loader

సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ భేటీ…ఈ ప్రాజెక్టులపై చర్చ

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో సినిమా రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సంజయ్ దత్ ముఖ్యమంత్రికి వివరించారు. ఫిలిం స్టూడియోలు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా ప్రణాళికలు ఉన్నామని సంజయ్ దత్‌కు ముఖ్యమంత్రి వివరించారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి సంజయ్ […]

గెలిపిస్తే అన్నీ ఫ్రీ !- అన్నాడీఎంకే వరాల జల్లు

అన్నాడీఎంకే (AIADMK) అధినేత ఎడప్పాడి పళనిస్వామి ఏకంగా 297 అస్త్రాలను సంధించి ఓటర్లను ఆశ్చర్యపరిచారు. ఈ మేనిఫెస్టోలో ప్రకటించిన వరాలు చూస్తుంటే, తమిళ ప్రజలు కేవలం ఓటేస్తే చాలు, మిగిలిన బాధ్యత అంతా ప్రభుత్వానిదే అన్నట్లుగా ఉంది. ప్రతి ఇంటికి ఒక ఉచిత ఫ్రిడ్జ్, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మరియు మహిళా యజమానులకు నెలకు రూ. 2,000 నేరుగా నగదు బదిలీ వంటి భారీ హామీలు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఎన్నికల్లో పోటీ చేయం-కానీ DMKకు పుల్ సపోర్ట్ చేస్తాం​: కమల్​ హాసన్​

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార DMK పార్టీకి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు MNM పార్టీ అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్​ ప్రకటించారు. ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని మంగళవారం స్పష్టం చేశారు. అయితే DMK నేతృత్వంలోని కూటమి అభ్యర్థులందరికీ ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ఇస్తామని వివరించారు.

దక్షిణాదిపై ప్రధాని మోదీకి చిన్నచూపు: సీఎం రేవంత్

దక్షిణాది రాష్ట్రాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చిన్నచూపు ఉందని, కేంద్ర ప్రభుత్వంలోని కీలక శాఖలు ఒక్కటి కూడా దక్షిణాది రాష్ట్రాల వారికి ఇవ్వలేదన్నారు.కాంగ్రెస్ హయాంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి రాష్ట్రపతి పదవులు పొందిన వారు ఉన్నారని.. కానీ బీజేపీలో అలాంటి పరిస్థితి కనిపించట్లేదన్నారు. తాజాగా ఓ టీవీ ప్రోగ్రామ్ లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అనేక విషయాలపై స్పందించారు డీలిమిటేషన్ కు తాము వ్యతిరేకం కాదని.. కానీ వివక్ష చూపిస్తే కచ్చితంగా గళం విప్పుతానని […]

టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే

మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఇవాళ జరిగిన పార్టీ శాసనసభాపక్ష భేటీలో అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో జనసేన నేతలకు న్యాయం జరగడం లేదని, ఇదే విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యేలు తెలిపారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీకి ప్రాధాన్యమిస్తున్నామని, అలాగే తమకు కూడా అదే గౌరవం దక్కాలని కోరుకుంటున్నామని జనసేన ఎమ్మెల్యేలు ఇవాళ పవన్ దృష్టికి తీసుకెళ్లారు.

2029 నుంచి ఏపీ, తెలంగాణలో పెరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు

దేశవ్యాప్తంగా లోక్‌సభ మరియు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావిస్తోంది. దీని ప్రకారం ఇరు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఆంధ్రప్రదేశ్ : అసెంబ్లీ స్థానాలు: ప్రస్తుతం ఉన్న 175 నుండి 263కి పెరుగుతాయి.లోక్‌సభ స్థానాలు: ప్రస్తుతం ఉన్న 25 నుండి 38కి (అదనంగా 13 సీట్లు) పెరుగుతాయి. తెలంగాణ : అసెంబ్లీ స్థానాలు: ప్రస్తుతం ఉన్న 119 నుండి 179కి పెరుగుతాయి. లోక్‌సభ స్థానాలు: ప్రస్తుతం ఉన్న […]

పెన్షన్ బకాయిలు, పిఆర్సి పై బిఆర్ఎస్ వాకౌట్

తెలంగాణ శాసనసభలో ఉద్యోగుల, రిటైర్డు ఉద్యోగుల సమస్యలపై అధికార ప్రతిపక్షం మధ్యపరస్పర ఆరోపణలతో సభను వేడిక్కించడమేకాదు బిఆర్ఎస్ వాకౌట్ చేయడానికి దారి తీసింది. బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పిఆర్సి, డిఎ బకాయిలు రిటైర్డు మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడు విడుదల చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. పెన్షన్ బెనిఫిట్ అందక వైద్యసేవలు పొందలేక సుమారు 30 మంది ఉద్యోగులు మృతి చెందారని హరీష్ రావు విమర్శించారు.

కేటీఆర్ కు బిగ్ షాక్.. ఫార్ములా ఈ రేసు కేసులో ట్విస్ట్ !

హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకలపై అవినీతి నిరోధక శాఖ  అధికారులు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కేటీఆర్ (KTR) ను ప్రధాన నిందితుడిగా (ఏ1) పేర్కొనడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపుతోంది. ఈ ఛార్జ్ షీట్ లో  అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ అధికారి అధికారి అరవింద్ కుమార్ను ఏ2గా, బిఎల్ఎన్ రెడ్డిని ఏ3గా, కిరణ్ […]

బెంగాల్ సీఎంగా మరోసారి మమత!.. ఓట్ వైబ్ సంచలన సర్వే

పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చే దిశగా ఉందని వోట్‌వైబ్ వెల్లడించింది. ఈ ప్రీ-ఎలక్షన్ సర్వే ప్రకారం, మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 294 సభ్యుల అసెంబ్లీలో 184 నుంచి 194 స్థానాలు గెలుచుకునే అవకాశముంది.  ప్రతిపక్ష బీజేపీకి 98 నుంచి 108 స్థానాలు వచ్చే అవకాశముండగా ఓట్ల శాతంలో కూడా టీఎంసీ  సర్వే ప్రకారం 41.9 శాతం మంది టీఎంసీకి మద్దతు ఇవ్వగా, 34.9 […]

రిటైర్డ్ ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు : అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఆరోపణ

రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గళమెత్తారు. వారి పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు కేపీ వివేకానందా, కల్వకుంట సంజయ్‌ సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ నెలకు రూ. 700 కోట్ల బకాయిలను చెల్లిస్తామని చెప్పి , ఇంతవరకు చెల్లించలేదని ఆరోపించారు. ఎంతోమంది ఉద్యోగులు వారి మనోవేదనను చెప్పుకోలేక, ఆరోగ్య సమస్యలతో చనిపోతున్నారని విచారం వ్యక్తం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON