loader

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. నార్త్‌ కరోలినాలో శుక్రవారం సాయంత్రం జరిగిన కాల్పుల ఘటనలో అనేక మంది గాయపడ్డారు. క్రిస్మస్‌ నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు దాదాపు 200 మందికిపైగా హాజరయ్యారు. రాత్రి 7:30 గంటల సమయంలో అక్కడ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ప్రమాద సమయంలో అక్కడ 200 నుంచి 300 మంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు […]

ఎలాన్ మస్క్ సంచలనం! వాట్సాప్, అరట్టైకి పోటీగా కొత్త యాప్ విడుదల!

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో కొత్త మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ X చాట్‌ను ప్రారంభించింది. WhatsApp, Arattai వంటి ప్రసిద్ధ మెసేజింగ్ యాప్‌లకు పోటీగా.. X చాట్ పూర్తిగా సురక్షితమైన మెసేజింగ్ కోసం రూపొందించారు. ప్రతి చాట్, అది టెక్స్ట్ అయినా లేదా మీడియా ఫైల్ అయినా, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేస్తారు. అంటే పంపేవారు, స్వీకర్త కాకుండా మరెవరూ సందేశాన్ని చూడలేరు.స్క్రీన్‌షాట్‌లను బ్లాక్ చేసే ఫీచర్ ఇచ్చారు. అంతేకాకుండా, ఎవరైనా మీ చాట్‌ను స్క్రీన్‌షాట్ చేయడానికి ప్రయత్నిస్తే, మీకు […]

7 కిలో మీటర్ల పొడవు,80 గదులతో.. గాజాలో హమాస్ భారీ సొరంగం

ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దాడులు కొనసాగిస్తున్న హమాస్‌కు చెందిన అతిపెద్ద భూగర్భ టెర్రర్ కాంప్లెక్స్‌ను ఇజ్రాయెల్ దళాలు గాజాలో గుర్తించాయి. ఈ సొరంగం దాదాపు 7 కిలో మీటర్ల పొడవు, 25 మీటర్ల లోతుతో ఉంది. కేవలం 80 గదులు, వెస్ట్రన్ టాయిలెట్లు, కమాండ్ కంట్రోల్ రూమ్‌లతో సహా దాదాపు ఒక భూగర్భ నగరమే నిర్మించుకున్నట్లు ఐడీఎఫ్‌ నిర్ధారించింది. హమాస్ కీలక నేతలైన మొహమ్మద్ సిన్వార్ సహా పలువురు ఇందులో తలదాచుకునేవారని ఇజ్రాయెల్ తెలిపింది.

కాప్‌30 స‌ద‌స్సులో అగ్ని ప్ర‌మాదం.. 21 మందికి గాయాలు..

బ్రెజిల్‌లోని బీల‌మ్ సిటీలో జ‌రుగుతున్న యూఎన్ కాప్‌30(UN COP30)  స‌ద‌స్సులో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఆ ప్ర‌మాదంలో 21 మంది గాయ‌ప‌డ్డారు. వేల సంఖ్య‌లో ప్ర‌తినిధులు సుర‌క్షిత ప్రాంతానికి ప‌రుగులు తీశారు. గురువారం మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల స‌మ‌యంలో ఓ పెవిలియ‌న్‌లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. స‌ద‌స్సు కోసం ఏర్పాటు చేసిన బ్లూ జోన్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. సుమారు ఆరు గంట‌ల వ్య‌వ‌ధి త‌ర్వాత మ‌ళ్లీ స్టాల్స్‌ను ఓపెన్ చేశారు. 21 మందికి చికిత్స అందించిన‌ట్లు బ్రెజిల్ […]

మెక్సికో యువతిని వరించిన మిస్ యూనివర్స్ కిరీటం

మిస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ అందుకున్నారు. థాయ్‌లాండ్‌లో నాంథబురిలోని ఇంపాక్ట్ ఛాలెంజర్ హాల్‌‌లో జరిగిన ఈ తుది పోటీల్లో ఈ మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఫాతిమా బాష్ సొంతం చేసుకున్నారు. ఈ పోటీల్లో భారత్ నుంచి పాల్గొన్న మణిక విశ్వకర్మ టాప్ 30కు చేరారు. కానీ ఆమె టాప్ 12కు అర్హత సాధించలేక పోయారు. ఫస్ట్ రన్నర్ అప్: థాయ్‌లాండ్ – ప్రవీణార్ సింగ్, సెకెండ్ రన్నర్ అప్: వెనిజులా – […]

న్యూమోకోకల్ కన్జువేట్ వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌వో అనుమతి..

ఫార్మాసూటిల్ కంపెనీ బయలాజికల్ ఈ లిమిటెడ్ కంపెనీ మరో ముందడుగు వేసింది. ఆ కంపెనీ ఇటీవల తయారు చేసిన 14 వలెంట్ న్యూమోకోకల్ కన్జువేట్ వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ ముందస్తు అర్హత (ప్రీ-క్వాలిఫికేషన్) స్టేటస్ ఇచ్చింది. ఈ వ్యాక్సిన్‌ 14 రకాల స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా బ్యాక్టీరియా నుంచి రక్షణనిస్తుంది. ఆరువారాల వయసున్న శిశువుల్లో న్యూమోనియా, మెనింజైటిస్‌తో పాటు సెప్సిస్‌ వంటి వ్యాధులను PNEUBEVAX 14 నయం చేయగలదు.

నేపాల్‌లో మరోసారి జెన్ జీ నిరసనలు… కర్ఫ్యూ విధింపు…

నేపాల్‌లో మరోసారి నిరసనలు చెలరేగాయి. దేశంలో జెన్ జీ యువత మరోసారి ఆందోళనకు దిగడంతో అనేక ప్రాంతాల్లో కర్ఫూ విధించారు. వివరాలు… నేపాల్‌లోని బారా జిల్లాలో గురువారం ఉద్రిక్తతలు పెరిగాయి. జెన్ జీ నిరసనకారులు, మాజీ ప్రధాన మంత్రి కెపి శర్మ ఓలి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) మద్దతుదారుల మధ్య తిరిగి ఘర్షణలు చెలరేగాయి. దీంతో అధికారులు తిరిగి పగటిపూట కర్ఫ్యూ విధించారు

భారత్ కు రష్యా SU-57 జెట్ల పంపిణీకి సిద్ధం

భారతదేశానికి రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ అయిన ఎసు-57ను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎలాంటి షరతులు లేకుండా టెక్నాలజీ ట్రాన్ ఫర్ చేసేందుకు సిద్ధమని రష్యన్ కంపెనీ రోస్టెక్ సీఈవో సెర్గీ చెమెజోవ్ దుబాయ్ ఎయిర్ షోలో అన్నారు. రష్యన్ SU ఎసు-57 జెట్లను అమెరికా ఎఫ్-35 జెట్కు పోటీగా భావిస్తారు. ప్రస్తుతం ప్రపంచంలో 5వ తరం స్టెల్త్ ఫైటర్ టెక్నాలజీ కేవలం అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే […]

ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం కేసులో కీలక పరిణామం..

అమెరికాలో ఫైనాన్షియ‌ర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌ కేసుకు సంబంధించిన ఫైల్స్‌ను బహిర్గతం చేసే బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు 2002-2005 మధ్య కాలంలో మైనర్‌ బాలికలను, యువతులకు డబ్బు ఆశ చూపించి తన నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడని ఆరోపణలతో 2019 ఎప్‌స్టీన్‌ను అరెస్ట్‌ చేయగా, జైలు గదిలో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన సన్నిహితుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సహా, మాజీ అధ్యక్షులు, రాజకీయ, వ్యాపార వేత్తలు కూడా ఉన్నట్లు ఇటీవలే […]

గ్రామీ అవార్డుల‌కు నామినేట్ అయిన ద‌లైలామా

నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత ద‌లైలామా.. తొట్ట‌తొలి సారి గ్రామీ అవార్డుల‌కు నామినేట్ అయ్యారు. ఆధ్యాత్మిక ప్ర‌వ‌చ‌నాల‌కు చెందిన ద‌లైలామా ఆల్బ‌మ్ ఆ పోటీలో ఉన్న‌ది.. ద రిఫ్లెక్స‌న్స్ ఆఫ్ హిజ్ హోలీనెస్ ద ద‌లైలామా అన్న టైటిల్‌తో ఉన్న ఆల్బ‌మ్ గ్రామీల‌కు పోటీప‌డుతున్న‌ది. 90 ఏళ్ల వ‌య‌సులో ద‌లైలామా ఆ అవార్డుకు నామినేట్ కావ‌డం ఓ మైలురాయిగా భావిస్తున్నారు. బెస్ట్ ఆడియో బుక్‌, నారేష‌న్‌, స్టోరీ టెల్లింగ్ రికార్డింగ్ కేట‌గిరీల్లో ద‌లైలామా ప్ర‌వచ‌నాల ఆడియో పోటీప‌డుతున్న‌ది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON