loader

భారత్, పాక్ ఫైనల్..

ఆసియా కప్ 2025 (Asia Cup 2025) టోర్నీ ఫైనల్ కు చేరుకుని, క్రీడాభిమానుల హృదయాలను ఉత్కంఠతో నింపింది. ఈ (నేడు) ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యర్థులుగా భారత్ ,పాకిస్థాన్ తలపడనున్నారు. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటికే రెండు సార్లు ఎదురై ఉన్నాయి. ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు పాకిస్థాన్‌పై విజయం సాధించడంతో, ఆత్మవిశ్వాసంతో, ఆట ప్రతిభతో భారత్ ఫైనల్‌లో కొనసాగింది. ఈ మ్యాచ్‌లను మొబైల్స్‌లో ఫ్రీగా చూసే అవకాశం కూడా ఉంది. […]

శీతల్‌దేవి కొత్త చరిత్ర

పారా ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ ఆర్చర్‌ శీతల్‌దేవి కొత్త చరిత్ర లిఖించింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారత ఆర్చర్‌గా శీతల్‌ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.శనివారం జరిగిన మహిళల కాంపౌండ్‌ ఫైనల్లో జమ్ముకశ్మీర్‌కు చెందిన శీతల్‌దేవి 146-143తో ప్రపంచ నంబర్‌వన్‌, తుర్కియే ఆర్చర్‌ ఒజ్నుర్‌ కురె గిరిడిపై చారిత్రక విజయం సాధించింది.

ఇటు విరాట్, రోహిత్.. అటు రిజ్వాన్, ఇబ్రహిం.. దిగ్గజాలకే దడ పుట్టించిన అభిషేక్..

ఆసియా కప్‌లో టీమిండియా డేంజరస్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక భారీ రికార్డును సృష్టించాడు. శ్రీలంకతో జరుగుతోన్న సూపర్ ఫోర్ మ్యాచ్‌లో 34 పరుగులు చేసిన వెంటనే అభిషేక్ శర్మ, టీ20 ఆసియా కప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఘనత సాధించడానికి అతను పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వంటి ప్రముఖులను అధిగమించాడు. అభిషేక్ ఇప్పటివరకు టోర్నమెంట్‌లో 282 పరుగులు చేశాడు.

లెజెండరీ అంపైర్ డికీ బిర్డ్ కన్నుమూత

క్రికెట్‌ను ప్రాణంగా ప్రేమించి.. అంపైరింగ్‌ వృత్తిలో విశేషంగా రాణించిన డికీ బిర్డ్ (Dickie Bird) కన్నుమూశాడు. ఇంగ్లండ్‌కు చెందిన ఆయన మంగళవారం తుది శ్వాస విడిచాడు. తనదైన అంపైరింగ్‌తో అభిమానుల మనసులు చూరగొన్న డికీ వృద్ధాప్య సమస్యలతో 92 ఏళ్ల వయసులో మరణించాడు. ఆయన మృతి పట్ల యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్ సంతాపం తెలియజేసింది.  ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో చిరస్థాయిగా ఆయన పేరు నిలిచిపోతుంది అని యార్క్‌షైర్ క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆ ఓవరాక్షనే వద్దనేది.. హారిస్ రౌఫ్ భార్యకు దిమ్మదిరిగింది !

మ్యాచ్ ఓడిపోయినా తన భర్త చేసిన ప్రదర్శనపై గర్వంగా ఉందని హారిస్ రౌఫ్ భార్య ముస్జా మనూఫ్ కామెంట్స్ చేయడంతో ఈ రచ్చ మరింత ముదిరింది. ఇన్‌స్టాగ్రామ్‌లో “గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం” అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై టీమిండియా అభిమానులు స్పందిస్తూ.. ఆమెకు ఘాటుగానే సమాధానమిస్తున్నారు. మీ బుద్ధి ఎప్పటికీ మారదు అని ఎత్తిచూపారు. అలాగే, యుద్ధమైనా, ఆటైనా గేలిచేది భారత్.. ఓడిపోయేది పాకిస్తాన్ అంటూ చురకలంటిస్తున్నారు. క్రీడల్లో పాకిస్తాన్ ప్లేయర్లు ఇలా చేయడం పై […]

కొరియా షట్లర్ల జోరు.. సాత్విక్ జోడీకి వరుసగా రెండో రజతం

భారత డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టిలకు వరుసగా రెండో ఫైనల్లోనూ చుక్కెదురైంది. ఇటీవలే హాంకాంగ్ ఓపెన్ టైటిల్ వేటలో తడబడిన ఈ ద్వయం చైనా మాస్టర్స్‌ లోనూ కంగుతిన్నది. దక్షిణకొరియాకు చెందిన టాప్ సీడ్ సియో సూయెంగ్ జే – కిమ్ వొన్ హో జోడీకి బదులివ్వలేక వెండి పతకంతోనే సరిపెట్టుకుంది. ఆదివారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో సాత్విక్ – చిరాగ్ జంట 19-21, 15-21తో ఓటమి పాలైంది.

ఆస్ట్రేలియాపై స్మృతి మంధాన విధ్వంసం.. తొలి భారత మహిళా క్రికెటర్ గా రికార్డు

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మెరుపు శతకంతో చెలరేగింది. కేవలం 50 బంతుల్లోనే 12 ఫోర్లు, మూడు సిక్సులతో శతకం సాధించింది. అత్యంత తక్కువ బంతుల్లోనే శతకం సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్ గా రికార్డు సాధించింది. ఓవరాల్ గా రెండో బ్యాట్స్ ఉమెన్ గా నిలిచింది. 413 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టును విజయం దిశగా తీసుకెళ్తున్నారు.

నేడు చివరి వన్డేలో పింక్ జెర్సీతో టీమిండియా మహిళల జట్టు

భారత మహిళా క్రికెట్ జట్టు మరో సారి సామాజిక చైతన్యానికి నాంది పలికే వినూత్న నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం లో శనివారం జరగబోయే ఆస్ట్రేలియాతో చివరి వన్డే  లో టీమిండియా మహిళల జట్టు పింక్ కలర్ జెర్సీతో క్రీడాభిమానుల ముందుకు రాబోతోంది. ఈ ప్రత్యేక జెర్సీ వెనుక ఉన్న కారణం మాత్రం క్రికెట్ కంటే పెద్దది – రొమ్ము క్యాన్సర్ అవగాహన. రొమ్ము క్యాన్సర్ సమస్యపై సమాజంలో అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని […]

ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్

ఆసియాకప్‌లో భాగంగా షేక్ జాయెద్ స్టేడియం వేదికగా ఒమాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే షా ఫైజల్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి శుభ్‌మాన్ గిల్(5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం 3 ఓవర్లు ముగిసేసరికి భారత్ 1 వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. క్రీజ్‌లో అభిషేక్ శర్మ (15), సంజూ శాంసన్ (1) ఉన్నారు.

నిరాశపరిచిన నీరజ్ చోప్రా.. నాలుగో స్థానంలో నిలిచిన సచిన్ యాదవ్..

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్ త్రో విభాగంలో పతకం లేకుండానే భారత్‌ కథ ముగిసింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన స్టార్ అథ్లెట్, ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా అంచనాలను అందుకోలేక తీవ్రంగా నిరాశపరిచాడు. ఆశలు రేపిన మరో జావెలిన్ త్రోయర్ సచిన్ యాదవ్ తృటిలో పతకాన్ని చేజార్చుకున్నాడు. నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన నీరజ్ చోప్రా తన ఆరు ప్రయత్నాల్లో ఒక్కసారి కూడా 85 మీటర్ల మార్క్‌ను దాటలేకపోయాడు. ఉత్తమంగా 84.03 మీటర్లు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON