loader

మాగంటి సునీతకు బి.ఫాం అందజేసిన కెసిఆర్

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్‌కు పార్టీ అధినేత కెసిఆర్ మంగళవారం బి.ఫామ్ అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున రూ.40 లక్షల చెక్కును అందించారు. కార్యక్రమంలో మాగంటి గోపీనాథ్ కుమార్తెలు, కుమారుడు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్, ఎంఎల్‌ఎలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, నలమోతు భాస్కర్ రావు, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కూటమి నేతలు దోచుకోవడానికే మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ : మాజీ మంత్రి ధర్మాన

కూటమి నేతలు ఇష్టానుసారంగా దోచుకోవడానికే ఆంధ్రప్రదేశ్‌లోని మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరణకు పూనుకుంటుందని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ప్రభుత్వ వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చామని, ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వ ఆస్పత్రులకు ఇన్‌ఛార్జ్‌లుగా నియమించామని స్పష్టం చేశారు. కరోనా విపత్తును ధైర్యంగా ఎదుర్కొన్నాం వివరించారు. కూటమి పాలనలో పేదలకు వైద్యం దూరమవుతుందని విమర్శించారు. ప్రజల ఆరోగ్యం కాపాడటం ప్రభుత్వాల బాధ్యతని, మెరుగైన వైద్యం పొందటం ప్రజల ప్రాథమిక హక్కు అని గుర్తు చేశారు.

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు… మిథున్ రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో సిట్ సోదాలు…

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో ఏపీ పోలీసులు సోదాలు చేపట్టారు. ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి నిందితుడిగా ఉండగా… సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, తిరుపతిలలో మిథున్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. అలాగే సోమాజిగూడలోని డికాట్ కొరియర్ కంపెనీలోనూ సిట్ అధికారుల సోదాలు చేపట్టారు. డికాట్ కొరియర్ నుంచి మిథున్ రెడ్డికి చెందిన పీఎల్ఎఆర్ ప్రాజెక్టులోకి రూ. 25 కోట్లు వచ్చినట్లు సిట్ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది.

బీహార్‌ ఎన్నికలు.. తొలి జాబితా రిలీజ్‌ చేసిన బీజేపీ

బీహార్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో పార్టీల్లో ఉత్సాహం పెరిగింది. బీజేపీ (BJP) సైతం గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితాను కమలం పార్టీ ఇవాళ రిలీజ్‌ చేసింది 71 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్‌ చౌదరి, విజయ్‌ సిన్హాలు కూడా ఉన్నారు.

ఆడవాళ్లంతా తాగుబోతులే.. నకిలీ మద్యంపై నిరసనలో నోరుజారిన మాజీ ఎమ్మెల్యే

పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మహిళలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వైసీపీ పిలుపు మేరకు ఎక్సైజ్ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన ధర్నా సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడారు. ‘ఆడవాళ్లందరూ మందు తాగుతున్నారు. తమ అసలు ప్రవర్తనను ప్రజలకు చూపిస్తున్నారు. ప్రజలు కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారు’ అని అన్నారు.  మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

జూబ్లీహిల్స్‌లో భారీగా దొంగ ఓట్లు.. సీఈఓకు కేటీఆర్ ఫిర్యాదు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు అధికార కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఎన్నికల అక్రమాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసే ముందు మోసపూరిత ఓట్లను తొలగించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు, జూబ్లీహిల్స్‌లో ఒక్కో వ్యక్తికి రెండు, మూడు ఓటర్‌ ఐడీ కార్డులు ఉన్నాయని.. ఒకే అడ్రస్‌తో ఒక్కొక్కరు మూడు, నాలుగు పేర్లు నమోదు చేయించుకున్నారని ఆరోపించారు.

అందరూ మద్యనిషేధం చేస్తామని హామీ ఇస్తారు.. కానీ ఆయన ఎత్తేస్తామని హామీ ఇస్తారు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మద్యనిషేధం అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ మారిన రాజకీయవేత్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ, రాష్ట్రంలోని మద్యనిషేధాన్ని ఎత్తివేస్తామని మరోసారి హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన ఒక గంటలోనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. బీహార్‌లో మద్యనిషేధం 2016లో ముఖ్యమంత్రి నీతీష్ కుమార్ ప్రభుత్వం అమలు చేసిన చట్టం. ఇది మద్యం తయారీ, అమ్మకం, వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది.

ఎవర్నీ వదిలేది లేదు.. బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

కావాలనే తనపై కొంతమంది బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట వినుత డ్రైవర్ రాయుడు పేరుతో విడుదలైన వీడియోపై పోలీసుల విచారణ జరగాలని కోరారు. ఈ విషయంలో ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. తనకు వినుత డ్రైవర్ రాయుడు తెలియదని క్లారిటీ ఇచ్చారు. వినుత బెయిల్ రద్దు చేయాలని […]

ఫిర్యాదుల అంశం.. స్పందించిన మంత్రి పొంగులేటి

తనమీద సహచర మంత్రులు ఎవరూ ఫిర్యాదు చేశారని నమ్మడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తాను అంటే ఏంటో అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. రూ.70 కోట్ల కాంట్రాక్టు కోసం తాపత్రయ పడే అంత అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. మంత్రులు తనమీద ఫిర్యాదు చేయడానికి అసలు ఏమి ఉందని ప్రశ్నించారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఇద్దరు మంత్రులు సమ్మక్క – సారక్కలాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.

రాజకీయ కక్షతోనే కేసు.. బీజేపీపై పోరాటం ఆగదు

ఐఆర్‌సీటీసీ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ పైన, తన తల్లి రబ్రీదేవి, తనపైన ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు అభియోగాలు దాఖలు చేయడంపై రాష్ట్రీయ జనతాదళ్ (RJD)నేత తేజస్వి యాదవ్ స్పందించారు. ‘ఈ కేసుపై పోరాడతాం. ఎన్నికలు దగ్గర పడినప్పుడు కేసును తెరపైకి తెస్తారనే విషయాన్ని మొదట్నించి నేను చెబుతూనే ఉన్నాను. కోర్టు తీర్పును గౌరవిస్తున్నాను. దీనిపై మేము పోరాడతాం. బీహార్ ప్రజలు చాలా తెలివైనవారు, ఏం జరిగిందో వారందరికీ తెలుసు. ఇది కచ్చితంగా రాజకీయ కక్షే’ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON