loader

భక్తుల మనోభావాలు దెబ్బతీశారు.. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్..

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. భగవద్గీత వంటి పవిత్ర గ్రంథంపై ఆయన అహంకారంతో మాట్లాడటం సరికాదని, ఇది భక్తుల మనోభావాలను కించపరచడమేనని ఆమె అన్నారు. గతంలో ఆయనకు సంబంధించి కొన్ని అసభ్యకర వీడియోలు బయటకు వచ్చాయని, అటువంటి వ్యక్తిని పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో చంద్రబాబు నాయుడు ఎందుకు కొనసాగిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. తిరుమల ప్రతిష్టను చంద్రబాబు ప్రభుత్వం మంటగలుపుతోందని ఆమె ఆరోపించారు.

సిద్దిపేట నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపిస్తే మంత్రిని చేస్తా.. సీఎం రేవంత్ రెడ్డి హామీ

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిని గెలిపిస్తే.. వారిని మంత్రివర్గంలోకి తీసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నంగునూరు మండలం నర్మెటలో నిర్మించిన ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. అదే వేదిక నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రాష్ట్రంలోని 70 లక్షల మందికి రైతు భరోసా నిధులను రిలీజ్ చేసినట్లు చెప్పారు.  రాష్ట్రంలో రైతును రాజును చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం […]

మోదీయే అతిపెద్ద చొరబాటుదారు:బెనర్జీ సంచలన కౌంటర్!

కోల్‌కతాలో నిర్వహించిన ఈద్ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ నేతలే అసలైన చొరబాటుదారులంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌ను టార్గెట్ చేసేవారు నరకానికి వెళ్తారని, మతం పేరుతో విభజన రాజకీయాలు చేసేవారిని ప్రజలు క్షమించరని ఆమె హెచ్చరించారు.ప్రధాని నరేంద్ర మోదీ మరియు కేంద్ర ప్రభుత్వమే దేశంలో అతిపెద్ద చొరబాటుదారులని మమతా బెనర్జీ విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాస్తూ, ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రాధాన్యం లేనప్పుడు పార్టీలో ఉండటం ఎందుకు: జీవన్ రెడ్డి

కాంగ్రెస్ పై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలవడానికి మంత్రి శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ జీవన్ రెడ్డి ఇంటికి వచ్చారు. జీవన్ రెడ్డితో గంటకు పైగా మంత్రులు సమావేశమయ్యారు.జీవన్ రెడ్డి ఆవేదనను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ మార్పుపై పట్టు వీడలేదని, ప్రాధాన్యం లేనప్పుడు పార్టీలో ఉండటం ఎందుకని ప్రశ్నించారు. మంత్రులు పార్టీలో కొనసాగాలని కోరారు. మీకో దండం అంటూ మంత్రులపై […]

వన్ కల్యాణ్, జనసేనకు వాల్యూ లేదా? అరవ శ్రీధర్‌ బాధితురాలి సంచలన వీడియో!

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై బాధితురాలు తాజాగా విడుదల చేసిన వీడియోలో పార్టీ కార్యక్రమాల్లో శ్రీధర్ పాల్గొనడంపై బాధితురాలు ప్రశ్నిస్తున్నారు. నేరుగా పవన్ కల్యాణ్‌ను నిలదీస్తున్నారు. పార్టీకి, పవన్ కల్యాణ్‌కు ఉన్న విలువ ఇదేనా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. శ్రీ అరవ శ్రీధర్‌కు పవన్ అంటే లెక్కలేదా? లేకుంటే ఇంటర్నల్‌గా ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చారా అని నిలదీశారు. శ్రీధర్ అనే వ్యక్తికి పవన్ కల్యాణ్, జనసేన పార్టీ చెప్పినా పట్టించుకోడు అని అనుకోవాల్సి […]

తృణమూల్ మ్యానిఫెస్టో విడుదల..పది హామీలతో!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 10 ప్రధాన హామీలతో రూపొందించిన ఈ మ్యానిఫెస్టోలో సంక్షేమ పథకాల విస్తరణ, ప్రజలకు మరింత చేరువైన ఆరోగ్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ అమలు చేస్తున్న ‘లక్ష్మీర్ భండార్’,ప్రజల ఇంటి వద్దే ఆరోగ్య సేవలు అందించే ‘డువారే చికిత్స’ పథకం మేనిఫెస్టోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

భువనేశ్వరిపై మాట జారితే తాట తీస్తాం: మంత్రి సవిత వార్నింగ్

మాజీమంత్రి ఆర్‌కే రోజాపై రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం పోయినా రోజాకు మదం తగ్గలేదు అని ఘాటుగా విమర్శించారు. 2024లో నగరి ప్రజలు చెప్పుతోకొట్టినట్టు బుద్ధి చెప్పినా రోజా తీరు మారలేదు అని మండిపడ్డారు. ఇంట్లో ఖాళీగా కూర్చొలేక గాలి మాటలు మాట్లాడుతోంది అని మండిపడ్డారు. నారా భువనేశ్వరిపై మాట జారితే తాట తీస్తామని మంత్రి సవిత మాజీమంత్రి రోజాకు హెచ్చరించారు.

ఏపీ జాబ్ క్యాలెండర్‌పై షర్మిల విమర్శలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పర్వదినాన విడుదల చేసిన జాబ్ క్యాలెండర్  నిరుద్యోగ యువతను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 1.80 లక్షల ఖాళీలు ఉన్నాయని, కానీ ప్రభుత్వం కేవలం 10,060 పోస్టులనే భర్తీ చేస్తామనడం హాస్యాస్పదమని ఆమె ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వారిని పచ్చిగా మోసం చేసిందని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎల్బీనగర్ లో ఉద్రిక్తంగా మారిన ‘సే నో డ్రగ్స్ ఛాలెంజ్

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ ఘటన నేపథ్యంలో ఎల్బీనగర్ లో ‘సే నో డ్రగ్స్ ఛాలెంజ్’ ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ నేతలకు ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతలు ‘వైట్ ఛాలెంజ్’ విసిరారు. కాంగ్రెస్ నేతలు ఎల్బీనగర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఇతర నేతలు ఎల్బీనగర్ వెళ్ళిన క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వాగ్వాదం చేసుకున్నారు. పోలీసులు, ఎమ్మెల్యే అనుచరులకు మధ్య వాగ్వాదం, […]

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఎంపీ బెయిల్‌పై రేవంత్ రెడ్డి స్పందన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై కీలక వివరణ ఇచ్చారు. ఈ ఉదంతంలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు స్టేషన్ బెయిల్ లభించడం వెనుక ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. చట్టపరమైన నిబంధనల ప్రకారమే పోలీసుల ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇందులో రాజకీయ జోక్యం లేదని సీఎం వెల్లడించారు. ఈ కేసులో ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON