loader

అయ్యర్, ప్రభ్‌సిమ్రన్ మెరుపులు.. సీఎస్కే ఖాతాలో రెండో ఓటమి..!

పంతొమ్మిదో సీజన్‌లో ఛేజింగ్ జట్టుకు మరో విజయం. తొలిపోరులో గుజరాత్ టైటాన్స్‌కు చెక్ పెట్టిన పంజాబ్ కింగ్స్ ఈసారి చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసింది. భారీ స్కోర్ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్(50)కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(43), ప్రియాన్ష్‌ ఆర్య(39)లు దంచేశారు. ఫలితంగా పంజాబ్ వరసగా రెండో విజయం నమోదు చేయగా.. సొంత మైదానంలో గెలిచి బోణీ కొట్టాలనుకున్న సూపర్ కింగ్స్‌కు నిరాశే మిగిలింది.

 దంచి కొట్టిన కూపర్.. గుజరాత్‌పై పంజాబ్ ఉత్కంఠ విజయం..

ఐపీఎల్ నాలుగో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. మంగళవారం ముల్లన్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా, పంజాబ్ 19.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. తన తొలి మ్యాచ్ ఆడుతున్న ఆస్ట్రేలియా ఆటగాడు కూపర్ కానలీ, పంజాబ్‌పై అర్ధ సెంచరీ సాధించాడు.

రెండో సీజన్లోనూ సిక్సర్ల మోత.. 15 బంతుల్లోనే రికార్డు హాఫ్‌ సెంచరీ..!

ఐపీఎల్‌ పంతొమ్మిదో సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే వైభవ్ సూర్యవంశీ విధ్వంసాన్ని చూపిస్తూ అర్ధ శతకం సాధించాడు. ఆరంభం నుంచి సిక్స్‌లు, ఫోర్లతో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లపై విరుచుకుపడిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. నూర్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్లో రెచ్చిపోయిన వైభవ్ రెండు సిక్సర్లతో ఫిఫ్టీ అందుకున్నాడు. తద్వారా రాజస్థాన్ తరఫున రెండో వేగవంతమైన, మొత్తంగా మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో రికార్డు సృష్టించాడు.

రాజస్థాన్ బౌలర్ల ధాటికి కుప్పకూలిన చెన్నై..

ఐపీఎల్ మూడవ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ను 127 పరుగులకే ఆలౌట్ చేసింది. గౌహతిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. చెన్నై తరఫున జేమీ ఓవర్టన్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కేవలం సంజు మాత్రమే కాదు, రాజస్థాన్ బౌలర్ల ధాటికి చెన్నై టాప్ ఆర్డర్ మొత్తం కుదేలైంది. ఓవర్టన్ 36 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లతో 43 […]

ఆసియా ఖండంలోనే తొలి బ్యాటర్‌గా రోహిత్ శర్మ అరుదైన ఘనత

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన మూడో సిక్సర్ బాదగానే, టీ20 క్రికెట్ చరిత్రలో 550 సిక్సర్లు పూర్తి చేసిన తొలి ఆసియా బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ ఈ పోరులో సిక్సర్ల మోతతో హిట్ మ్యాన్ రికార్డుల రారాజుగా నిలిచాడు.

ముంబయి ఇండియన్స్ ఘన విజయం

ఆదివారం జరిగిన ఐపీఎల్​ మ్యాచ్​లో కోల్​కతా నైట్​ రైడర్స్​పై ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. 221 పరుగుల లక్ష్యంగా బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్​ కూడా ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. ఈ క్రమంలో 23 బంతుల్లోనే రోహిత్ శర్మ హాఫ్​ సెంచురీ పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత 24 బంతుల్లో రికెల్టన్​ 50 పరుగులు పూర్తి చేశాడు. అయితే వైభవ్‌ అరోరా బౌలింగ్‌లో అనుకుల్‌ రాయ్‌కు క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ శర్మ (78) పరుగుల వద్ద పెవిలియన్​కు […]

హిట్‌మ్యాన్ పంజా..23 బంతుల్లోనే(50)

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా వాంఖెడే స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మరియు ముంబయి ఇండియన్స్ (MI) మధ్య జరుగుతున్న పోరు పరుగుల పండగను తలపిస్తోంది. కేకేఆర్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబయి ఇండియన్స్ ఓపెనర్లు ఆరంభం నుంచే శివమెత్తారు. స్వంత మైదానంలో ప్రేక్షకుల కేరింతల మధ్య రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 23 బంతుల్లోనే తన అర్థశతకాన్ని (51*) పూర్తి చేసుకున్నాడు. ఇందులో కళ్లు చెదిరే […]

ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్, చివర్లో అనికేత్ వర్మ మెరుపులు.. RCBకి SRH బిగ్ టార్గెట్

ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్ ఘనంగా ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి ఆర్సీబీకి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇషాన్ కిషన్ (38 బంతుల్లో 80) భారీ హాఫ్ సెంచరీకి తోడు చివర్లో అనికేత్ వర్మ (18 బంతుల్లో 43) రాణించడంతో సన్ రైజర్స్ భారీ స్కోరు చేయగలిగింది.

ఎవర్రా ఈ జేకబ్ డఫీ..? అరంగేట్రంలోనే సన్‌రైజర్స్ వెన్నులో వణుకు పుట్టించాడుగా..!.

చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున అరంగేట్రం చేసిన న్యూజిలాండ్ పేసర్ జేకబ్ డఫీ, బౌలింగ్‌తో మాయ చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలను పెవిలియన్‌కు పంపి ఆ జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. అద్భుతమైన స్వింగ్‌తో బ్యాటర్లను తికమక పెట్టిన డఫీ, ఆ తర్వాత ఇన్-ఫామ్ బ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డిని కూడా అవుట్ చేసి తన అరంగేట్ర మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు

హై వోల్టేజ్ పోరుకు అంతా సిద్ధం..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు శనివారం అద్భుత ఆరంభం కాబోతోంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Vs సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం ఈ హై వోల్టేజ్ పోరుకు వేదికగా సిద్ధమైంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌తో టోర్నీకి ఉత్సాహభరితమైన ప్రారంభం లభించనుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON