loader

విచారణకు సిద్ధమా? అంటూ సీఎం రేవంత్ కు హరీశ్ రావు సవాల్

హైదరాబాద్‌లోని టీడీఆర్ కేటాయింపుల్లో భారీ కుంభకోణం జరిగిందని, ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి హస్తం ఉందని హరీశ్ రావు నేరుగా ఆరోపించారు. ఈ వ్యవహారంపై నిజానిజాలు బయటకు రావాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. “మీ సోదరుడిపై వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపించుకునే ధైర్యం మీకు ఉందా?” అంటూ సీఎంకు సవాల్ విసిరారు. ప్రభుత్వం పారదర్శకంగా ఉంటే విచారణకు ఎందుకు వెనుకాడుతోందని ఆయన ప్రెస్ మీట్ వేదికగా నిలదీశారు.

కాంగ్రెస్‌, వామపక్షాలు.. అన్నింటినీ నాశనం చేస్తాయి: మోదీ

కాంగ్రెస్‌, వామపక్షాలు ఎక్కడ అధికారంలోకి వచ్చినా.. అన్నింటినీ నాశనం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేరళలోని పాలక్కడ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ‘‘బెంగాల్‌, త్రిపురలో వామపక్షాలు ఏం చేశాయో దేశమంతటికీ తెలుసు. కేరళ కూడా దుర్మార్గపు పథకాలతో నలిగిపోయింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఏం చేసిందో కూడా అందరూ చూశారు. హిమాచల్‌ ప్రదేశ్‌ కూడా ఆర్థిక సంక్షోభంలో ఉంది.. ఇదీ కాంగ్రెస్‌ పాలన’’ అని మోదీ అన్నారు.

తెదేపా కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం

తెదేపా 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు తెదేపా జెండా ఎగురవేశారు. అనంతరం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్,పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెదేపా ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన ముఖ్య ఘట్టాలతో వీడియోను ప్రదర్శించారు.ఎన్టీఆర్ బస్సు యాత్ర, విధాన నిర్ణయాలు, ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలను అందులో పొందుపరిచారు.

టీవీకే పార్టీ అభ్యర్థుల లిస్ట్ విడుదల..విజయ్..రెండు స్థానాల నుంచి బరిలోకి

తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారిన టీవీకే పార్టీ ఎన్నికల బరిలో నిలిచే తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. విజయ్ దళపతి రెండు స్థానాల నుంచి బరిలో నిలుస్తున్నారు. విజయ్ ఎవరితోనూ పొత్తు లేకుండా పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. చెపాక్‌లో ఉప ముఖ్యమంత్రి, ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌పై పోటీ చేసేందుకు విజయ్ టీవీకేలో చేరిన మాజీ కాంగ్రెస్ నేత సెల్వంను బరిలో దింపారు. TVK ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున […]

బెంగాల్‌ను టార్గెట్ చేస్తే.. కేంద్రంలో బీజేపీని గద్దె దించుతా : మమతాబెనర్జీ

పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ముర్షిదాబాద్‌లో శుక్రవారం రామనవమి శోభాయాత్ర జరుగుతున్న సమయంలో ఘర్షణలు చోటుచేసుకోవడంపై  ఆగ్రహం వ్యక్తంచేశారు. పశ్చిమబెంగాల్‌ను ధ్వంసం చేయాలని చూస్తే బీజేపీ దేశంలో అధికారం కోల్పోవడం ఖాయమని అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఢిల్లీని స్వాధీనం చేసుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ముందుకు వెళ్తానని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ వస్తే ఇళ్ల పైకి బుల్డోజర్లను ప్రయోగించి ప్రజలందరినీ […]

కొత్త పార్టీపై కవిత కీలక ప్రకటన

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి KCR కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ ప్రస్థానంపై శుక్రవారం ఓ కీలక ప్రకటన చేశారు. శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్ లోని ఖిల్లా రామాలయంలో ప్రత్యేక పూజల్లో పాలుపంచుకున్న కవిత… ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాను కొత్తగా ఓ రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు ఆమె ప్రకటించారు. ఏప్రిల్ 25 ఉదయం 10 గంటల సమయంలో మంచి ముహూర్తం ఉందని చెప్పిన కవిత… అదే ముహూర్తానికి తన […]

సీరియస్‌గా అసెంబ్లీ జరుగుతుంటే ఆటలేంటి?.. మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్ ఎద్దేవా.!

అసెంబ్లీలో కీలకమైన అంశాలపై చర్చను పక్కన పెట్టేందుకే ప్రభుత్వం ఆటల పోటీలకు తెర తీస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ సర్కార్ సభను నడపలేకనే క్రీడా పోటీల ఎత్తుగడ వేసిందని ఆయన విమర్శించారు. ఇంత సీరియస్‌గా సభ జరుగుతున్న సమయంలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం ఏంటీ?అని ఆయన ప్రశ్నించారు. ఇదే విషయాన్ని తాను అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వద్ద ఎటువంటి సమాధానం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

బొలిశెట్టి సత్యనారాయణతో పార్టీకి ఎలాంటి అనుబంధం లేదు: జనసేన

బొలిశెట్టి సత్యనారాయణకు పార్టీతో ఎలాంటి అనుబంధం లేదని జనసేన తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. “బొలిశెట్టి సత్యనారాయణ తన వ్యక్తిగత సిద్ధాంతాలను అనుసరించే నిమిత్తం పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అంగీకరించారు. బొలిశెట్టి చేపట్టే కార్యక్రమాలతో పార్టీకి సంబంధం లేదు” అని జనసేన పేర్కొంది.

కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా!!

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన, గత నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధాన్ని తెంచుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జగిత్యాలలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు.

ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. మంగళవారం రాత్రి దేశ రాజధానిలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో వైద్యపరీక్షల కోసం చేరారు. డాక్టర్లు ఆమెను అబ్జర్వేషన్ లో ఉంచారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సోనియా గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పుడు ఆమె వెంట లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ ఆమె వెంట […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON