ఆఫ్రికా దేశం ఇథియోపియాలోని హేలీ గుబ్బి ఆగ్నిపర్వతంలో ఆదివారం జరిగిన విస్పోటనం కలకలం రేపింది. దాని నుంచి వెలువడిన ప్రమాదకర బూడిదతో ఏర్పడిన మేఘాలు భారత్ లోని వాయవ్య, పశ్చిమ, ఉత్తర ప్రాంతాల వైపుగా వస్తున్నాయంటూ అలర్ట్ వచ్చింది. తొలుత భారత్ లోని వాయవ్య ప్రాంతంలోకి ప్రవేశించిన ఈ మేఘాలు, చివరకు చైనా దిశగా రూటును మార్చుకున్నాయి. దీంతో ఇంకొన్ని రోజులపాటు మనదేశంలో విమాన సర్వీసులు ప్రభావితం అవుతాయనే ఆందోళనలు తప్పాయి.

