ఇరాన్ ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ తాజాగా బహ్రెయిన్ రాజధాని మేనామలోని జుఫైర్ జిల్లాలోని అమెరికా నావికాదళానికి చెందిన 5వ ఫ్లీట్ ప్రధానకార్యాలయంపై క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడింది. ఈ దాడిలో 21 మంది అమెరికా సైనికులు మృతి చెందినట్టు ‘టెహ్రాన్ టైమ్స్’ తెలిపింది. దాడి అనంతరం పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడినట్టు తెలిపింది. ఉపగ్రహ ఛాయాచిత్రాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.

