loader

అమెజాన్‌లో మళ్లీ 14వేల లేఆఫ్‌లు..?

అమెజాన్‌ సంస్థలో వివిధ విభాగాల్లోని 14 వేల మంది ఉద్యోగులకు మేలో లేఆఫ్‌ ప్రకటించనున్నట్లు సమాచారం. ఇందులో కార్పొరేట్‌ విభాగాలు, మిడ్‌ లెవల్‌ మేనేజర్లు, మానవ వనరుల విభాగం తదితర ఉద్యోగాలున్నాయి. అమెజాన్‌ గతేడాది అక్టోబరులో 14,000 మందిని, ఈ ఏడాది జనవరిలో 16,000 మంది ఉద్యోగులను లేఆఫ్‌ చేసింది. ఇటీవల ఒరాకిల్ సంస్థ కూడా ప్రపంచవ్యాప్తంగా 30వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇందులో 12వేల మంది భారతీయులే.

చైనాతో ఇరాన్ రహస్య ఒప్పందం..అమెరికాకు బిగ్ షాక్

‘హార్ముజ్ జలసంధి’ ఇప్పుడు ఈ ఆర్థిక యుద్ధానికి కేంద్రబిందువుగా మారింది. ఈ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల నుండి ఇరాన్ రవాణా రుసుములను చైనా కరెన్సీ అయిన ‘యువాన్’ రూపంలో వసూలు చేయడం ప్రారంభించింది. ఇది అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో “పెట్రోయువాన్” వ్యవస్థను బలోపేతం చేసే దిశగా వేసిన కీలక అడుగుగా చెప్పుకోవచ్చు. అమెరికా తన ప్రత్యర్థి దేశాలను నియంత్రించడానికి డాలర్ శక్తిని వాడుకుంటోందని, అందుకే ఇరాన్, చైనాలు ఈ ముప్పు నుంచి తప్పించుకోవడానికి యువాన్‌ను […]

క్రూడాయిల్ ధరలు ఢమాల్

అంతర్జాతీయ రాజకీయాల్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల వల్ల ప్రపంచ చమురు మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. అమెరికా మరియు ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత కీలకమైన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 15 శాతం పడిపోయి 92.67 డాలర్లకు చేరుకుంది. ఇక అమెరికాకు చెందిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 20 డాలర్ల మేర క్షీణించి 94.87 […]

ఇరాన్‌పై భారీ దాడి ఖాయమా..? యూకే స్థావరం నుంచి బయలుదేరిన అమెరికా బాంబర్

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా, మంగళవారం యూకేలోని ఆర్‌ఏఎఫ్ ఫెయిర్‌ఫోర్డ్ ఎయిర్ బేస్ నుంచి అమెరికా వైమానిక దళానికి చెందిన బి-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ ఒకటి బయలుదేరినట్లు సమాచారం. ఈ విమానం ఆయుధాలతో కూడి ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో దీనిని ఒక ప్రధాన సైనిక సంకేతంగా పరిగణిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు . తన షరతులను ఇరాన్ నెరవేర్చకపోతే, ఈ రాత్రే […]

లిబియా తీరంలో పడవ మునిగి 80 మందికి పైగా గల్లంతు

లిబియా తీర ప్రాంతం నుంచి బయలుదేరిన ఓ పడవ మధ్యధరా సముద్రంలో మునిగిపోవడంతో 80 మందికిపైగా వలసదారులు గల్లంతైనట్లు ఐక్యరాజ్య సమితి వలస సంస్థ (ఐఓఎం) మంగళవారం తెలిపింది. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలు వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం ఉత్తర పశ్చిమ లిబియాలోని తజౌరా పట్టణం నుంచి సుమారు 120 మంది ప్రయాణికులతో ఈ పడవ బయలుదేరింది. వాతావరణ పరిస్థితులు బాలేకపోవడంతో పడవలోకి నీరు చేరడంతో అది మునిగిపోయినట్లు ఐఓఎం పేర్కొంది.

“రాబోయే 48 గంటల పాటు ఉన్నచోటనే ఉండండి”.. ఇరాన్‌లోని భారతీయులకు కేంద్రం కీలక హెచ్చరిక!

ఇరాన్‌లో తీవ్రమవుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో, టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇరాన్‌లో ఉన్న భారత పౌరులకు కీలక ప్రకటన జారీ చేసింది. రాబోయే 48 గంటల పాటు భారతీయులు ఉన్న చోటనే ఉండాలని కీలక సూచన జారీ చేసింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అన్ని విద్యుత్, సైనిక స్థావరాలకు, బహుళ అంతస్తుల భవనాలకు దూరంగా ఉండాలని ఆ సలహాలో పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌పై పెద్ద దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ […]

చంద్రుని ఆవలి వైపు నుంచి భూమి ఇలా..

ఆర్టెమిస్‌-2 మిషన్‌లో భాగంగా చంద్రుని చుట్టూ ప్రదక్షిణ చేసిన వ్యోమగాములు.. తిరిగి భూమి వైపు తమ ప్రయాణం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే చందమామ అవతలి వైపు నుంచి వ్యోమగాములు తీసిన భూమి ఫొటోను ‘నాసా’ విడుదల చేసింది. దీన్ని వైట్‌హౌస్‌ ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేసింది. ‘‘జాబిల్లి అవతలి వైపు నుంచి తీసిన మొదటి భూమి ఫొటో ఇది’’ అని పేర్కొంది.

ట్రంప్ బెదిరింపులకు భయపడం..దాడులు కొనసాగుతాయ్

హర్మూజ్ అంశంలో వెంటనే ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ మొత్తం ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టుకుపోతుందని అమెరికా అధ్యక్షుడు చేసిన హెచ్చరికలను టెహ్రాన్​ తోసిపుచ్చింది. ట్రంప్ చేసిన అవివేకపు బెదిరింపులకు తమపై ఎలాంటి ప్రభావం చూపవని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా-ఇజ్రాయెల్ లక్ష్యాలపై తమ దాడులు కొనసాగుతాయని ఇరాన్ సైనిక కమాండ్ ప్రతినిధి ఘాటుగా హెచ్చరించారు. కువైట్‌లోని అమెరికా స్థావరాలు, బగ్దాద్‌లోని కమాండ్ కేంద్రాలపై కూడా దాడులు జరిపాయి’ అని ఇరాన్ సైనిక కమాండ్ ప్రతిని తెలిపారు.

చంద‌మామ‌లో ఎన్నెన్నో వ‌ర్ణాలు.. అనూహ్య‌మైన రంగుల్ని గుర్తించిన ఆస్ట్రోనాట్స్

ఆర్టెమిస్‌-2(Artemis II) వ్యోమ‌గాములు .. చంద్రుడి ఉప‌రిత‌లంపై అనూహ్య‌మైన రంగుల‌ను గుర్తించారు. చంద్రుడిని చుట్టువ‌చ్చే క్ర‌మంలో .. చ‌ల్ల‌టి జాబిలిపై మ‌ల్టీఫుల్ క‌ల‌ర్స్ ఉన్న‌ట్లు అభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. చంద‌మామ స‌మీపం నుంచి బ్రౌన్ రంగులో క‌నిపించిన‌ట్లు చెప్పారు. ఇక అక్క‌డ‌క్క‌డ మూన్‌పై గ్రీన్ క‌ల‌ర్ ఛాయ‌లు కూడా క‌నిపించిన‌ట్లు తెలిపారు. కానీ చాలా వ‌ర‌కు చంద్రుడి ఉప‌రిత‌లం మొత్తం బ్రౌన్ రంగులోనే ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

ప‌నామా బ్రిడ్జ్ వ‌ద్ద భారీ పేలుడు.. మంట‌ల్లోంచి దూసుకెళ్లిన వాహ‌నాలు..

ప‌నామా సిటీలో భారీ పేలుడు ఘ‌ట‌న జ‌రిగింది. ప‌నామా కెనాల్‌పై ఉన్న బ్రిడ్జ్ ఆఫ్ అమెరికాస్‌ స‌మీపంలో బ్లాస్ట్ జ‌రిగింది. దీంతో భారీ ఎత్తున మంట‌లు వ్యాపించాయి. అయితే ఆ స‌మ‌యంలో బ్రిడ్జ్ మీద నుంచి వాహ‌నాలు వెళ్తున్నాయి. లా బోకాలోని బ‌ల్బో వ‌ద్ద పేలుడు జ‌రిగింది. దీంతో ఆ బ్రిడ్జ్‌పై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ట్రాన్స్‌పోర్టు లింకుకు ఈ మార్గమే కీల‌క‌మైంది. అయితే పేలుళ్లు నేరుగా బ్రిడ్జ్‌మీద జ‌ర‌గ‌లేదు.బ్రిడ్జ్ కింద భాగంలో పేలుడు జ‌ర‌గ‌డంతో.. దాని మంట‌లు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON