అమెరికాలో ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన ఫైల్స్‌ను బహిర్గతం చేసే బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు 2002-2005 మధ్య కాలంలో మైనర్ బాలికలను, యువతులకు డబ్బు ఆశ చూపించి తన నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడని ఆరోపణలతో 2019 ఎప్స్టీన్ను అరెస్ట్ చేయగా, జైలు గదిలో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన సన్నిహితుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా, మాజీ అధ్యక్షులు, రాజకీయ, వ్యాపార వేత్తలు కూడా ఉన్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

