బీసీ రిజర్వేషన్ల జీఓను తెలంగాణ ప్రభుత్వం ఇవాళ (శుక్రవారం) విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీఓ- 09 విడుదల చేసింది రేవంత్రెడ్డి ప్రభుత్వం. అయితే, స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రేపు(శనివారం) ఉదయం 11 గంటలకు తెలంగాణ ఎన్నికల సంఘం అత్యవసరంగా సమావేశం కానుంది. సీఎస్, డీజీపీ, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై ఎస్ఈసీ చర్చించనుంది.

