loader

ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ రాకెట్ బేస్‌లో అగ్నిప్రమాదం..

టెక్సాస్‌లోని స్పేస్‌ఎక్స్ మెక్‌గ్రెగర్ పరీక్షా కేంద్రం బుధవారం భారీ పేలుడుతో దద్దరిల్లింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ టెక్సాస్‌ మెక్‌గ్రెగోర్ బేస్‌లో రాకెట్ ఇంజిన్ టెస్టింగ్ సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఆక్సిజన్, మీథేన్ గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చింది. అగ్నిప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు కాగా, క్షణాల్లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై చక్కర్లు కొట్టాయి.

అమెరికా గోల్డెన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా రక్షణకు అత్యంత శక్తివంతమైన క్షిపణి భద్రతా వ్యవస్థ ‘గోల్డెన్ డోమ్’ ను చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ గోల్డెన్ డోమ్ లక్ష్యం ఏంటంటే.. శత్రు క్షిపణులను వెంటనే గుర్తించడం, ట్రాక్ చేయడం, వాటిని మధ్యలోనే ఆకాశంలోనే నాశనం చేయడం. మొత్తం వ్యవస్థను నిర్మించడానికి దాదాపు 175 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని సమాచారం.

అండర్ కవర్ ఏజెంట్లకు ఆమె ఐఎస్‌ఐ ఎర

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. భారత్‌లో అండర్‌కవర్ ఏజెంట్లను గుర్తించేందుకు పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ‘ఐఎస్‌ఐ’ ఆమెను వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఐఎస్‌ఐ హ్యాండ్లర్ల్లతో ఆమె  కోడ్ భాషలో మాట్లాడినట్టు  దర్యాప్తు అధికారులు నిర్ధారించినట్టు సమాచారం.

ట్రంప్-పుతిన్ చర్చలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ఉక్రెయిన్-రష్యా యుద్ధ విరామ చర్చలపై కొత్త ఆశలు చిగురించాయి. ఈ చర్చల గురించి ట్రంప్ మాట్లాడుతూ… పుతిన్ మంచివాడని, ఆయనతో మాట్లాడిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చిందని అభిప్రాయపడ్డారు.  చాలా కాలంగా జరుగుతున్న ఈ సంఘర్షణకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందనే ఆశలు పెరిగాయి.

చైనాను తొక్కేస్తున్న భారత్…

కొన్ని విధానాల వల్ల ఆ దేశం నెమ్మదిగా ఆర్థిక మాంద్యం వైపు అడుగులు వేస్తోందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చైనాకు సంబంధించిన పలు పరిశ్రమలు ప్రస్తుతం కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం వల్ల ఒక్కొక్కటి మూతపడుతున్నాయి. మరోవైపు భారత్ మాత్రం చైనాను దాటుకొని ముందుకు వెళ్లే పరిస్థితుల్లో ఉంది భారతదేశంలో ప్రస్తుతం సెమీ కండక్టర్స్, అలాగే డ్రోన్ల తయారీని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది.

రోదసిలో సూపర్‌ కంప్యూటర్‌

ఇప్పటివరకు ఏ దేశమూ కూడా రోదసిలో సూపర్‌ కంప్యూటర్లను ఏర్పాటుచేయలేదు. ప్రపంచంలోనే మొదటిసారిగా చైనా దీనిని ఆవిష్కరించబోతున్నది. ఏఐ తో పనిచేసే 12 శాటిలైట్స్‌ను రోదసిలోకి పంపి.. ఈ శాటిలైట్స్‌ కూటమితో అత్యంత శక్తివంతమైన సూపర్‌కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ను సృష్టించబోతున్నది. చైనా ఏరోస్పేస్‌ సైన్స్‌, టెక్నాలజీ కార్పొరేషన్‌ చేపట్టిన ‘స్టార్‌ కంప్యూటింగ్‌’ ప్రోగ్రామ్‌కు సంబంధించి తొలి దశ ప్రయోగం సక్సెస్‌ అయ్యిందని చైనా వెల్లడించింది.

భారత్ క్షిపణి దెబ్బలు తిన్నాం

పాక్ ప్రధాని షెహబాజ్ ఒప్పుకోలు: ఇటీవలి ఆపరేషన్ సిందూర లో భాగంగా తమ దేశం భారతదేశపు క్షిపణుల దాడిలో తమ కీలక వైమానిక స్థావరాలు ధ్వంసమైనట్లు పాకిస్థాన్ అంగీకరించింది. దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తొలిసారిగా శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్ క్షిపణుల దెబ్బ భరించాల్సి వచ్చిందని, తమ దేశ కీలక వైమానిక స్థావరాలు ధ్వంసం అయ్యాయని ఆయన తెలిపారు. .

భారతీయులపై కక్ష కట్టిన ట్రంప్ ?!

అమెరికాలోని వారు తమ కుటుంబసభ్యులకు పంపే డబ్బు పైనా ట్రంప్ కోత పెడుతున్నాడు. ఆమెరికా పౌరులు కానివారు విదేశాలకు చేసే చెల్లింపులపై 5 శాతం పన్ను విధించే కొత్త బిల్లును ట్రంప్ సర్కార్ ప్రతిపాదించింది. ఈ బిల్లు చట్టం అయితే అమెరికా నివసిస్తున్న , పనిచేస్తున్న లక్షలాది మంది భారతీయులపై నేరుగా ప్రభావం చూపుతుంది. వారు క్రమం తప్పకుండా స్వదేశంలో ఉన్న తమ కుటుంబ సభ్యులకు డబ్బు పంపుతూ ఉంటారు.

టర్కీ కంపెనీలపై భారత్ కొరడా..

ముంబై విమానాశ్రయంలో సుమారు 70% గ్రౌండ్ ఆపరేషన్లను నిర్వహిస్తున్న టర్కీ కంపెనీ సంస్థ సెలెబీ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్‌కు, భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ భద్రతా అనుమతులను రద్దు చేసింది. ఈ చర్య, జాతీయ భద్రతా అంశాలను పరిగణనలోకి తీసుకుని తీసుకున్నట్లు మంత్రి మురళీధర్ మొహొల్ తెలిపారు. సంస్థలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కుమార్తె సుమేయే ఎర్డోగాన్‌కు పాక్షిక వాటాలు ఉన్నట్లు సమాచారం. ఆమె భర్త సెల్కుక్ బైరక్టార్, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఉపయోగించిన బైరక్టార్ డ్రోన్లను తయారు […]

గాజాలో ఇప్పటివరకు వేలమంది పాలస్తీనియన్లు మృతి

గాజాలో మళ్లీ బాంబులతో దద్దరిల్లింది. గురువారం జరిగిన Israel వైమానిక దాడుల్లో దక్షిణ గాజా ఘోరంగా దెబ్బతిన్నది. పాలస్తీనా వైద్య వర్గాల సమాచారం ప్రకారం, ఈ దాడుల్లో కనీసం 80 మంది మరణించారు. మరో అనేక మంది గాయపడినట్టు పేర్కొన్నారు.దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరం లక్ష్యంగా దాడులు జరిగాయి. అక్కడే 54 మంది మరణించారు, అందులో మహిళలు, చిన్నారులూ ఉన్నారు.ఇది అధికారికంగా నాసర్ ఆసుపత్రి విడుదల చేసిన వివరాల్లో చెప్పబడింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON