loader

వైట్ హౌస్ వద్ద కాల్పులు.. వాషింగ్టన్ లో హైఅలర్ట్

వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్‌కు సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులపై కాల్పులు జరిగి హల్‌చల్ మాచాయి. ఈ ఘటన సమయంలో  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే తీసిన ప్రత్యక్ష సాక్షుల వీడియోలో కాల్పుల తర్వాత పరిస్థితులు, పోలీసుల స్పందన స్పష్టంగా కనిపిస్తున్నాయి

హసీనా అప్పగింతపై స్పందించిన భారత్

మరణ శిక్ష పడ్డ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలనే బంగ్లాదేశ్ అభ్యర్థనపై పరిశీలిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం తెలిపారు. జుడిషియల్, అంతర్గత న్యాయచట్టపరమైన కోణాలలో బంగ్లాదేశ్ డిమాండ్‌ను పరిశీలిస్తున్నట్లు జైస్వాల్ తెలిపారు.బంగ్లాదేశ్ ప్రయోజనాలకు భారత్ కట్టుబడి ఉంటుంది. శాంతి, ప్రజాస్వామ్యం, సమీకృత విధానం, స్థిరత్వం వంటి పలు కీలక విషయాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.

అపార్టుమెంట్లలో అగ్నికీలలు.. పన్నెండుగురు దుర్మరణం.. లోపలే వందల మంది..

హాంకాంగ్‌ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. థాయ్‌ పొ (Thai po) నగర సమీపంలోని అపార్టుమెంట్ల సముదాయంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ మంటల్లో చిక్కుకుని 12 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో 8 మంది మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారని చెప్పారు. అపార్టుమెంట్ల సముదాయం చుట్టూ వెదురు బొంగులతో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి, దానికి గ్రీన్‌ నెట్‌ తగిలించారని, ఆ ఫెన్సింగ్‌ మంటలు అంటుకుని మొత్తం నాలుగు బ్లాకులకు చుట్టుకున్నాయని అధికారులు తెలిపారు.

ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ?”: కలవాలని సోదరీమణుల డిమాండ్

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్న నేపథ్యంలో.. ఆయన మరణించారనే వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీంతో ఆయనకు ఏమైందో తెలుసుకోవాలని ఆయన సోదరీమణులు గొడవ చేస్తున్నారు. 71 ఏళ్ల సోదరి నొరీన్ నియాజీ.. తమను చీకట్లో జుట్టు పట్టుకుని నేలపై పడేసి, రోడ్డుపై లాక్కెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు వారాలకు పైగా ఇమ్రాన్ ఖాన్‌ను కలవడానికి అనుమతి నిరాకరించిన నేపథ్యంలో.. ఈ దాడి ప్రణాళికాబద్ధమైన దౌర్జన్యం అని పీటీఐ పేర్కొంది.

ఇమ్రాన్ ఖాన్‌ను జైలులో హత్య చేశారా?, ఆయన ఇప్పుడు ప్రాణాలతో లేరా?

ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం పాకిస్తాన్ రావల్పిండిలో అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురై ఉండొచ్చని పాకిస్తాన్‌‌లో ప్రచారం సాగుతుంది. బెలూచిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సహా అనేక సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఇమ్రాన్ ఖాన్ జైలులో హత్యకు గురయ్యారనే పోస్టులు కనిపించాయి. ఇమ్రాన్ ఖాన్‌ను ఐఎస్ఐ చంపి ఉండొచ్చని కూడా ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటివరకు పాకిస్తాన్ అధికారుల నుంచి ఎలాంటి ధ్రువీకరణ వెలువడలేదు

హేలీ గుబ్బి విస్పోటనం.. భారత్ కు తప్పిన ముప్పు

ఆఫ్రికా దేశం ఇథియోపియాలోని హేలీ గుబ్బి ఆగ్నిపర్వతంలో ఆదివారం జరిగిన విస్పోటనం కలకలం రేపింది. దాని నుంచి వెలువడిన ప్రమాదకర బూడిదతో ఏర్పడిన మేఘాలు భారత్ లోని వాయవ్య, పశ్చిమ, ఉత్తర ప్రాంతాల వైపుగా వస్తున్నాయంటూ అలర్ట్ వచ్చింది. తొలుత భారత్ లోని వాయవ్య ప్రాంతంలోకి ప్రవేశించిన ఈ మేఘాలు, చివరకు చైనా దిశగా రూటును మార్చుకున్నాయి. దీంతో ఇంకొన్ని రోజులపాటు మనదేశంలో విమాన సర్వీసులు ప్రభావితం అవుతాయనే ఆందోళనలు తప్పాయి.

అఫ్గాన్‌లో బాంబు దాడి. 9 మంది చిన్నారులు మృతి

అఫ్గానిస్థాన్‌లో సోమవారం అర్థరాత్రి బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో తొమ్మిది మంది చిన్నారులతో సహా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు పాకిస్థాస్ కారణమని తాలిబన్ ప్రభుత్వం ఆరోపించింది. తమ దేశ:లోని పౌరల ఇళ్లను టార్గెట్ చేసిందని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ దాడిపై పాకిస్థాన్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అఫ్గాన్ టీటీపీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుందని పాక్ నిందిస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో ప్రత్యక్ష యుద్ధానికి కూడా వెనుకాబోమని దేశ్ మంత్రి […]

ప్రపంచ టెక్ కంపెనీ యాపిల్‌లో ఉద్యోగాల కోత

సిలికాన్ వ్యాలీ అంతటా పెద్ద ఎత్తున జరిగిన తొలగింపులను ఎక్కువగా తప్పించుకున్న యాపిల్ (Apple) కూడా ఇప్పుడు తన సేల్స్ విభాగంలో ఉద్యోగాల కోతలను ప్రకటించింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ తొలగింపులు చాలా తక్కువ సంఖ్యలో ఉద్యోగులపై మాత్రమే ప్రభావం చూపాయని యాపిల్ తెలిపింది. ఇతర విభాగాలలో నియామకాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. ప్రభావితమైన సిబ్బంది సంస్థలో కొత్త పాత్రలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆపిల్ పేర్కొంది.

హైలీ గుబ్బి అగ్నిపర్వత విస్పోటనం.. ఢిల్లీకి చేరిన పొగ మబ్బులు

ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో బద్దలైన ఓ అగ్నిపర్వత ధూళి ఢిల్లీ మీదుగా కదులుతున్నది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో అవి దేశ రాజధానికి చేరుకున్నాయని ఇండియా మెట్‌స్కై వెదర్‌ వెల్లడించింది. ఇథియోపియాలోని ఎర్టా అలే రేంజ్‌లో ఉన్న హైలీ గుబ్బి అగ్నిపర్వతం (Hayli Gubbi Volcano) సుమారు 10 వేల ఏండ్ల తర్వాత ఆదివారం పేలిన విషయం తెలిసిందే. దీని నుంచి పెద్ద ఎత్తున బూడిద, సల్ఫర్‌డయాక్సైడ్‌, ధూళితో కూడిన పొగ మబ్బులు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి.

భారత్‌కు మరింత డిస్కౌంట్‌తో రష్యన్ ఆయిల్..

రష్యా అగ్రశ్రేణి చమురు ఉత్పత్తి సంస్థలైన రాస్‌నెఫ్ట్, లోకోయిల్‌పై అమెరికా ఆర్థిక ఆంక్షలు అమల్లోకి రావడంతో క్రూడాయిల్ ధరలు రికార్డు స్థాయిలో తగ్గాయి. దీంతో భారత్ రిఫైనరీలకు రష్యా చమురు మరింత భారీ డిస్కౌంట్‌తో లభించనుంది. అమెరికా ఆంక్షలు విధించడానికి ముందు బ్యారెల్‌కు మూడు డాలర్ల తగ్గింపు మాత్రమే లభించేది. ఆమెరికా ఆంక్షల కారణంగా ఆ డిస్కౌంట్ ఏడు డాలర్లకు చేరింది. ఈ కొత్త డిస్కౌంట్ డిసెంబర్‌లో లోడ్ చేసి జనవరిలో భారత్‌కు చేరే చమురుకు వర్తిస్తుంది

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON