loader

తనపై సీబీఐ విచారణ కోరుతూ సీఎం చంద్రబాబుకు లేఖ…హైకోర్టులోనూ రిట్ పిటిషన్

నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం 14 కేసులు నమోదు చేసింది. ‘నాపై అక్రమ కేసులు మీతో సంబంధం లేకుండా నమోదు చేసి ఉంటే వాటిపైన సీబీఐ చేత విచారణ జరిపించి నిజనిజాలు నిగ్గు తేల్చి నాపై మోపబడిన కేసులు సీబీఐ విచారణలో రుజువైతే ఏ విక్షకైనా సిద్ధంగా ఉన్నాను’అని మాజీమంత్రి లేఖలో పేర్కొన్నారు. మరోవైపు తనపై నమోదైన 9 అక్రమ కేసుల్లో సీబీఐ విచారణ కోరుతూ ఏపీ […]

ఈడీకి షాక్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌కు ఊరట

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ,  రాహుల్ గాంధీలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నుంచి భారీ ఊరట లభించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి స్పెషల్ జడ్జి విశాల్ గోగ్నే నిరాకరించారు. ఈ కేసు ప్రైవేట్ ఫిర్యాదు నుంచి వచ్చిందనీ.. మనీలాండరింగ్ చట్టం (PMLA) కింద కేసు నమోదు చేయడానికి అవసరమైన ప్రిడికేట్ ఆఫెన్స్ లేకుండా ఉందని కోర్టు తెలిపింది. ఫలితంగా ఈడీ ఫిర్యాదును జడ్జి […]

ఇది తమిళనాడు.. అహంకార బీజేపీ ఇక్కడ గెలువలేదు : సీఎం స్టాలిన్‌

బీహార్‌ విజయవంతమయ్యామని, ఇక తమిళనాడు రాష్ట్రమే తమ టార్గెట్‌ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై సీఎం స్టాలిన్ స్పందించారు. ఇది తమిళనాడు రాష్ట్రమని, ఇక్కడ అహంకార బీజేపీ ఎప్పటికీ గెలవలేదని వ్యాఖ్యానించారు. అహంకారం కలిగిన ఏ పార్టీకి ఇక్కడ అవకాశం లేదని అన్నారు. అహంకారంతో ఊగిపోయే ఏ రాజకీయ శక్తినైనా తాము ప్రతిఘటిస్తామని స్టాలిన్‌ స్పష్టంచేశారు. ప్రేమతో తమ వద్దకు వస్తే ఆలింగనం చేసుకుంటామని, అహంకారంతో వస్తే మాత్రం తలవంచే పరిస్థితి లేదని […]

వాసాలమర్రిలో ఓటు మిస్సింగ్‌ .. టాస్‌ వేసి కాంగ్రెస్‌ అభ్యర్థిని విజేతగా ప్రకటించిన అధికారులు

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ఎన్నికల అధికారుల తీరుతో బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారు. వాసాలమర్రిలో బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి ఓటు మిస్‌ అయ్యింది. దీంతో బీఆర్ఎస్‌ బలపరిచిన అభ్యర్థికి, కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థికి సమాన ఓట్లు పోలయ్యాయి. దీంతో ఎన్నికల అధికారులు టాస్‌ వేసి కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. అయితే మరుసటి రోజు కౌంటింగ్‌ రూమ్‌ కిటికీ వద్ద మిస్సయిన ఓటు లభించింది. అందులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓటు పడటం […]

దేశ రాజకీయాల్లో కీలక మార్పులు – ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా, ప్రశాంత్ కిషోర్ మధ్య రహస్య మీటింగ్ జరిగిందని రాజకీయవర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. సోనియా గాంధీ నివాసం 10, జనపథ్‌లో గత వారం జరిగిన ఈ సమావేశం నాలుగు గంటల పాటు సాగినట్లుగా తెలుస్తోంది. బీహార్ ఎన్నికల్లో జన సురాజ్, కాంగ్రెస్ రెండూ ఘోరంగా ఓడిపోయాయి. ఈ సమయంలో ప్రియాంకతో పీకే భేటీ హాటా టాపిక్ గా మారింది.

విజయ్‌ ఈరోడ్‌ ర్యాలీకి పర్మిషన్‌ గ్రాంటెడ్‌.. 84 కండిషన్స్‌

ఈనెల 18న ఈరోడ్‌లోని విజయపురిలో విజయ్‌ తన తదుపరి ఎన్నికల ప్రచార ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ర్యాలీ జరగనుంది. దాదాపు 16 ఎకరాల ప్రైవేట్‌ ఆలయానికి సంబంధించిన ల్యాండ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ర్యాలీకి పోలీసులు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేశారు. కరూర్‌ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో శాంతిభద్రతలకు సంబంధించి 84 కండిషన్స్‌ పెట్టారు.

‘విపాసన ధ్యానాన్ని ఎగతాళి చేయడం సరికాదు’.. రేఖ గుప్తా వ్యాఖ్యలపై కేజ్రీవాల్‌

ఢిల్లీ కాలుష్య సమస్యకు పరిష్కారాలు కనుగొంటున్నాం. ఢిల్లీని, విధులను వదిలి దగ్గు నయం కోసం ప్రతి ఆరు నెలలకు విపాసన కేంద్రానికి పారిపోయే వాళ్లం కాదు’ అని మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై సీఎం రేఖా గుప్తా వ్యాఖ్యలపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బుద్ధుడు బోధించిన దైవిక ధ్యాన అభ్యాసాన్ని ఎగతాళి చేయడం ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు తగదని విమర్శించారు. ‘రాజకీయ శత్రుత్వం ఉన్నప్పటికీ విపాసనను ఎగతాళి చేయడం సీఎంకు తగదు’ అని అన్నారు.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే‌పై ఫ్యాషన్ డిజైనర్ ఫిర్యాదు.. మహిళా కమిషన్ సీరియస్

కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌పై ఫ్యాషన్ డిజైనర్ శోభారాణి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. హఫీజ్ నుంచి రక్షణ కల్పించాలని ఆమె కోరారు. హఫీజ్‌ఖాన్ 2022లో ఎమ్మెల్యేగా ఉన్నపుడు తనకు కార్పొరేషన్ టికెట్ ఇప్పిస్తానని రూ.3.60 కోట్లు తీసుకున్నట్లు హైదరాబాద్ తీసుకెళ్లి నగ్న పూజల్లో పాల్గొనాలని ఒత్తడి చేశారని.. తనపై అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం జరిగిందన్నారు. ఆమె రక్షణ కల్పించడంతో పాటు ఆరోపణలపై నివేదిక త్వరగా పంపాలని కర్నూలు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారుమహిళ […]

ఎల్లారెడ్డిలో ఓడిన అభ్యర్థి కుటుంబాన్ని ట్రాక్టర్ తో ఢీకొట్టి

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్ పేట గ్రామంలో తనకు వ్యతిరేకంగా పోటీ చేసిన బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బాలరాజును ట్రాక్టర్ తో కాంగ్రెస్ అభ్యర్థి ఢీకొట్టాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, తనను ఎవరు ఏం చేయలేరు అని చెప్పి మరి దాడి చేశాడు. ఎన్నికల ఫలితాల అనంతరం ఇంటి ముందు కూర్చున్న బిఆర్ఎస్ అభ్యర్థి, అతని అనుచరులను, కుటుంబ సభ్యులను ట్రాక్టర్ తో కాంగ్రెస్ అభ్యర్థి ఢీకొట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వారిని […]

మెడికల్ కాలేజీలపై మంత్రి డోలా కీలక వ్యాఖ్యలు

వైసీపీ నాయకులు కోటి సంతకాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని మంత్రి బాలవీరాంజనేయ స్వామి అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.8,500 కోట్లు ఇస్తే.. రూ.1500 కోట్లు కూడా ఖర్చు చెయ్యలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో 18 శాతం నిర్మాణం కూడా పూర్తి చెయ్యలేదన్నారు. మెడికల్ కాలేజీలను ఎవరికీ దారాదత్తం చెయ్యడం లేదని వెల్లడించారు. వైసీపీ 64 మందికి సీట్లు ఇస్తే… తాము 75 మందికి సీట్లు ఇస్తున్నామని చెప్పారు. ఎక్కువ మంది […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON