loader

కాల్పుల విరమణ….లేనట్లే: ఇరాన్

మధ్యప్రాచ్య యుద్ధ విరమణ దిశలో మధ్యవర్తిత్వ దేశాలు ఈజిప్టు, పాకిస్థాన్, టర్కీలు రూపొందించి ఈ ప్రతిపాదనలు అమెరికా, ఇరాన్‌లకు పంపించాయి. అయితే తాత్కాలిక యుద్ధ విరమణకు తాము అంగీకరించేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యవర్తిత దేశం పాకిస్థాన్ ద్వారా అమెరికాకు తమ వైఖరిని తెలియజేసినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ సోమవారంనాడు రాత్రి ప్రకటించింది. ‘తాత్కాలిక కాల్పుల విరమణకు మేం సిద్ధంగా లేము. అని కైరోలోని ఇరాన్ […]

అమెరికా-ఇరాన్ మధ్య 45 రోజుల సీజ్‌ఫైర్‌ చర్చలు.. హోర్ముజ్ ఓపెన్ అవుతుందా?

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రంగా పెరుగుతున్న వేళ, ఘర్షణలను తగ్గించి హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలనే లక్ష్యంతో కొత్త దౌత్య ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి పాకిస్తాన్ రూపొందించిన ఈ ప్రణాళిక రెండు దశల వ్యూహంపై ఆధారపడి ఉంది. మొదటి దశలో తక్షణ కాల్పుల విరమణ అమలు చేయాలని సూచించారు. అనంతరం రెండో దశలో సమగ్ర ఒప్పందానికి దారితీసే విస్తృత చర్చలు జరపాలని ప్రతిపాదించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఒక అవగాహన పత్రం రూపకల్పన జరుగుతోందని తెలుస్తోంది. ఈ […]

ఇరాన్ పై అమెరికా భీకర దాడులు.. టాప్ మిలిటరీ లీడర్లు హతం!

ఇరాన్ పై మరోసారి అమెరికా భీకర దాడులతో విరుచుకుపడింది. టెహ్రాన్‌పై దాడి చేశామని.. దీంతో పలువురు ఇరాన్ సైనిక అధికారులు మరణించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. హ్రాన్‌లో జరిగిన భారీ దాడితో ఇరాన్ సైనిక నాయకులలో చాలా మంది అంతమయ్యారని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఏప్రిల్ 6వ తేదీలోగా ఒప్పందం కుదుర్చుకోవడమో లేదా హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడమోచేయాలని,లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరించారు.

హోర్ముజ్‌ను దాటిన 8 భారత నౌకలు

హోర్ముజ్‌పై ఇరాన్‌ నియంత్రణ కొనసాగుతున్నప్పటికీ ఎనిమిది భారత నౌకలు ఈ జలసంధిని విజయవంతంగా దాటాయి. శనివారం ఉదయం ఎనిమిదవదైన ‘గ్రీన్‌ సాన్వి’ ఎల్‌పీజీ ట్యాంకర్‌ సైతం జలసంధిని దాటుకుని భారత్‌ దిశగా పయనిస్తోంది. మరో రెండు నౌకలు గ్రీన్‌ ఆశా, జగ్‌ విక్రమ్‌లు కూడా కొద్దిరోజుల్లోనే స్వదేశానికి రానున్నాయి. ఇప్పటి వరకు శివాలిక్‌, నందాదేవి, జగ్‌ లడ్కీ, పైన్‌ గ్యాస్‌, జగ్‌ వసంత్‌, బీడబ్ల్యూ టైర్‌, బీడబ్ల్యూ ఎల్మ్‌, గ్రీన్‌ సాన్వి హోర్ముజ్‌ జలసంధిని విజయవంతంగా దాటాయి.

బుషిహర్ న్యూక్లియర్ ప్లాంట్ లక్ష్యంగా క్షిపణి దాడి

ఇరాన్ లోని బుషెహర్ అణువిద్యుత్ కేంద్రం లక్షంగా క్షిపణి దాడి జరిగిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఎఇఎ) తెలియజేసింది. ఇటీవలి కాలంలో ఇది నాలుగో ఘటన అని పేర్కొంది. ఈ క్షిపణి శకలం తగిలి సిబ్బందిలో ఒకరు చనిపోయారని తెలిపింది. ఆ ప్రాంతం లోని భవనం కూడా దెబ్బతిన్నట్టు వివరించింది. ఈ సంఘటన న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో రేడియేషన్‌కు దారి తీయలేదని స్పష్టం చేసింది. ఇరాన్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న ఏకైక విద్యుత్ ప్లాంట్ ఇదే కావడం గమనార్హం.

హార్ముజ్ జలసంధి పునరుద్ధరణపై చర్చలకు.. భారత్‌కు యూకే ఆహ్వానం

పశ్చిమాసియాలో సంఘర్షణ వల్ల ఇరాన్‌ మూసివేసిన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరువడంపై చర్చించేందుకు సుమారు 40 దేశాలను బ్రిటన్‌ ఆహ్వానించింది. ఇందులో భాగంగా భారత్‌కు కూడా ఆహ్వానం అందినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. బ్రిటన్‌లో ఇవాళ జరుగనున్న ఈ సమావేశంలో భారత్‌ తరపున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రాతినిధ్యం వహిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

ట్రంప్‌ ప్రసంగంతో మార్కెట్లు కుదేల్‌

ఇరాన్‌తో యుద్ధం ఇంకా తీవ్రతరం కానుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు పతనం అయ్యాయి. ట్రంప్‌ ప్రసంగానికి ముందు 100 పాయింట్ల లాభంలో ఉన్న గిఫ్ట్‌ నిఫ్టీ.. 7.53 గంటలకు 496 పాయింట్లు కోల్పోయింది. ముడి చమురు ధరలు 4 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత స్టాక్‌ మార్కెట్లపై ఈప్రభావం గణనీయంగా పడనుంది. భారీ గ్యాప్‌ డౌన్‌తో ట్రేడింగ్‌ మొదలయ్యే అవకాశం ఉంది.

కొండను ఢీకొట్టిన విమానం: 29 మంది మృతి

రష్యా దేశంలో నల్ల సముద్రంలోని క్రిమియా ద్వీపకల్పంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పెనున్‌సులాలో కొండచరియను విమానం ఢీకొట్టడంతో 29 మంది చనిపోయారు. మృతి చెందిన వారిలో 23 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారని విమానయాన అధికారులు వెల్లడించారు. 2014లో యుక్రెయిన్ దేశంలో నుంచి క్రిమియా ద్వీపాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది. ఎఎన్-26కి చెందిన సైనిక విమానంగా గుర్తించారు. ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

భారత్ రావాల్సిన విమానంపై అమెరికా భారీ దాడి

మానవతా సహాయ మిషన్‌లో భాగంగా న్యూఢిల్లీకి వెళ్లాల్సిన ఇరాన్‌ చెందిన మహాన్ ఎయిర్ పౌర విమానంపై అమెరికా దాడి చేసింది. మషాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనలో విమానం దెబ్బతింది. భారత్ కు వెళ్లాల్సిన ప్రణాళికాబద్ధమైన సహాయ కార్యకలాపాలు నిలిచాయి. ఈ ఘటన పట్ల ఇరాన్ స్పందించింది. దీన్ని వార్ క్రైమ్ గా అభివర్ణించింది. భారత్ స్పందించాల్సిన అవసరం ఉందని సూచించింది.

పారిస్లో స్తంభించిన ట్రాఫిక్! పెట్రోల్,డీజిల్ ధరలే కారణం

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పెరిగిన డీజిల్ ధరలు ఫ్రాన్స్ రవాణా రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయి. దీనికి నిరసనగా సోమవారం (మార్చి 30, 2026) పారిస్ రింగ్ రోడ్డుపై వందలాది ట్రక్కులు, బస్సులతో డ్రైవర్లు ‘స్లో-మూవింగ్’ (నత్తనడక) నిరసన చేపట్టారు. దీనివల్ల పారిస్ నగరం చుట్టూ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రభుత్వం ప్రకటించిన 50 మిలియన్ యూరోల అత్యవసర సాయం ఏమాత్రం సరిపోదని, లీటరుపై కనీసం 50 సెంట్లకు పైగా రాయితీ ఇవ్వాలని రవాణా సంఘాలు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON