loader

పిల్లల్ని కనకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు..నవనీత్ రాణాకు ఒవైసీ కౌంటర్

కొందరు వ్యక్తులు పిల్లలను ఎక్కువగా కని హిందుస్థాన్‌ను పాకిస్థాన్‌గా మార్చాలని చూస్తున్నారని..  నవనీత్ రాణా చేసిన వ్యాఖ్యలకు ఒవైసీ సమాధానమిచ్చారు. తనకు ఆరుగురు సంతానం ఉన్నారని.. మీరు నలుగురు పిల్లలను కనకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారని ప్రశ్నించారు. మీకు ఇష్టమైతే 8 మందిని కనండి..  మాకేం అభ్యంతరం లేదని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో ఇద్దరు  కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు పంచాయతీ లేదా  స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే నిబంధన ఉందని ఈ సందర్భంగా ఒవైసీ గుర్తు చేశారు.

జనసేన పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరికీ అవకాశాలు వస్తాయి…: నాగబాబు

జనసేన పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ అవకాశాలు వస్తాయని ఎన్ఆర్ఐ జనసేన శ్రేణులతో సోమవారం జరిగిన వర్చువల్ సమావేశంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. కూటమిలో సర్దుబాటు కోసం కొంతమందికి త్యాగాలు చేయాల్సిన బాధ్యత ఉంటుందని, దానికి తాను కూడా ఒక ఉదాహరణ అని, పార్టీ కోసం పని చేసే ప్రతీ ఒక్కరికీ కొద్దిగా ఆలస్యం అయినా తప్పనిసరిగా అవకాశాలు వస్తాయని చెప్పారు.  కూటమి కలయిక సుదీర్ఘ కాలం ఉండాలని ప్రజలు […]

రేవంత్ రెడ్డి కి పన్నీరు..రాయలసీమకు కన్నీరు

తన శిష్యుడు రేవంత్ రెడ్డి కోసమే రాయలసీమకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు దయవలనే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయిందని తెలంగాణ సీఎం అసెబ్లీ సాక్షి చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు.

కవిత కొత్త పార్టీ జాగృతి..!

ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానం చెప్పారు కవిత. సోమవారం నాడు శాసనమండలి నుంచి బయటకు వచ్చిన తరువాత గన్‌పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు కవిత. కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. తన నేతృత్వంలో నడుస్తున్న జాగృతి సంస్థనే కొత్త పార్టీగా అవతరించనుందని కవిత ప్రకటించారు. రాజకీయంగా అందరూ మద్దతు ఇవ్వండని విజ్ఞప్తి చేశారు. ఇంటి పార్టీ నుంచి అవమాన భారంతో బయటకు వస్తున్నానని.. గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతామన్నారు.

రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై వైఎస్సీర్సీపీ అవాస్తవాలు: కూటమి నేతలు

నీళ్లు కావాలా? గొడవలు కావాలా? అంటే తాము నీళ్లే కావాలని కోరుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. జలాల వినియోగంపై తెలంగాణ నేతల ఆరోపణలు అర్థరహితమని కొట్టిపారేశారు. తెలంగాణ నేతల వాదనలను మన రాష్ట్రంలో చొప్పించి, వైఎస్సార్సీపీ రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం అవివేకమని మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్‌ ప్రభుత్వమే అడ్డుకుందని పేర్కొన్నారు.అనుమతులు తీసుకోకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 2020 మే 5న జగన్‌ ఆమోదం తెలిపారని అన్నారు.

శాసనమండలిలో ఇదే నా చివరి ప్రసంగం: కవిత

తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కన్నీరు పెట్టుకున్నారు. శాసనమండలిలో ఇదే తన చివరి ప్రసంగమంటూ కవిత కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివాసీ సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా సమ్మక్క, సారక్క వైదిక చిహ్నాలను చెక్కారని.. ఇది కరెక్ట్ కాదని అన్నారు. దీనిపై ఆదివాసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయని తెలిపారు. సమ్మక్క – సారక్క జాతరకు దేవాదాయ శాఖ పర్యవేక్షణ కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు.

తమిళనాడు, బంగాల్​లో NDA విజయం ఖాయం : అమిత్​ షా

త్వరలో తమిళనాడు, బంగాల్​లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ కూటమి విజయం సాధిస్తుందని తమిళనాడులోని పుదుక్కోట్టైలో జరిగిన బీజేపీ ర్యాలీలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార డీఎంకే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ‘అవినీతి మంత్రుల సైన్యంతో రాష్ట్రం పురోగమించగలదా?’ అని అమిత్ షా ప్రశ్నించారు. డీఎంకే వంశపారంపర్య పాలనను శాశ్వతంగా కొనసాగించాలనే లక్ష్యంతో పనిచేస్తోందని, కానీ ఆ కల నెరవేరదని పేర్కొన్నారు.

నీటి పంపకాలపై త్వరలో స్పష్టత: సీఎం చంద్రబాబు

నీటి పంపకాల అంశానికి సంబంధించి అన్ని విషయాలను త్వరలోనే ప్రజలకు తెలియజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం పూర్తిగా అధ్యయనం చేసి, వివరంగా మాట్లాడుతామని ఆయన స్పష్టం చేశారు. నీటి వనరుల నిర్వహణలో రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను తన విన్నపం మేరకు ఆపించినట్టు చెప్పిన నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కోట వినుత డ్రైవర్‌ హత్యకేసులో మరో ట్విస్ట్.. ప్రకంపనలు సృష్టిస్తున్న వీడియో..!

కోట వినుత డ్రైవర్‌ రాయుడు హత్యకేసులో మరో ట్విస్ట్ నెలకొంది. వినుత భర్త  చంద్రబాబు విడుదల చేసిన వీడియో ప్రకంపనలు రేపుతోంది. ముందస్తు ప్రణాళికతోనే రాయుడు హత్య జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయుడు హత్య విషయం చెన్నై పోలీసుల కంటే ముందే.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి ఎలా తెలిసిందని, రాయుడు రిలీజ్‌ చేసిన సెల్ఫీ వీడియోలో ఉన్న సమాచారం కొంతేనని.. తమ దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయని వినుత భర్త చంద్రబాబు తెలిపారు

మహారాష్ట్రను యూపీ, బిహార్ లా మారుస్తున్నారు.. మహాయుతి ప్రభుత్వంపై థాక్రే సోదరుల ఫైర్

మహారాష్ట్రలో బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి రాష్ట్రాన్ని యూపీ, బిహార్ లా మారుస్తోందని ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ థాక్రే విమర్శించారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఎంఎన్ఎస్ (మహారాష్ట్ర నవనిర్మాణ సేన), శివసేన(యూబీటీ) కలిసి సంయుక్తంగా మేనిఫెస్టో విడుదల చేశాయి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, తమను ఎవరూ తొలగించలేరనుకుంటే పొరపాటని, మహారాష్ట్రను యూపీ, బిహార్ లా మారుస్తున్నారని రాజ్ థాక్రే అన్నారు. రాష్ట్రం దేశానికే దారి చూపిందని ఆయన అభిప్రాయపడ్డారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON