loader

ఇజ్రాయెల్ బిగ్ షాక్ ఇచ్చిన ఇరాన్..అతిపెద్ద చమురు కేంద్రంపై దాడి

ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి హైఫా నగరంలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం (బజాన్ రిఫైనరీ)పై ఇరాన్ క్షిపణులతో భారీ దాడికి తెగబడింది. ఈ దాడి కారణంగా రిఫైనరీలో భారీ ఎత్తున మంటలు చెలరేగగా, ఆకాశమంతా నల్లటి పొగ కమ్ముకుంది. బజాన్ రిఫైనరీ లక్ష్యంగా దాడి జరగడం ఇది రెండోసారి కావడంతో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలపై చర్చ మొదలైంది. ఈ దాడి వల్ల చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడటమే కాకుండా, ఇజ్రాయెల్ ఇంధన రంగంపై తీవ్ర […]

రష్యాలో వరద బీభత్సం! కొట్టుకుపోతున్న కార్లు

రష్యాలోని దక్షిణ ప్రాంతమైన దగేస్థాన్లో కుండపోత వర్షాలు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. రాజధాని నగరం మఖచ్కలా (Makhachkala) జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో శనివారం అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భారీ వరదల కారణంగా విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని, సుమారు 3.27 లక్షల మంది చీకట్లోనే గడుపుతున్నారు. రోడ్లు, నివాస సముదాయాలు చెరువులను తలపిస్తుండటంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.

అమెరికా సైన్యం షార్క్‌లకు ఆహారమే: ఇరాన్ భీకర హెచ్చరిక..

పర్షియన్ గల్ఫ్ వేదికగా అమెరికా గనుక భూతల దాడులకు దిగితే, ఆ దేశ సైనికులు సముద్రంలోని “షార్క్ చేపలకు ఆహారంగా” మారుతారని ఇరాన్ అత్యంత కఠినమైన పదజాలంతో హెచ్చరించింది. ఇరాన్ సాయుధ దళాలకు చెందిన ‘ఖతం అల్-అన్బియా’ సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ ప్రతినిధి, బ్రిగేడియర్ జనరల్ ఇబ్రహీం జొల్ఫకరి మార్చి 29, 2026న విడుదల చేసిన వీడియో ప్రకటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

అమెరికాపై ఉత్తరకొరియా శక్తివంతమైన క్షిపణి ఇంజిన్ పరీక్ష

ప్రస్తుత ప్రపంచ స్థాయి పరస్పర ఘర్షణల దశలో ఉత్తర కొరియా ఆదివారం అత్యంత శక్తివంతమైన ‘ ఘన ఇంధన క్షిపణి ఇంజిన్‌ను ’పరీక్షించింది. అమెరికా టార్గెట్‌గా ఉండే అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ ఛోదక శక్తిగా ఈ ఇంజిన్ నిలుస్తుంది. గుర్తు తెలియని ప్రదేశం నుంచి జరిగిన క్షిపణి ఇంజిన్ పరీక్షను ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ వీక్షించారు. దేశ అత్యంత కీలకమైన సైనిక సామర్థం , శత్రు లక్షాల ఛేదనకు వీలుగా ఉండే ఈ ఇంజిన్ […]

ఎర్రగా మారిన ఆకాశం.. ఆస్ట్రేలియాలో అరుదైన ఘటన

ఆస్ట్రేలియాలో అరుదైన ప్రకృతి దృశ్యం ఆవిష్కృతమైంది. కాకపోతే, ఇది చాలామందిని భయపెట్టింది కూడా. ఈ ఘటన శుక్రవారం ఆస్ట్రేలియాలోని డెన్‌హామ్ అనే టూరిస్ట్ పట్టణంతోపాటు షార్క్ బే, పిల్బారా ప్రాంతాల్లో జరిగింది. ఆకాశం పూర్తిగా రక్తపు ఎరుగు రంగులోకి మారిపోవడంతో ప్రతి దృశ్యం ఎర్రగానే కనిపించింది. నారెల్లె అనే ఉష్ణమండల సైక్లోన్ ప్రభావంతో ఇలా జరిగిందని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. కాంతి వికిరణ చర్య ద్వారా ఇలా జరుగుతుందని నిపుణులు అంటున్నారు.

రష్యా ఓడరేవుపై డ్రోన్‌లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌..!

ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయలాంటి ఉస్త్-లుగా (Ust-luga) ఓడరేవుపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. బాల్టిక్ సముద్ర తీరంలో ఉన్న ఈ పోర్టులోని గ్యాస్ టెర్మినల్‌పై జరిగిన దాడితో భారీగా మంటలు చెలరేగాయి. ఫలితంగా అక్కడి కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఉక్రెయిన్ ప్రయోగించిన సుదూర శ్రేణి డ్రోన్‌లు రష్యా గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకుని, నేరుగా గ్యాస్ నిల్వ ట్యాంకర్లను ఢీకొట్టాయి

అమెరికాలో పెద్ద ఎత్తున నో కింగ్స్‌ ఉద్యమం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఏకపక్ష విధానాలపై అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో గతంలో ఎన్నడులేని విధంగా భారీగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ‘నో కింగ్స్‌’ అంటూ నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా మొత్తం 50 రాష్ట్రాల్లో 3,100 నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఈ నిరసనల్లో సుమారు 90 లక్షల వరకు ప్రజలు పాల్గొన్నారు, అమెరికా చరిత్రలోనే ఇది అతి పెద్ద నిరసన అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అమెరికా బలగాలకు ఇరాన్ సంచలన ఆహ్వానం..!

ఇరాన్ నుంచి వెలువడే టెహ్రాన్ టైమ్స్ తమ దేశానికి వస్తున్న అమెరికా బలగాలకు అరుదైన ఆహ్వానం పలికింది. వెల్ కమ్ టూ హెల్ (నరకానికి ఆహ్వానం) అంటూ అమెరికా బలగాల ఫొటోతో టెహ్రాన్ టైమ్స్ ప్రచురించిన ముఖ చిత్రం ఇరాన్ వైఖరికి అద్దం పట్టేలా ఉందన్న చర్చ అంతర్జాతీయంగా జరుగుతోంది. ఇప్పటికే అమెరికా బలగాలు తమ దేశంలో అడుగుపెడితే చాలా విపరిణామాలు చవి చూడాల్సి వస్తుందని అగ్రనాయకులు సైతం హెచ్చరికలు చేస్తున్నారు.

అతివేగంతో కారు.. గోల్ఫ్ దిగ్గజం అరెస్ట్

ప్రపంచ ప్రఖ్యాత గోల్ఫ్ దిగ్గజం Tiger Woods మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అతివేగంతో కారు నడిపి ప్రమాదానికి కారణమయ్యారన్న ఆరోపణలతో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. మత్తు పదార్థాల ప్రభావంతో వాహనం నడిపారన్న అనుమానంతో ‘డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్’ (DUI) కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో వుడ్స్‌కు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసు అధికారులు వెల్లడించారు.

నేపాల్‌ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి అరెస్టు

నేపాల్‌ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి అరెస్టయ్యారు. నేపాల్‌ నూతన ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. అదేవిధంగా దేశ మాజీ హోంశాఖ మంత్రి రమేశ్‌ లేఖక్‌ను కూడా అరెస్టు చేశారు. గతేడాది జెన్‌జీ నిరసనలను హింసాత్మకంగా అణచివేశారనే ఆరోపణలపై ఈమేరకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON