loader

నేనుంత కాలం కెసిఆర్‌కు అధికారం రానివ్వను: రేవంత్

నారాయణపేట జిల్లా కోస్గిలో సిఎం పర్యటించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. సర్పంచ్‌లు ఇంటింటికీ వెళ్లి రేషన్ కార్డు రాని వారి పేర్లు రాసుకోవాలని సూచించారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు తాను ఉన్నంతకాలం కెసిఆర్‌కు అధికారం దక్కనివ్వనని సిఎం రేవంత్ అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్, ఉపఎన్నికలు.. అన్నింట్లోనూ ఓడించామని. ఇన్నిసార్లు ఓడించినా.. ఇంకా వాళ్లదే పై చేయి అంటారా? అని ప్రశ్నించారు

నువ్వు ఐదుసార్లు సీఎం అవ్వాలి.. ఇప్పటం వృద్ధురాలి కోరిక విని నవ్వేసిన పవన్ కల్యాణ్

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ఆమెను ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆనందంతో ముసిరిపోయిన నాగేశ్వరమ్మ.. పవన్ కల్యాణ్ ఐదుసార్లు ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్షించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇప్పటంలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచాక మళ్లీ తమను కలిసేందుకు రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మ పవన్ కల్యాణ్‌ను ఆ సమయంలో కోరింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఇచ్చిన మాట కోసం ఇవాళ ఇప్పటంలోని నాగేశ్వరమ్మ ఇంటికి పవన్ […]

కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను..: దానం నాగేందర్

తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దానం వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని, తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అని దానం నాగేందర్ కుండబద్దలు కొట్టారు. త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి తాను కృషి చేస్తానని దానం నాగేందర్ స్పష్టం చేశారు.

జగన్ కు అస్వస్థత.. కార్యక్రమాలు రద్దు?

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత,ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అనారోగ్య కారణాలతో ఈరోజు నిర్వహించాల్సిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వైద్యులు ఆయనకు పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు. ఈ విషయాన్ని వైసీపీ అధికారికంగా వెల్లడించింది. పార్టీ ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా జగన్ ఆరోగ్య పరిస్థితిపై సమాచారం అందించింది.

రాబర్ట్ వాద్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీ.

కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ప్రియాంక గాంధీ చేతికి ఇవ్వాలనే వాదనలు బలంగా వినిపిస్తున్న వేళ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటించాలనే డిమాండ్ పెరుగుతుందని.. ప్రజలు ఆమెలో ఇందిరా గాంధీని చూస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ కూడా కష్టపడుతున్నారని, వారి రక్తంలోనే రాజకీయాలు ఉన్నాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ లోని వారసత్వ పోరును మరింత వేడెక్కించాయి.

లోకేశ్ అవినీతిలో పవన్ కు వాటా ఉందంటూ అంబటి సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార యంత్రాంగం మరియు కూటమి నేతల మధ్య ఉన్న అంతర్గత బంధాలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి నారా లోకేశ్ అవినీతిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు భాగస్వామ్యం ఉందంటూ ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా వైద్య కళాశాలల వ్యవహారాల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని, అందులో పవన్‌కు కూడా వాటా అందుతోందని అంబటి పేర్కొన్నారు.

SIR ముసాయిదాలో కనిపించని 95లక్షల ఓటర్లు

సర్ ప్రక్రియలో భాగంగా మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, కేరళ, అండమాన్ నికోబార్‌లలో మంగళవారం వెల్లడించిన ముసాయిదా ఓటర్ల జాబితాల్లో 95 లక్షల మంది ఓటర్లను తొలగించారు. అండమాన్ నికోబార్ దీవుల్లో 3.10 లక్షల ఓటర్లకుగాను 64,000 మంది పేర్లు జాబితాలో కనిపించడం లేదు. అదే విధంగా కేరళలో 2.78 కోట్ల ఓటర్లకు గాను 24.08 లక్షల ఓటర్లు, చత్తీస్‌గఢ్‌లో 2.12 కోట్ల ఓటర్లకుగాను 27.34లక్షల మంది పేర్లు, మధ్యప్రదేశ్‌లో 5.74 కోట్ల మంది ఓటర్లలో 42.74లక్షల ఓటర్లను జాబితా […]

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌లకు నోటీసులు?.. బండి సంజయ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ఇద్దరు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేస్తారని ప్రచారం సాగుతుంది. ఈ పరిణామాలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పపందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు నోటీసులు జారీ చేయాలని సిట్ నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నానని బండి సంజయ్ ఎక్స్‌లో పోస్టు చేశారు.

రేవంత్.. నీది పక్కా మాఫియా పాలన.. ప్రజాధనం వృధా చేస్తున్నావ్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర విమర్శలతో వేడి పెరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, ప్రస్తుతం తెలంగాణలో ప్రజాపాలన కాకుండా “పక్కా మాఫియా పాలన” కొనసాగుతోందని ఆరోపించారు. ఇసుక మాఫియా ప్రయోజనాల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన చెక్‌డ్యామ్‌లను జెలటిన్ స్టిక్స్‌తో పేల్చేస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు.

జ‌ర్మ‌నీలో రాహుల్ గాంధీ.. భార‌త ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌పై ఆందోళ‌న

లోక్‌స‌భ ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ ప్ర‌స్తుతం జ‌ర్మ‌నీలో ప‌ర్య‌టిస్తున్నారు. బెర్లిన్‌లోని హెర్టీ స్కూల్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. భార‌తీయ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఓట‌రు జాబితా అంశంలో తీవ్ర స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పాలిటిక్స్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ లిజ‌నింగ్ అన్న టాపిక్‌పై రాహుల్ గాంధీ ప్ర‌సంగించారు. 2024లో హ‌ర్యానా, మ‌హారాష్ట్ర‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON