యక్షుడి మండిపాటు

తమ పౌరుడికి ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం ప్రకటిస్తే ఏ దేశమైనా సంతోషిస్తుంది. కానీ, వెనెజువెలా మాత్రం నోబెల్ కమిటీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో ను(Maria Corina Machado) నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో మండిపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రతీకారంగా నార్వేలోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు వెనెజువెలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

మైక్రోసాఫ్ట్‌కు పోటీగా మాక్రోహార్డ్.. మస్క్ కొత్త ఐడియా

ఎలన్ మస్క్ రీసెంట్ గా మైక్రోసాఫ్ట్ పేరు మాదిరిగా అనిపించే ‘మాక్రోహార్డ్’ అనే పేరును తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. మాక్రోహార్డ్ అనేది పూర్తిగా ఏఐ బేస్డ్ హార్డ్ వేర్ కంపెనీ. మాక్రోహార్డ్ అనేది మైక్రోసాఫ్ట్ కు పోటీగా భిన్నమైన టెక్నాలజీతో డెవలప్ చేస్తున్న కంపెనీ అని చెప్పుకోవచ్చు. మాక్రోహార్డ్ కంపెనీలో ఏఐను ఉపయోగించి వీడియో గేమ్స్, కోడింగ్, రన్నింగ్, కొన్ని కంప్యూటర్ సాఫ్ట్‌వేర్స్ వంటివి డెవలప్ చేస్తారు. ఈ కంపెనీలో మనుషులకు బదులు వర్చువల్ మెషీన్లు […]

రెండేండ్ల తర్వాత ఇజ్రాయెల్‌ బందీలకు విముక్తి.. ఏడుగురిని విడుదల చేసిన హమాస్‌

గాజాలో గత రెండేండ్లుగా సాగుతున్న యుద్ధం ముగిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. తొలి దశ శాంతి ఒప్పందంలో భాగంగా బందీల విడుదల ప్రారంభమైంది. దాదాపు రెండేళ్లుగా హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న వారికి సోమవారం విముక్తి లభించింది ఏడుగురు ఇజ్రాయెల్‌ బందీలను హమాస్‌ విడుదల చేసింది. వారిని రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. దీంతో ఖాన్‌ యూనస్‌ నుంచి వారిని ఇజ్రాయెల్‌ తీసుకెళ్లింది.

టెస్లా కారు డ్రైవ్ చేసిన రోహిత్ శర్మ.. అందుకే యాడ్స్ అవసరం లేదన్న ఎలాన్ మస్క్

హిట్‌మ్యాన్ రోహిత్ తన కొత్త టెస్లా మోడల్ Yని నడుపుతూ కనిపించాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది.   వీడియో ఎలాన్ మస్క్‌ దృష్టికి రాగానే తను స్వయంగా ఈ పోస్ట్‌ను షేర్ చేశాడు. “ఇందుకే టెస్లాకు యాడ్స్, ప్రకటనల అవసరం లేదు” అని మస్క్ రాసుకొచ్చాడు. టెస్లా ప్రకటనలపై డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. హై-ప్రొఫైల్ వినియోగదారులు, సెలబ్రిటీలు టెస్లా కారును ప్రమోట్ చేస్తారు. ఇదే ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లాను “ఇన్నోవేషన్ […]

కుప్పకూలిన హెలికాప్టర్.. ఐదుగురికి గాయాలు

అమెరికాలోని సదర్న్ కాలిఫోర్నియాలో శనివారం ఒక హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ప్రమాదం హంటింగ్టన్ బీచ్ క్లబ్ సమీపంలో, హయత్ హోటల్ దగ్గర జరిగింది. హెలికాప్టర్ అక్కడి సమీప నిర్మాణాన్ని ఢీకొట్టింది. హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు ప్రయాణికులు, రోడ్డుపై ఉన్న ముగ్గురు వ్యక్తులు గాయపడి ఆసుపత్రికి తరలించబడ్డారు. రాయిటర్స్ విడుదల చేసిన వీడియోల్లో పామ్ చెట్ల వెనుక నలిగిపోయిన హెలికాప్టర్ శకలాలు కనిపించాయి, ఎమర్జెన్సీ బృందాలు వెంటనే స్పందించి గాయపడిన వారికి సహాయం […]

తాలిబాన్లతో భీకర ఘర్షణ 12 మంది పాకిస్తాన్ సైనికులు మృతి..

పాకిస్తాన్ ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో పాక్‌కు చెందిన ఏడు చెక్‌పోస్టుల వెంబడి ఆప్ఘాన్‌ అన్ని వైపుల నుంచి కాల్పులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు పాక్‌ సైనికులు మరణించారని ఆఫ్గాన్ చెబుతోంది. మరోవైపు తమ సైన్యం జరిపిన కౌంటర్ ఫైరింగ్ లో పలువురు అఫ్గాన్‌ సైనికులు మృతి చెందారని పాకిస్తాన్ వెల్లడించినట్లు పిటివి న్యూస్ పేర్కొంది

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON