loader

కొత్త సుప్రీం లీడర్ పట్ల విధేయత.. వేలాదిగా వీధుల్లోకి వచ్చి ప్రతిజ్ఞ..

కొత్త సుప్రీం నాయకుడు మోజ్తాబా ఖమేనీకి మద్దతుగా సోమవారం వేలాది మంది ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. రాజధాని టెహ్రాన్‌లోని సెంట్రల్ స్క్వేర్‌కు భారీగా తరలివచ్చిన ప్రజలు.. కొత్త సుప్రీం లీడర్‌కు విధేయులమైన ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఇదే సమయంలో ఇరాన్‌పై విస్తృత దాడులు ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్- అమెరికా వైమానిక దాడుల నడుమే సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే అసెంబ్లీ ఎక్స్‌పర్ట్స్ కౌన్సిల్ రహస్యంగా సమావేశమై.. మోజ్తాబాను పేరును ఖరారు చేసింది.

ఇరాన్ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు.. అమెరికా ఆగ్రహం

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వల లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు చేయడంపై అమెరికా మండిపడింది. ఏం చేస్తున్నావంటూ ‘డబ్ల్యూటీఎఫ్‌’ పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంలో అమెరికా, ఇజ్రాయెల్‌ మధ్య తొలిసారి తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తినట్లు యాక్సియోస్ వార్తా సంస్థ పేర్కొంది. ‘వాట్‌ ద ఫ*’ పదజాలంతో ట్రంప్‌ ఆగ్రహంతో కూడిన సందేశాన్ని కూడా వైట్‌హౌస్‌ పంపినట్లు అమెరికా అధికారి తెలిపారు. ఇజ్రాయెల్‌ను ఈ మేరకు ట్రంప్‌ గట్టిగా హెచ్చరించినట్లు పేర్కొన్నారు.

చాట్‌జీపీటీ సాయంతో.. గుడిలోని బాత్రూంలో ఇద్దరు యువతుల ఆత్మహత్య, స్పందించిన మస్క్

సూరత్‌లో ఆత్మహత్య చేసుకున్న యువతుల ఫోన్ల చాట్‌జీపీటీ సెర్చ్ హిస్టరీలో “ఆత్మహత్యకు ఏ డ్రగ్స్ వాడాలి?”, “సులభంగా ప్రాణాలు ఎలా తీసుకోవాలి?” వంటి ప్రశ్నలు ఉన్నాయి. దీనిపై మస్క్ స్పందిస్తూ చాట్‌జీపీటీ వంటి ఏఐ సాధనాలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో ఈ ఘటనతో నిరూపితమైందని పరోక్షంగా విమర్శించారు. తన ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ (Grok) వల్ల ఇప్పటివరకు ఎవరూ ఆత్మహత్య చేసుకోలేదని, కానీ చాట్‌జీపీటీ వల్ల ఇలాంటి ప్రాణాలు పోతున్నాయని గతంలోనే ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం […]

ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా ఖమేనీ తనయుడు మొజ్తాబా ఖమేనీ.. ప్రకటించిన ఇరాన్

ఇరాన్ తమ దేశ నూతన సుప్రీం లీడర్‌ను ఎన్నుకుంది. కొత్త సుప్రీం లీడర్‌గా అయతొల్లా ఖమేనీ తనయుడు మొజ్తాబా ఖమేనీని ఎన్నుకున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. 56 ఏళ్ల అయతొల్లా సయ్యద్ మొజ్తాబా హొస్సేని ఖమేనీ అలియాస్ మొజ్తాబా ఖమేనీ ఇరాన్‌కు మూడో సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యాడు. ఇరాన్ అసెంబ్లీ నిపుణుల బృందంలో 88 మంది ఇస్లాం మత గురువులు ఉంటారు. వీరందరూ కలిసి ఆదివారం సమావేశమై కొత్త సుప్రీం లీడర్ కోసం చర్చ జరిపారు. మెజారిటీ సభ్యులు మొజ్తాబా వైపు మొగ్గు చూపారు.

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు షాక్.. 47 మంది పార్టీ నేతలకు పదేళ్ల జైలు శిక్ష

ఇప్పటికే జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు భారీ షాక్ తగిలింది. ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) నాయకులు 47 మందికి యాంటీ టెర్రరిజం కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాదు.. ఒక్కొక్కరూ 1.52 కోట్ల పాకిస్తాన్ రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. నిరసనల సందర్భంగా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం, తగలబెట్టడం, పోలీసులు, భద్రతా బలగాలపైకి దాడికి పాల్పడటం వంటివి చేశారని ప్రభుత్వం ఆరోపించింది.

బహ్రెయిన్‌పై ఇరాన్ దాడి.. 21 మంది అమెరికా సైనికులు మృతి

ఇరాన్ ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ తాజాగా బహ్రెయిన్ రాజధాని మేనామలోని జుఫైర్‌ జిల్లాలోని అమెరికా నావికాదళానికి చెందిన 5వ ఫ్లీట్ ప్రధానకార్యాలయంపై క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడింది. ఈ దాడిలో 21 మంది అమెరికా సైనికులు మృతి చెందినట్టు ‘టెహ్రాన్ టైమ్స్’ తెలిపింది. దాడి అనంతరం పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడినట్టు తెలిపింది. ఉపగ్రహ ఛాయాచిత్రాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.

ఇరాన్‌పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పాలకుల నిరంకుశత్వానికి ముగింపు పలికే రోజులు దగ్గరపడ్డాయని ఆయన పేర్కొన్నారు. “మేము ఇరాన్‌ను విభజించాలని అనుకోవడం లేదు.. కేవలం నిరంకుశ పాలన నుంచి అక్కడి ప్రజలకు విముక్తి కలిగించడమే మా లక్ష్యం” అని ఆయన స్పష్టం చేశారు. “ఇరాన్‌కు మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఇస్తాం. ప్రజలు ప్రభుత్వాన్ని పడగొట్టే సమయం దగ్గరలో ఉంది. తదుపరి దశను త్వరలో చేపడతాం” అని చెప్పారు.

నార్వేలోని అమెరికా ఎంబసీ దగ్గర భారీ పేలుడు

యూరప్‌ దేశం నార్వే లోని యూఎస్‌ ఎంబసీ వద్ద పేలుడు సంభవించింది. ఈ క్రమంలో భారీ శబ్దం వినిపించిందని, పెద్దఎత్తున పొగ వ్యాపించిందని పోలీసులు పేర్కొన్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన జరిగిందని అన్నారు. ఓస్లో నగరంలోని యూఎస్‌ ఎంబసీ ప్రవేశ ద్వారం వద్ద ఈ పేలుడు సంభవించిందని చెప్పారు. ఈ పేలుడువల్ల స్వల్ప నష్టం వాటిల్లినట్లు తెలిపారు. అయితే ఎవరూ గాయపడలేదని స్పష్టంచేశారు. ఈ పేలుడుకుగల కారణాలు తెలియరాలేదన్నారు.

దుబాయ్‌లోని ప్రసిద్ధ 23 మెరినా టవర్‌పై దాడి

ఇజ్రాయెల్‌పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్‌..భారీగా క్షిపణులను ప్రయోగిస్తోంది. గల్ఫ్‌దేశాలపై డ్రోన్లు, క్షిపణుల్తో విరుచుకుపడుతోంది. గత రాత్రి బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరం, ఇరాక్‌లోని అమెరికా ఎంబస్సీ, ఇరాక్‌లోని ఇర్బిల్‌ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇరాన్‌, తాజాగా మరికొన్ని మరిన్ని లక్ష్యాలపై దాడులు జరిపింది. తాజా దాడుల్లో దుబాయ్‌లోని ప్రసిద్ధ 23 మెరినా టవర్‌ దెబ్బతింది.

మంటల్లో టెహ్రాన్ ఎయిర్‌పోర్ట్! రన్‌వేలు, విమానాలు దగ్ధం..

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భయానక స్థాయికి చేరింది. శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ దళాలు టెహ్రాన్‌పై జరిపిన మెరుపు దాడుల్లో మెహ్రాబాద్ ఎయిర్‌పోర్ట్ తీవ్రంగా దెబ్బతింది. బాంబుల దాడిలో విమానాలు మంటల్లో చిక్కుకోగా, టెహ్రాన్ ఆకాశం పొగతో నిండిపోయింది. గత వారం రోజులుగా సాగుతున్న ఈ భీకర యుద్ధంలో ఇప్పటివరకు 1,300 మందికి పైగా ఇరానీయులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ అగ్రనేతలను, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న ఈ దాడులతో చమురు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON