ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం రెండేళ్ల కాలంలోనే రూ. 3,30,000 కోట్ల భారీ అప్పులు చేశారని ఆయన ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పుల కంటే ఇది చాలా ఎక్కువని జగన్ వివరించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న మంచి పథకాలన్నింటినీ రద్దు చేశారని జగన్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు కేవలం మోసపూరిత మాటలని తేలిపోయాయని విమర్శించారు. ప్రజలకు అందాల్సిన డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తోందని ఆయన సూటిగా ప్రశ్నించారు.

