loader

రాజకీయ వ్యవస్థలో యువతను భాగస్వామ్యం చేస్తాం: పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘సేనతో సేనాని – మన నేల కోసం కలిసి నడుద్దాం’ అంటూ ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని జనసేన నిర్వహించనుందని చెప్పుకొచ్చారు. యువతీ, యువకులు తమకు నచ్చిన అంశాన్ని ఎంచుకుని సేవలు అందించే అవకాశాన్ని ఈ వేదిక కల్పించనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు QR కోడ్ స్కాన్ చేసి, లేదా లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు.

హైదరాబాద్ ట్రాఫిక్ నిలిపిన పోలీసులు

హైదరాబాద్‌లో నవీన్ యాదవ్ నామినేషన్ కార్యక్రమం కోసం పోలీసులు సకల మర్యాదలు చేశారు. మైత్రివనం నుండి యూసుఫ్‌గూడ వరకు ట్రాఫిక్ నిలిపి వేయడంతో నగరంలో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేతలకు ఇలాంటి VIP ట్రీట్మెంట్ ఇవ్వడం సరైనదా? ప్రజా ట్రాఫిక్‌ను ఇలా ఆపేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

హైదరాబాద్ నుంచి వచ్చి ఎవరేం చేయలేరు: ప్రశాంత్ కిషోర్

జోకిహాట్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీ లోక్‌సభ ఎంపీ సర్ఫరాజ్ ఆలం​ జన్​సురాజ్ పార్టీలో చేరారు. దీంతో ఆయనను స్వాగతించిన ప్రశాంత్ కిషోర్ పలు వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీపై విమర్శలు గుప్పించారు. సీమాంచల్‌కు చెందిన ముస్లిం మాత్రమే ఆ ప్రాంత మనోవేదనలను అర్థం చేసుకోగలడని అంతే కానీ హైదరాబాద్ నుంచి వచ్చే ఎవరూ ఏం చేయలేరని ఎంఐఎంపై పరోక్షంగా విమర్శలు చేశారు. బిహార్ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ, ఇండీ బ్లాక్​లు అధిక ధరలకు సీట్లు […]

కేసీఆర్ ఫోటో లేకుండానే.. కవిత జిల్లాల యాత్ర.

బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత.. కాస్త విరామం తీసుకుని కల్వకుంట్ల కవిత మళ్లీ ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఆమె తొలిసారిగా తన తండ్రి కేసీఆర్ ఫోటో లేకుండానే ఈ యాత్ర సాగించనున్నారు. కేసీఆర్ బదులుగా ఈ ప్రచారంలో ప్రొఫెసర్ జై శంకర్ ఫోటోను ఉపయోగిస్తారని సమాచారం. ఆమె ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘నైతికంగా కరెక్ట్ కాదనే కేసీఆర్ ఫోటో తీసేస్తున్నట్టు’ ఆమె అన్నారు. ఇద్దరు దారులు వేరన్నప్పుడు తన దారి తాను చూసుకోవాలని కవిత చెప్పారు.

రాఘోపూర్‌లో నామినేషన్‌ వేసిన తేజస్వియాదవ్‌..

ఆర్జేడీ అగ్రనాయకుడు, బీహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్‌ తన సిట్టింగ్‌ స్థానమైన రాఘోపూర్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ అనంతరం తేజస్వి మాట్లాడుతూ.. రాఘోపూర్‌ ప్రజలు తనపై విశ్వాసంతో ఇప్పటికే రెండుసార్లు గెలిపించారని, ఇప్పుడు మూడోసారి నామినేషన్‌ వేశానని, మళ్లీ గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులైన తన తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌, తల్లి రబ్రీదేవి తో కలిసి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

చెవిరెడ్డి బెయిల్‌పై విచారణ.. సుప్రీం కీలక నిర్ణయం

మద్యం కేసు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి బెయిల్‌పై సుప్రీంకోర్టు క్లారిఫికేషన్ ఇచ్చింది. మద్యం కేసులో మిగతా నిందితులతో సంబంధం లేకుండా వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి బెయిల్‌పై నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్‌పై తుది నిర్ణయం తీసుకునేంత వరకు ట్రయల్ కోర్టు మిగతా వారి బెయిల్ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.

పదేళ్ల అభివృద్ధి, రెండేళ్ల అరాచక పాలనకి మధ్య..కేటీఆర్‌

జూబ్లీహిల్స్‌లో జరుగుతున్న ఎన్నిక పార్టీలు, ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న ఎన్నిక కాదని.. పదేండ్ల అభివృద్ధి, పాలనకి.. రెండు సంవత్సరాల అరాచక పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నిక అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ల కేటీఆర్‌ అన్నారు. జూబ్లీహిల్స్‌లో ఆడబిడ్డ గెలుపు కోసం రాష్ట్రంలోని కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారని.. ఆమె గెలుపుతోనైనా ప్రభుత్వం ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.2500 ఇస్తుందని ఆశిస్తున్నారన్నారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్ధిని ప్రకటించిన బీజేపీ..

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డిను ప్రకటించిన ఆ పార్టీ. అభ్యర్థి విషయంలో ఆఖరు నిమిషం వరకూ ఉత్కంఠ కొనసాగింది. చివరికి దీపక్‌రెడ్డికే ఛాన్స్‌ ఇచ్చారు. గతంలోనూ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి దీపక్‌రెడ్డి పోటీ చేశారు. ఇద్దరు మహిళా నేతలు కూడా టికెట్‌ కోసం పోటీ పడినా.. వివిధ సమీకరణాల్ని బేరీజు వేసుకున్నాక దీపక్‌రెడ్డి పేరు ఫైనల్ చేశారు.

ఎన్నికల వేళ బీజేపీలో చేరిన ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్

యువ ఫోక్ సింగర్‌గా మంచి పేరు తెచ్చుకున్న మైథిలి ఠాకూర్ బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీలో చేరారు. 25 ఏళ్ల మైథిలీ ఠాకూర్‌కు దర్బంగాలోని అలీనగర్ అసెంబ్లీ నియోజకర్గం నుంచి బీజేపీ టిక్కెట్ కేటాయించే అవకాశం ఉంది. మైథిలీ ఠాకూర్‌ను బిహార్ ‘స్టేట్ ఐకాన్’గా ఎన్నికల కమిషన్ నియమించింది. రాష్ట్రానికి సాంస్కృతిక అంబాసిడర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమెకు బిహార్ ఫోక్ మ్యూజిక్‌కు చేసిన సేవలకు సంగీత నాటక అకాడమీ 2021లో ఉస్తాద్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON