అన్నపూర్ణ స్టూడియోను సందర్శించిన భట్టి విక్రమార్క
డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌కి ప్రత్యేకంగా వెళ్లి పర్యటించారు. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఆహ్వానం మేరకు జరిగిన ఈ సందర్శనలో, సినిమా రంగం అభివృద్ధి గురించి ఇద్దరూ చర్చించారు. స్టూడియోకు చేరుకున్న వెంటనే నాగార్జున భట్టికి స్వాగతం పలికారు. అనంతరం అక్కడ ఉన్న అక్కినేని నాగేశ్వరరావు విగ్రహానికి డిప్యూటీ సీఎం పూలమాల అర్పించారు. స్టూడియోలో అమర్చిన నూతన సాంకేతిక పరికరాలు, ఫిల్మ్ స్కూల్‌లో జరుగుతున్న శిక్షణా విధానాలు, విద్యార్థులకు అందిస్తున్న […]

