loader

ఇందిరమ్మ చీరలు తీసుకుంటే రేపు నోటీసులు వస్తాయి: ఎర్రబెల్లి దయాకర్ రావు

‘ప్రభుత్వం మీకు ఇచ్చే ఈ ఇందిరమ్మ చీరలు ఉచితం కావు. ఒక్కో చీర పేరుతో మీ పేరు మీద రూ. 1,200 అప్పు రాస్తున్నారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది.’అంటూ మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉచితమని చెప్పి చీరలు ఇస్తున్నారు, రేపు అదే మహిళలకు ఆ డబ్బులు కట్టమని నోటీసులు పంపిస్తారు. ఆధార్ కార్డు వివరాలు సేకరించడం, వేలిముద్రలు తీసుకోవడం వెనుక […]

నగరిలో టిడిపి చేసింది శూన్యం: రోజా

నగరిలో టిడిపి ఎంఎల్ఎ గాలి భాను ప్రకాశ్ చేసింది శూన్యమని వైసిపి నేత, మాజీ ఎంఎల్ఎ రోజా విమర్శించారు. నగరిలో చంద్రబాబు పర్యటిస్తుండడంతో ఆమె మీడియాతో మాట్లాడారు. కల్యాణమండపం, సబ్‌ స్టేషన్‌, పాలిటెక్నిక్‌ కాలేజీ, పార్కు, షాదీ మహల్‌ అన్నీ తామే కట్టామన్నారు. పేదవారికి ఇళ్లతో సహా తామే ఇచ్చామని, సిఎం చంద్రబాబు నాయుడు అబద్ధాలు వినలేక ప్రజలు పారిపోయారని, నగరి నియోజకవర్గానికి ఉపయోగపడేది టిడిపి చెప్పినదాంట్లో ఒక్కటి లేదన్నారు.

స్వచ్ఛత మన జీవన విధానం కావాలి – నగరిలో సీఎం చంద్రబాబు పిలుపు

రాష్ట్రంలో పరిశుభ్రత అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా, ప్రజలందరి జీవన విధానంగా మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, దివంగత నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు సేవలను కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛత కోసం రూ.573 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా రూ.510 కోట్లతో 110 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్లను […]

టీడీపీలో చింతమనేని వర్సెస్‌ మంత్రి పార్థసారథి- కోవర్టుల రాజకీయం

కూటమి అంటే టీడీపీ జనసేన బీజేపీ మాత్రమే. కొంతమంది కోవర్ట్‌లు టీడీపీ కండువా కప్పుకున్నారు. వారు బై బర్త్ వైయస్సార్, ఇప్పుడు టీడీపీ అంటూ ముసుగు కప్పుకున్న కోవర్ట్‌లు, రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ కండువా కప్పుకున్నారు. అని ఏలూరులో జరిగిన ఓ కార్యక్రమంలో చింతమనేని అనగా, వైసిపి నేతలు, కార్యకర్తలు చేరికలు అధిష్ఠానం నిర్ణయం మేరకే జరిగాయి. అంతిమ నిర్ణయం ఆయనది. తర్వాత లోకేష్‌దే. అధిష్టానం నిర్ణయమే శిరోధర్యం అని అదే వేదికపై ఉన్న మంత్రి […]

‘స్టాలిన్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభం’ తమిళనాడులో ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు!

ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) దుష్ప్రవర్తన నుంచి తమిళనాడు విముక్తి కోరుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం (జనవరి 23, 2026) తమిళనాడు ప్రభుత్వంపై దాడి చేశారు. DMK అనేక వాగ్దానాలు చేసింది కానీ ఫలితాలు శూన్యం అని అన్నారు. ఆయన DMK ప్రభుత్వాన్ని CMC అని పిలిచారు . అంటే కరప్షన్ మాఫియా క్రైమ్‌ను ప్రోత్సహించే ప్రభుత్వం అని అర్థమని వివరించారు. తమిళనాడులోని చెంగల్పట్టులో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కల్తీమద్యం కేసులో కీలక పరిణామం: జైలు నుంచి విడుదలైన మాజీమంత్రి జోగి రమేశ్‌

ఏపీలో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీమంత్రి జోగి రమేశ్ సోదరులు బెయిల్‌పై విడుదల అయ్యారు. కల్తీ మధ్యం కేసులో అరెస్ట్ అయి విజయవాడ జైలులో ఉన్న మజీమంత్రి జోగి రమేశ్ సోదరులు బెయిల్‌పై విడుదల అయ్యారు.జైలు నుంచి విడుదలైన తర్వాత జోగి రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సాధారణ ఖైదీగా తనను జైలులో ఇబ్బందులు పెట్టారని, తనను అరెస్ట్ చేయించి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ రాక్షసానందం […]

సీఎం బావమరిదే కింగ్ పిన్.. ఆధారాలున్నా చర్యలెందుకు లేవు.. రేవంత్ కు కేటీఆర్ ప్రశ్న

సింగరేణి టెండర్ల దొంగలపై హరీష్ రావు ఆధారాలు ఇచ్చినా.. చర్యలు ఎందుకు లేవు..? స్వయంగా మంత్రి కుమారుడు గూండాగిరి చేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదు. సీఎం బావమరిది కింగ్ పిన్ అని ఆధారాలు ఇచ్చినా సిట్ ఎందుకు లేదు. మమ్మల్ని విచారించడంపై లీకులు మీడియాకు ఇస్తారు. న్యాయం, ధర్మం, ఖాకీ బుక్ అందరికీ ఒకేరకంగా ఉండాలి. తప్పుడు వార్తలు ఇవ్వొద్దని మీడియా సంస్థలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

మళ్లీ పిలుస్తామన్నారు – లీకులకు బాధ్యులెవరు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

‘రెండేళ్ల అసమర్ధ పాలన నుంచి దృష్టి మళ్లించేందుకే కాలక్షేప కథాచిత్రాలు నడుపుతున్నారు. ఎందుకు లీకులు ఇస్తున్నారని సిట్ అధికారులను అడిగాను. సిట్ విచారణకు పూర్తిగా సహకరించాను. ఏవో కొన్ని పేర్లు చెప్పి వాళ్లు తెలుసా అని అడిగారు. అడిగిందే అడిగారు. తిప్పితిప్పి అడిగి చిరాకు పెట్టారు. హీరోయిన్ల పేరుతో దుష్ప్రచారం చేశారు.. మీకు ఏ నటులు ఫిర్యాదు చేశారని ప్రశ్నించా. మేం అలాంటి వార్తలు మీడియాకు చెప్పలేదని సిట్ అధికారులు చెప్పారు.

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఎక్సైజ్ అధికారులు

నియోజకవర్గంలో వైన్ షాపులు మధ్యాహ్నం 1 గంటకు.. పర్మిట్ రూమ్ సాయంత్రం 6 గంటలకు తెరవాలని రాజగోపాల్ రెడ్డి హుకుం జారీ చేసినట్లు సంస్థాన్ నారాయణపూర్‌లో తెరిచి ఉన్న వైన్ షాపు నిర్వాహకులపై దాడికి తెగబడి, షాపును ఎమ్మెల్యే కోమటిరెడ్డి అనుచరులు మూసివేయించారు. కోమటిరెడ్డి అనుచరులు మూసివేసిన వైన్ షాపులను అధికారులు దగ్గరుండి తెరిపించారు. ఎక్సైజ్ శాఖ అధికారుల పహారాలో ఉదయం నుండి మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON