loader

టైగ‌ర్ అబీ జిందా హై.. నితీశ్ ఇంటి ముందు భారీ పోస్ట‌ర్‌

బీహార్‌లో  అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీఎం నితీశ్ కుమార్ పార్టీ మ‌ళ్లీ ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఎన్డీఏ కూట‌మి 180 స్థానాల్లో అగ్ర‌స్థానంలో దూసుకెళ్తున్న‌ది. ఎన్డీఏ విక్ట‌రీ బీహార్‌లో ఖాయ‌మైంది. నితీశ్ ఖాతాలోనే ఆ స‌క్సెస్ ప‌డింది. ఇక సీఎం నితీశ్ ఇంటి ముందు ఇవాళ ఓ భారీ పోస్ట‌ర్ ద‌ర్శ‌న‌మిచ్చింది. టైగ‌ర్ అబీ జిందా హై అంటూ ఆకట్టుకునే రీతిలో ఆ పోస్ట‌ర్ వేశారు. పులి ఇంకా బ్రతికే ఉంది అంటూ ఆ పోస్ట‌ర్‌పై […]

ఆరో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ 15 వేల ఓట్లతో ముందంజ

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి ఆరు రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఆరు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ పదిహేను వేలకు పైగా ఆధిక్యంలో ఉంది. రెండో స్థానంలో బిఆర్‌ఎస్ పార్టీ ఉంది. ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

భారీ ఆధిక్యం దిశగా ఎన్డీయే.. 60 స్థానాలతో సరిపెట్టుకున్న మహాగఠ్‌బంధన్‌

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతున్నది. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను నిజం చేస్తూ ఎన్డీయే భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నది. ఇప్పటివరకు 160 స్థానాల్లో అధికార కూటమి ముందంజలో ఉన్నది. నితీశ్ కుమార్‌ 20 ఏండ్ల పాలనకు ఈసారి ఫుల్‌స్టాప్‌ పెట్టాలనుకున్న మహాగఠ్‌బంధన్‌ కేవలం 60 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 4 చోట్ల ముందంజలో ఉన్నారు. మొత్తం 243 స్థానాలున్న బీహార్‌ అసెంబ్లీలో మెజార్టీ మార్క్‌ 122 స్థానాలు.

జూబ్లీహిల్స్‌లో హోరాహోరీ.. తొలి రౌండ్‌ ఫలితాలు విడుదల!

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. తొలి రౌండ్‌ పూర్తయ్యేసరికి కాంగ్రెస్‌ కేవలం 62 ఓట్ల ఆధిక్యంలోనే ఉంది. మొదటి రౌండ్‌లో షేక్‌పేట డివిజన్‌లోని పోలింగ్‌ బూత్‌ ఓట్లను లెక్కించగా.. కాంగ్రెస్‌ పార్టీ 8,926 ఓట్లు వచ్చాయి. ఇక బీఆర్‌ఎస్‌కు 8,864 ఓట్లు వచ్చాయి.ఇక పోస్టల్‌ బ్యాలెట్ల విషయానికొస్తే కాంగ్రెస్‌కు 47 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌కు 43 ఓట్లు రాగా.. బీజేపీకి కేవలం 11 ఓట్లు మాత్రమే వచ్చాయి.

జడ్జ్‌మెంట్‌ డే.. బీహార్‌ ఎన్నిక కౌంటింగ్‌

బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, ఆరు రాష్ట్రాల్లోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంది. ఈ ఎనిమిది స్థానాల్లో రాజస్థాన్‌లోని అంటా, జార్ఖండ్‌లోని ఘట్‌శిల, పంజాబ్‌లోని తర్న్ తరణ్, తెలంగాణలోని జూబ్లీ హిల్స్, మిజోరాంలోని డంపా, ఒడిశాలోని నువాపాడా మరియు జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గాం, నగ్రోటా ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు ఉదయం 8 గంటలకు రావడం ప్రారంభమవుతాయి.

నడిరోడ్డుపై భార్యను కిరాతంగా పొడిచి చంపిన భర్త

సూర్యారావుపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెందిన ల్యాబ్‌ టెక్నీషియన్ విజయ్‌,స్టాఫ్‌ నర్స్‌ సరస్వతి లవ్‌ మ్యారేజి చేసుకున్నారు అయితే సరస్వతిపై విజయ్‌ అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. కుటుంబ కలహాల నేపథ్యంలో సరస్వతి తన రెండేళ్ల కొడుకుతో విడిగా ఉంటుంది. భార్య సరస్వతిపై విజయ్‌ మరింత పగ పెంచుకున్నాడు. గురువారం ఉదయం భార్య ఉన్న చోటుకు విజయ్‌ కోపంగా వెళ్లాడు. నడిరోడ్డు మీదనే ఆమెపై కత్తితో దాడి చేశాడు. కిరాతకంగా ఆమెను పొడిచి […]

42 టేబుళ్లు – 10 రౌండ్లలో లెక్కింపు – రేపు మధ్యాహ్నానికి జూబ్లీహిల్స్​ ఫలితం!

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు యూసుఫ్​గూడలోని కోట్ల విజయభాస్కర్​రెడ్డి స్టేడియం సిద్ధమవుతోంది. అక్కడ పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 42 టేబుళ్లపై 10 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నామని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్​ తెలిపారు.  120 మంది అధికారులకు విధులు కేటాయించామని తెలిపారు. నియోజకవర్గంలో  4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,94,631 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. షేక్​పేట, రహ్మత్​నగర్  డివిజన్లలో ఎక్కువ ఓట్లు అనేవి ఉన్నాయి. 70 వేల చొప్పున 1.40 […]

ఆ మాజీ మంత్రి భూమి అక్రమణలపై పవన్ వీడియో విడుదల

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల అక్రమణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వీడియో విడుదల చేశారు. భూముల అక్రమణపై జనసేనే పార్టీ యూ ట్యూబ్ లో వీడియోను ఉప ముఖ్యమంత్రి పవన్ అప్ లోడ్ చేశారు. ఇటీవల కుంకీ ఏనుగుల సందర్శన సమయంలో ఏరియల్ సర్వే నిర్వహించి పవన్ వీడియో తీసి విడుదల చేశారు. మంగళంపేట అటవీ భూముల్లో 76.74 ఎకరాలలో అక్రమణకు గురైందని, విజిలెన్స్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు పవన్ […]

ఆ క్రెడిట్ మొత్తం మాదే.. క్రెడిట్‌ చోరీ స్కీం ఏంటి: వైఎస్ జగన్

మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్స్‌ వేదికగా చంద్రబాబుపై విమర్శలు చేశారు. ‘చంద్రబాబుగారూ.. మీ కథ, స్క్రీన్‌, ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న “క్రెడిట్‌ చోరీ స్కీం’’ చాలా బాగుంది. పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం సేకరించకుండా.. ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా.. ఒక్కపైసా ఖర్చుచేయకుండా.. ఒక్క ఇల్లుకూడా మంజూరు చేయకుండా. “ఇళ్లన్నీ మేమే కట్టేశాం” అంటూ పచ్చి అబద్ధాలను మీరు చేస్తున్న క్రెడిట్‌ చోరీ […]

ఎన్నికల సమయం లోనే ఉగ్రదాడులా ?: సిద్ధరామయ్య

దేశంలో ఎన్నికల సమయంలోనే ఉగ్రదాడులు జరుగుతుండడానికి కారణాలేమిటని కర్ణాటక సిఎం సిద్ధరామయ్య సందేహాన్ని వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి ప్రకటనపై విపక్షం బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. బుధవారం తన ఎక్స్ ఖాతా ద్వారా సిఎం సిద్ధరామయ్య ఎన్నికల సమయం లోనే ఉగ్రమూకల దాడులు జరగడానికి కారణాలేమిటని ప్రశ్నించారు. మంగళవారం బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్‌పూర్తయిన తరువాత సిద్ధరామయ్య వ్యాఖ్యలు వచ్చాయి. దేశంలో బాంబు పేలుళ్లు జరగకూడదని, అమాయక ప్రజలు చనిపోతారని పేర్కొన్నారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON