loader

ప్రపంచకప్‌ను టాటూగా వేయించుకున్న టీమిండియా స్టార్..

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తాజాగా తన అద్భుతమైన ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 విజయాన్ని స్మరణీయం చేసుకుంది. హర్మన్‌ప్రీత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ టాటూ ఫోటోను పంచుకుని, “వరల్డ్ కప్ ట్రోఫీ టాటూ – నా చర్మంలో, నా హృదయంలో శాశ్వతంగా చిత్రించబడింది. ఈ గెలుపు నా జీవితంలో అత్యంత పవిత్రమైన క్షణం” అని రాసింది. ఈ పోస్ట్‌ను అభిమానులు విపరీతంగా ఇష్టపడ్డారు. ఆమెను అభినందిస్తూ వ్యాఖ్యలు […]

దిగ్గజాలను పట్టేస్తున్న లక్నో.. గ్లోబల్ ‘డైరెక్టర్‌ ఆఫ్ క్రికెట్‌’గా టామ్ మూడీ..!

ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవలే కేన్ విలియమ్సన్‌ ను వ్యూహాత్మక సలహాదారుగా తీసుకున్న లక్నో యాజమాన్యం ఈసారి ఆస్ట్రేలియా దిగ్గజానికి పెద్ద బాధ్యతలు అప్పగించనుంది. కోచ్‌గా సుదీర్ఘ అనుభవం కలిగిన వెటరన్ అయిన టామ్ మూడీని తమ ఫ్రాంచైజీ ‘గ్లోబల్ డైరెక్టర్‌ ఆఫ్ క్రికెట్‌’గా నియమించనుంది లక్నో. అయితే.. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

మహిళా జట్టుకు డైమండ్ నెక్లెస్‌లు.. సూరత్ వ్యాపారి భారీ బహుమతులు..

మహిళల వన్డే ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి విశ్వ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది సూరత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపీ గోవింద్ ఢోలాకియా అమ్మాయిల జట్టు ప్రపంచకప్ సాధిస్తే సభ్యులందరికీ వజ్రాల నెక్లెస్‌లు, సోలార్ ప్యానెళ్లు ఇవ్వాలనుకుంటున్నట్టు ఫైనల్ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు లేఖ రాశారు త్వరలోనే మహిళా జట్టు సభ్యులకు డైమండ్ నెక్లెస్‌లు ఇస్తానని, వారి ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తానని సోషల్ […]

4 ఏళ్ల నిరీక్షణ ఫలించింది..టీమిండియా విక్టరీ సాంగ్

మహిళా వన్డే ప్రపంచకప్ 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ అద్భుతమైన విజయం తర్వాత, భారత జట్టు గత నాలుగు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న తమ విక్టరీ సాంగ్‎ను విడుదల చేసింది. విన్నింగ్ సాంగ్‌ను గెలిచిన తర్వాతే విడుదల చేయాలని టీమ్ సభ్యులు గతంలోనే నిర్ణయించుకున్నారని జెమిమా రోడ్రిగ్స్ తెలిపారు. ఈ సందర్భంగా బీసీసీఐ సోషల్ మీడియాలో విడుదల చేసిన ఈ పాట లిరిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఉమెన్ ఇండియా క్రికెటర్స్ కు బీసీసీఐ భారీ నజరానా..

మహిళ క్రికెట్ లో విశ్వ విజేతగా నిలిచిన క్రికెట్ టీమ్ కు రూ.51 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ ఇవ్వబోతోంది. ఇంతటి మొత్తాన్ని పురుషుల జట్లకు కూడా ఇప్పటివరకూ బీసీసీఐ ఇవ్వలేదు. భారత మహిళల విజయానికి ఇంకా ఎన్నో సంస్థలు భారీగా క్యాష్ రివార్డులు అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ టోర్నీలో విజేత, రన్నరప్‌, ఇతర జట్ల కోసం మొత్తంగా ఐసీసీ 13.88 మిలియన్ డాలర్లు (రూ.123 కోట్లు) ప్రైజ్ మనీ పూల్‌ను ఏర్పాటు చేసిన సంగతి […]

కలల ట్రోఫీతో బెడ్‌పై ఫోజులిచ్చిన టీమిండియా ప్లేయర్లు..

చరిత్ర సృష్టించి, మొట్టమొదటిసారిగా ICC మహిళల వన్డే ప్రపంచ కప్‌ను గెలిచిన భారత జట్టు సంబరాలు ఆకాశాన్ని తాకాయి. ఈ చారిత్రక విజయం తరువాత, భారత యువ స్టార్ బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన తమ హోటల్ గదిలో ప్రపంచ కప్ ట్రోఫీతో కలిసి దిగిన ఒక ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫొటో విడుదలైన వెంటనే లక్షలాది లైక్స్, కామెంట్లు వచ్చాయి. నెటిజన్లు ఇది కల కాదు, మీరు సాధించారు!”, […]

ప్రపంచ విజేతలపై ప్రశంసల వర్షం- రాష్ట్రపతి, మోదీ స్పెషల్ ట్వీట్

విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుకు అభినందనలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారని ఎక్స్‌ వేదికగా కొనియాడారు.                                                                               మహిళల […]

సఫారీలకు ఔటాఫ్ సిలబస్ షెఫాలీ వర్మ.. ఫైనల్ ఫైర్

ICC మహిళల ప్రపంచకప్ 2025 ఫైనల్‌లో భారత ఓపెనర్ షెఫాలీ వర్మ అద్భుత ప్రదర్శన ఇచ్చింది. రీప్లేస్‌మెంట్‌గా వచ్చి 87 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి..ఊహించని బౌలింగ్ స్పెల్‌లో 2 కీలక వికెట్లు తీసి మ్యాచ్ గమనం మార్చింది. బ్యాటింగ్‌లోనే కాకుండా ఊహించని బౌలింగ్‌తోనూ సఫారీలకు ఔటాఫ్ సిలబస్ గా నిలిచింది షెఫాలి. ఒక మ్యాచ్ గమనాన్ని మార్చడానికి ఒక ప్లేయర్‌కు బ్యాటింగ్, బౌలింగ్ రెండూ ఎలా ఉపయోగపడతాయో షెఫాలీ నిరూపించింది

ద‌శాబ్దాల క‌ల సాకారం..

భార‌త జ‌ట్టు చిర‌కాల స్వ‌ప్నం సాకార‌మైంది. ద‌శాబ్దాలుగా ఊరిస్తున్న‌ వ‌న్డే ప్ర‌పంచ క‌ప్‌ను ఒడిసిప‌ట్టేసింది.భార‌త జ‌ట్టు చిర‌కాల స్వ‌ప్నం సాకార‌మైంది. ద‌శాబ్దాలుగా ఊరిస్తున్న‌ వ‌న్డే ప్ర‌పంచ క‌ప్‌ను ఒడిసిప‌ట్టేసింది. 2005, 2017లో మిథాలీ రాజ్ బృందం చేజారిన ప్ర‌పంచ‌క‌ప్‌ను సొంత‌గ‌డ్డ‌పై ప‌ట్టేసింది హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్. డీవై పాటిల్ మైదానంలో ఓపెన‌ర్ ష‌ఫాలీ వ‌ర్మ‌(87 : 2-36), దీప్తి శ‌ర్మ‌(58 : 5-39)లు ఆల్‌రౌండ్ షోతో భార‌త్ మొట్ట‌మొద‌టిసారి జ‌గ‌జ్జేత‌గా అవ‌త‌రించింది.

మహిళల ప్రపంచ కప్ 2025 ఛాంపియన్ గా భారత్

మహిళల ప్రపంచ కప్ లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. కొత్త ఛాంపియన్ గా అవతరించింది. ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌ సౌతాఫ్రికాను చిత్తచేసి భారత్ విజేతగా నిలిచింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON