loader

ఖర్గేతో సిఎం రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ఖర్గేతో చర్చించినట్టుగా సమాచారం. దీంతోపాటు పార్టీ పదవులు, తదితర అంశాల గురించి సిఎం రేవంత్‌రెడ్డి ఖర్గేతో మాట్లాడినట్టుగా తెలిసింది. ఏఐసిసి నూతన కార్యాలయం ‘ఇందిరా భవన్’లో జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.

ఒడిశాలో కాంగ్రెస్‌కు భారీ దెబ్బ

ఒడిశాలో కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా ఓటు వేసిన ముగ్గురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. సోమవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేశ్ చంద్ర జెనా, దశరథి గోమాంగో, సోఫియా ఫిర్డోస్ బీజేపీ మద్దతుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి దిలీప్ రాయ్‌కు ఓటు వేశారు.ఒడిశా కాంగ్రెస్ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ మాట్లాడుతూ, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఇలాంటి చర్యలకు పాల్పడతారని ఊహించలేదన్నారు.

చంద్రబాబు రెండేళ్లకే రూ.3,30,000 కోట్ల అప్పు చేశారు: జగన్ విమర్శలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం రెండేళ్ల కాలంలోనే రూ. 3,30,000 కోట్ల భారీ అప్పులు చేశారని ఆయన ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పుల కంటే ఇది చాలా ఎక్కువని జగన్ వివరించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న మంచి పథకాలన్నింటినీ రద్దు చేశారని జగన్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు కేవలం మోసపూరిత మాటలని తేలిపోయాయని విమర్శించారు. ప్రజలకు అందాల్సిన డబ్బు ఎవరి […]

అంబేద్క‌ర్ విగ్ర‌హం ఎదుట వైసీపీ నిర‌స‌న‌

స‌మాజంలో ప‌రువు పోగొట్టుకున్న‌ప్ప‌టికీ, టీటీడీ చైర్మ‌న్‌గా కొన‌సాగుతుండ‌డం అనైతిక‌మ‌ని, ఇప్ప‌టికైనా పున‌రాలోచించాల‌ని కోరుతూ బీఆర్ నాయుడు బ‌స చేస్తున్న హోట‌ల్ వ‌ద్ద శాంతియుతంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డానికి వెళ్లిన వైసీపీ శ్రేణుల‌పై టీడీపీ గూండాలు భౌతిక‌దాడికి పాల్ప‌డ్డాయి. క‌నీసం మ‌హిళ‌ల‌న్న గౌర‌వం కూడా లేకుండా దాడికి పాల్ప‌డ్డాన్ని వ్య‌తిరేకిస్తూ తిరుప‌తి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద వైసీపీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శించింది. టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేసి టీటీడీ ప్ర‌తిష్ట‌ను […]

కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీలపై కేటీఆర్ విమర్శలు

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మ్మెల్యే కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. తొలి కేబినెట్‌లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు, మరి ఆ ఫైల్ ఎక్కడుంది? అది ఎఫ్ఎస్‌ఎల్ (FSL) అగ్నిప్రమాదంలో కాలిపోయిందా? అని అసెంబ్లీ సాక్షిగా నిలదీశారు. మాయమైన ఆరు గ్యారంటీల ఫైలును వెతికి పట్టుకోవడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) వేయాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

అర్ధరాత్రి బదిలీలపై మమత ఆగ్రహం, ఈసీపై విమర్శ

పశ్చిమ బెంగాల్‌లో కీలక ఉన్నతాధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి సమయంలో ఈ బదిలీలు చేపట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆమె వ్యాఖ్యానించారు.సోమవారం అర్ధరాత్రి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నందిని చక్రవర్తి, హోం సెక్రటరీ జేపీ మీనా, డీజీపీ మరియు కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఈ చర్యపై స్పందించిన మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

రైతులకు వెన్నుపోటు.. రాహుల్‌కు వెయ్యి కోట్లా.. అసెంబ్లీలో నిలదీస్తామన్న కేటీఆర్

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. పంటల వేసే నాటికి కేసీఆర్ రైతుబంధు నిధులు వేసేవారని కేటీఆర్ గుర్తుచేశారు. రాహుల్ బంధు కాదు.. రైతుబంధు వేయాలని కోరారు. రైతులకు వెన్నుపోటు.. రాహుల్‌కు వెయ్యి కోట్లా అని నిలదీస్తామని అన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాల ఊసే లేదని.. రైతుబంధుకు దిక్కే లేదని విమర్శించారు. వృద్ధులు పింఛన్లు, రైతులు, రైతు కూలీలు రైతు భరోసా కోసం […]

ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌పై టీడీపీ అధిష్టానం సీరియస్‌

ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్‌ పార్టీలో పట్టుబడిన ఘటనపై టీడీపీ అధిష్టానం సీరియస్‌ అయ్యింది . పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించింది.పుట్టా మహేష్‌ వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్‌ కేసులో మహేష్‌ పట్టుబడిన అంశంపై నివేదిక ఇవ్వాలని వెల్లడించారు. డ్రగ్స్‌ వంటి ఘటనల్లో ఎవరూ ఉన్నా […]

నాలుగు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా

దేశంలో నాలుగు రాష్ట్రాలతో పాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ ఏప్రిల్ 9న, తమిళనాడులో ఏప్రిల్ 23న పశ్చిమ బెంగాల్‌లో మాత్రం రెండు దశల్లో అంటే ఏప్రిల్ 23, ఏప్రిల్ 29న పోలింగ్ జరుగనుంది. కాగా మే 4న కౌంటింగ్ జరుగనుంది.దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది.

ఇప్పటికే చాలాసార్లు చెప్పా.. నేను డ్రగ్స్‌ టెస్ట్‌కు రెడీ.. కేటీఆర్‌ సీరియస్‌

డ్రగ్స్ వినియోగాన్ని బీఆర్‌ఎస్‌ కూడా తీవ్రంగా ఖండిస్తుందని కేటీఆర్ తెలిపారు. నేను ఎప్పుడైనా డ్రగ్స్‌ టెస్ట్‌కు సిద్ధంగా ఉన్నానని కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. డ్రగ్స్‌ టెస్ట్‌కు సిద్ధమని ఇప్పటికే చాలాసార్లు చెప్పానని గుర్తుచేశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు డ్రగ్స్‌ టెస్ట్‌ చేయించుకోవాలని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ చేసిన ప్రతిపాదనను స్వాగిస్తున్నానని తెలిపారు. ఇక, ప్రతి డ్రగ్స్‌ కేసులో తన పేరును వాడటంపై కేటీఆర్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఇకపై తన పేరును డ్రగ్స్‌ కేసులో అనవసరంగా లాగితే చట్టపరమైన […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON