అన్నాడీఎంకే (AIADMK) అధినేత ఎడప్పాడి పళనిస్వామి ఏకంగా 297 అస్త్రాలను సంధించి ఓటర్లను ఆశ్చర్యపరిచారు. ఈ మేనిఫెస్టోలో ప్రకటించిన వరాలు చూస్తుంటే, తమిళ ప్రజలు కేవలం ఓటేస్తే చాలు, మిగిలిన బాధ్యత అంతా ప్రభుత్వానిదే అన్నట్లుగా ఉంది. ప్రతి ఇంటికి ఒక ఉచిత ఫ్రిడ్జ్, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మరియు మహిళా యజమానులకు నెలకు రూ. 2,000 నేరుగా నగదు బదిలీ వంటి భారీ హామీలు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

