loader

సిట్‌ విచారణను లైట్ తీసుకున్న కేసీఆర్!

రాత్రి ఏడున్నరకు విచారణ పూర్తి అయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నంది నగర్ నుంచి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు. చాలా యాక్టివ్‌గా కనిపించారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో ప్రత్యేకంగా కేసీఆర్‌ సమావేశమయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నిలపై చర్చించారు. సిట్‌ విచారణపై  మీడియాతో మాట్లాడతారని ప్రచారం జరిగింది.  ఆయన మాత్రం దీనిపై ఎలాంటి  ప్రకటన చేయలేదు. సిట్ విచారణ  తీరుపై లాయర్లు, కేటీఆర్, […]

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఇడి క్లీన్‌చిట్

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎపి సిఎం చంద్రబాబుకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) క్లీన్ చిట్ ఇచ్చింది. రెండు రోజుల కిందట విశాఖపట్నంలోని పిఎంఎల్‌ఎ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటులో నిధుల మళ్లింపు, నేరపూరిత కార్యకలాపాల్లో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని ఇడి పేర్కొంది. వికాస్ ఖన్వేల్కర్, సుమన్ బోస్ , ఇతరులు ఈ నిధులను సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఇడి తేల్చింది. ఈ కేసులోనే చంద్రబాబు ను అరెస్టు చేసి […]

‘చంద్రబాబూ గుర్తుంచుకోండి.. చరిత్ర చెప్పే సత్యం ఇది’

చంద్రబాబు సర్కార్ పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ‘ప్రజాస్వామ్యంలో మీరు చేసిన తప్పుడు ఆరోపణలు తప్పు అని.. ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్ లు ఎన్ఎబీ, ఎన్టీఆర్ నిర్ధారణ చేశాయి. మీరు చేసిన తప్పులకు మిమ్మల్ని ప్రశ్నిస్తే.. ఇళ్లకు మీరు నిప్పు పెట్టడం, ఆ దుశ్చర్యలతో భయాన్ని కలిగించానని మీరు అనుకోవడం.. చంద్రబాబూ అది మీ భ్రమే. ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరు పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి చంద్రబాబూ” అంటూ ఎక్స్ […]

ఇదో గుడ్డి బడ్జెట్: రాహుల్ గాంధీ

భారతదేశ వాస్తవ సంక్షోభాలను పట్టించుకోని గుడ్డి బడ్జెట్ ఇది. యువతకు ఒకపక్క ఉద్యోగాలు లేవు, ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. పెట్టుబడిదారులు మూలధనాన్ని ఉపసంహరించుకుంటున్నారు. ఇంటి పొదుపు తగ్గింది. రైతాంగం కొట్టుమిట్టాడుతోంది. ఆయా రంగాల దిద్దుబాటును తిరస్కరించే బడ్జెట్ ఇది. వాటి గురించి ప్రస్తావనే లేదు. వాస్తవ సమస్యలను పక్కదారి పట్టించారు.

కెసిఆర్ తెలంగాణ జాతిపిత కాదు: ఎంపి చామల

బిఆర్‌ఎస్ అధినేత, మాజీ మఖ్యమంత్రి కెసిఆర్ జాతిపిత కాదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కెసిఆర్‌కు సిట్ నోటీసులు ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవం అంటూ లబోదిబోమంటున్నారని ఫోన్ ట్యాటింగ్ ఆధారాలు లేకుండా చేసి ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం గుర్తు వచ్చిందా? అని ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరులను విస్మరించినప్పుడు కెసిఆర్‌కు తెలంగాణ ఆత్మగౌరవం గుర్తు రాలేదా? అని ఆయన ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల హక్కులు హరించబడ్డాయని ఆయన ఆందోళన […]

ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ..4 గంటల 45 నిమిషాలు ప్రశ్నించిన అధికారులు..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌(KCR) విచారణ ముగిసింది. నందినరగ్‌లోని నివాసంలో సుమారు 4 గంటల 45 నిమిషాలకుపైగా అధికారులు కేసీఆర్‌ను విచారించారు. ఇదివరకూ విచారించిన వారు పేర్కొన్న అంశాలపై అధికారులు గులాబీ బాస్‌ను ప్రశ్నించినట్టు సమాచారం. విచారణ మొత్తాన్ని అధికారులుఉ ఆడియో, వీడియో రికార్డింగ్ చేశారు.

ఇది దిశానిర్దేశం లేని అబద్ధాల బడ్జెట్‌ : మమతాబెనర్జీ

బడ్జెట్‌పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది విజన్, మిషన్, దిశానిర్దేశంలేని బడ్జెట్ అని, పూర్తిగా అబద్ధాలతో నిండి ఉందని ఆమె మండిపడ్డారు. ఢిల్లీ పర్యటనకు బయలుదేరేముందు కోల్‌కతా విమానాశ్రయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్ ద్వారా కేంద్రం దేశ ఆర్థికవ్యవస్థను సర్వనాశనం చేస్తోందని విమర్శించారు. ఈ బడ్జెట్‌కు ఎలాంటి లక్ష్యం లేదన్నారు. ఇది పూర్తిగా పేదలు, మహిళలు, రైతులు, యువత, సామాన్యులతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు వ్యతిరేకమైనదని మమత మండిపడ్డారు.

జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు.. ఏపీలో ఆగని నిరసన సెగ

విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లపై జోగి రమేష్ నిన్న చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. ఆయన వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన వారి అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటి వైపు దూసుకెళ్లారు. కొందరు ఆందోళనకారులు జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టారు.

అంబటిపై దాడి.. కేంద్ర హోంశాఖకు వైసీపీ ఫిర్యాదు

వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి, హత్యాయత్నంపై వైసీసీ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ లేఖ రాసిందని సీనియర్‌ నాయకుడు, వైసీపీ పార్లమెంటరీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి వివరాలను వెల్లడించారు . రాష్ట్రంలో ప్రతిపక్షాల నాయకుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని, ఫలితంగా అంబటి ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడికి దిగి ఆస్తులు, వాహనాలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు.

నందినగర్‌ నివాసానికి చేరుకున్న కేసీఆర్‌.. కాసేపట్లో సిట్‌ విచారణకు!

బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌లోని నందినగర్‌ నివాసానికి చేరుకున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సాక్షిగా విచారణకు హాజరయ్యేందుకు ఎర్రవెల్లిలోని ఆయన నివాసం నుంచి బయల్దేరి, బంజారాహిల్స్‌ నందినగర్‌లోని నివాసానికి వచ్చారు. కాసేపట్లో ఆయన సిట్‌ విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే సిట్‌ అధికారులు కేసీఆర్‌ నివాసానికి వచ్చారు. కాగా కేసీఆర్‌ విచారణ నేపథ్యంలో నందినగర్‌లోని నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నాలుగంచెల భద్రతను అమలు చేస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON