loader

కేసీఆర్, కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన మాగంటి సునీత

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ను ప్రకటించడంపై పార్టీ అధినేత కేసీఆర్ గారికి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. “నా మీద విశ్వాసం ఉంచి ఈ బాధ్యత ఇచ్చినందుకు పార్టీకి కృతజ్ఞతలు. జూబ్లీహిల్స్ ప్రజల మద్దతు, ఆశీర్వాదం ఎల్లప్పుడూ నాతో ఉండాలని కోరుకుంటున్నాను” అని ఆమె పేర్కొన్నారు.

ఒక్క ఉత్తరంతో దుర్మార్గుల నోరు మూయించినందుకు చిరంజీవికి అభినందనలు

మాజీ మంత్రి పెర్ని నాని, చిరంజీవి రాసిన ఒక లేఖను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. చిరంజీవి లేఖ దుర్మార్గుల నోరు మూయించిందని నాని వ్యాఖ్యానించారు. ఈ ఉత్తరం ద్వారా తప్పుడు మాటలు మాట్లాడే వారిని, నిందలు వేసేవారిని చిరంజీవి నిశ్శబ్దం చేశారని పెర్ని నాని అన్నారు. కామినేని శ్రీనివాసు, బాలకృష్ణ వంటి వారు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఇటువంటి ఆరోపణలు కొనసాగుతున్నాయని పెర్ని నాని పేర్కొన్నారు.

బీసీ రిజర్వేషన్ల జీఓ విడుదల

బీసీ రిజర్వేషన్ల జీఓను తెలంగాణ ప్రభుత్వం ఇవాళ (శుక్రవారం) విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీఓ- 09 విడుదల చేసింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. అయితే, స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రేపు(శనివారం) ఉదయం 11 గంటలకు తెలంగాణ ఎన్నికల సంఘం అత్యవసరంగా సమావేశం కానుంది. సీఎస్, డీజీపీ, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై ఎస్ఈసీ […]

అసెంబ్లీ ఎన్నికల తర్వాత జేడీయూకు భవిష్యత్తే లేదు : తేజస్వియాదవ్‌

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ పార్టీకి భవిష్యత్తే లేదని ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్‌ అన్నారు. ఆ పార్టీలో బీజేపీ ఐడియాలజీతో ఉన్నవాళ్లు బీజేపీలోకి వెళ్తారని, సామాజిక న్యాయం, లౌకికవాదాన్ని విశ్వసించేవారు ఆర్జేడీలోకి వస్తారని వ్యాఖ్యానించారు. జేడీయూపై, నితీశ్‌ కుమార్‌పై రాష్ట్ర ప్రజలకు నమ్మకం పోయిందని అన్నారు. పార్టీ క్యాడర్‌ కూడా నితీశ్‌ విధానాలతో అసంతృప్తిగా ఉందని తెలిపారు. అందుకే ఆ పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారని […]

బాలయ్య వ్యాఖ్యలపై భగ్గుమంటోన్న మెగా ఫ్యాన్స్.. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్

మెగాస్టార్ చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై బాలయ్య వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బాలకృష్ణ కుటుంబం తీవ్ర వేధింపులకు గురై, జైలు పాలైనప్పుడు అండగా నిలుచుంది, అధికారంలోకి రావడానికి అహర్నిశలూ కృషి చేసింది మెగా కుటుంబమే. కానీ ఈ విజ్ఞత మరిచి, అధికార మదం తలకెక్కించుకున్న బాలకృష్ణ చట్టసభల్లో సైతం చిరంజీవి గారి ప్రతిష్టను దిగజార్చేవిధంగా మాట్లాడేందుకు తెగించారు. బాలకృష్ణ ప్రజాక్షేత్రంలో తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం’ అని అఖిల భారత చిరంజీవి […]

పవన్‌ కల్యాణ్‌కు వైరల్‌ ఫీవర్‌.. ట్రీట్‌మెంట్‌ కోసం మంగళగిరి నుంచి హైదరాబాద్‌కు!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజులుగా ఆయన వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నప్పటికీ ఆయనకు జ్వరం తీవ్రత తగ్గడం లేదు. పైగా దగ్గు కూడా ఎక్కువైంది. దీంతో పవన్‌ కల్యాణ్‌ తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. పవన్‌ కల్యాణ్‌కు నాలుగు రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్‌కు వెళ్లి వైద్యం చేయించుకోవాలని మంగళగిరి వైద్యులు సూచించారు. డాక్టర్ల సూచన మేరకు పవన్‌ కల్యాణ్‌ వైద్య పరీక్షల కోసం ఇవాళ […]

ఎన్నికల ముందు లాలూ ప్రసాద్‌కు ఇంటిపోరు

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌కు స్వంత ఇంటిపోరు తప్పడం లేదు. ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య “రెబెల్‌”గా ఎదురుతిరిగి తనతండ్రి, సోదరులు తేజస్వియాదవ్, తేజప్రతాప్ యాదవ్, సోదరి మీసా భారతి సూచనలను ఏమాత్రం సోషల్ మీడియాలో ఖాతరు చేయడం లేదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోరులో ఎన్‌డిఎతో ఢీకొని ముఖ్యమంత్రి పీఠంపై తన కుమారుడు తేజస్వీయాదవ్‌ను కూర్చుండబెట్టడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. మూడోది చాలా నాటకీయంగా ఇంటిపోరునే ఎదుర్కొంటున్నారు.

బాలకృష్ణపై అంబటి రాంబాబు సంచలన పోస్ట్.. జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిని అసెంబ్లీ వేదికగా సైకో అని..  నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. “శ్రీ శ్రీ శ్రీ నందమూరి బాలకృష్ణ.. ప్రపంచంలోనే అతి పెద్ద సైకో..కావాలంటే సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేస్తా!” అంటూ అంబటి రాంబాబు  ఎక్స్ పోస్ట్‌ను వైసీపీ శ్రేణులు తెగ వైరల్ చేస్తున్నారు. దయచేసి ఆ సర్టిఫికెట్ ఏంటో అప్ లోడ్ చేయండి.. ఎవరు సైకోనో తెలుసు అంటూ అంబటి రాంబాబు పోస్ట్‌కు తెలుగుదేశం […]

బాలకృష్ణే పెద్ద సైకో.. మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంది ఆయనే: జూపూడి ప్రభాకర్

బాలక‌ష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌.. బాలకృష్ణకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. బాలకృష్ణని మించిన సైకో మరొకరు లేరని.. పైగా ఆయనకే మెంటల్ సర్టిఫికెట్ కూడా ఉందని తెలిపారు. అలాంటి వ్యక్తి మెంటల్ బాలకృష్ణ జగన్‌ని సైకో అంటారా అని ప్రశ్నించారు. బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని వార్నింగ్ ఇచ్చారు. అలానే గతంలో బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిపిన కేసులో […]

‘A’ సర్టిఫికెట్ సినిమాకు పిల్లాడితో జ‌న‌సేన ఎమ్మెల్యే మాధ‌వి.. నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ సినిమాకు సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఓజీ చూశాను అంటూ  జ‌న‌సేన ఎమ్మెల్యే మాధ‌వి సోష‌ల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. అయితే ఈ పోస్ట్‌లో ఒక చిన్న‌పిల్ల‌వాడు క‌నిపిస్తున్నాడు. ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చిన సినిమాకు పిల్ల‌ల‌ను ఎలా అనుమ‌తించారంటూ థియేట‌ర్ యాజ‌మాన్యంతో పాటు ఇటు జ‌న‌సేన ఎమ్మెల్యే మాధ‌విని విమ‌ర్శిస్తున్నారు. పిల్ల‌ల‌ను ‘A’ రేటింగ్ సినిమాకు తీసుకురాకుడ‌ద‌ని తెలియ‌దు. నువ్వు ఒక ఎమ్మెల్యే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON