loader

డీఎంకే ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.. అయినా కాంగ్రెస్‌తోనే వెళ్తాం : సీఎం స్టాలిన్

తమిళనాడులో తమ డీఎంకే పార్టీ ఒంటరిగానే పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని. ఇంకా చెప్పాలంటే 2021కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సోదరుడిలాంటి అనుబంధం ఉంది. డీఎంకే-కాంగ్రెస్ మధ్య పొత్తు బలంగా ఉంది. ఆ పార్టీతోనే కలిసి ఎన్నికలకు వెళ్తాం. అయితే, ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ భాగమవుతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం అని ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ స్టాలిన్ ఈ విషయాలు వెల్లడించారు.

సీఐ శివకుమార్‌ సంగతి తేల్చేస్తా.. పోలీసులపై జగ్గారెడ్డి బూతుపురాణం

సంగారెడ్డి మున్సిపాలిటీలోని 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద సీఐపై జగ్గారెడ్డి ఊగిపోయారు.రిగ్గింగ్ చేస్తున్నాడని చెబితే నా అభ్యర్థిని గళ్ల వట్టి కొట్టిండు.. సీఐ శివకుమార్‌ మొగోడైతే ఈడికి రావాలి. మీరు ఏమనుకుంటున్నరు.. జగ్గారెడ్డి ఎవరంటారు..సీఐ సంగతి నేను తేల్చేస్తా.. అరే ఓ హోంగార్డు ఒక అమ్మకు అయ్యకు పుట్టి ఉంటే రారా నా కొడుకా..అంటూ జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో పోలీస్ అధికారులపై విరుచుకుపడిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.

దొంగ ఓట్లు పడుతున్నాయని ఆందోళన.. బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీఛార్జ్

కరీంనగర్ 58వ డివిజన్‌లోని జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన ఒక మహిళకు తాను ఇది వరకే ఓటు వేసినట్లు ఉందని పోలింగ్ సిబ్బంది చెప్పారు. దీంతో దొంగ ఓట్లు పడుతున్నాయని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పరస్పరం నినాదాలు చేసుకోవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్థ పరిస్థితులు నెలకొన్నాయి. గొడవ కాస్తా తీవ్ర ఘర్షణకు దారి తీయడంతో ఆర్మీ, పోలీసుల బృందం రంగంలోకి దిగింది. లాఠీ చార్జ్ చేసి […]

అంబటికి బెయిల్.. రేపు విడుదలయ్యే అవకాశం

రాష్ట్ర మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు.. ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అలాగే ఆయనపై పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌నూ కొట్టివేసింది న్యాయస్థానం. ప్రస్తుతం.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి.. ఈ బెయిల్‌తో రేపు(గురువారం) జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. అంబటికి బెయిల్ రావడంతో గుంటూరులోని ఆయన నివాసం వద్ద వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు,  […]

మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాలు.. ఓటర్లకు నకిలీ వెండి కాయిన్లు పంపిణీ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓ వైపు పోలింగ్ జరగుతున్నా.. మరోవైపు ప్రలోభాల పర్వం నడుస్తూనే ఉంది. తాజాగా..మేడ్చల్ మున్సిపాలిటీలో నకిలీ వెండి కాయిన్స్ కలకలం రేపాయి. ఐదో వార్డులో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ఓటర్లకు నకిలీ వెండి కాయిన్లు పంపిణీ చేశారు. దీంతో పలువురు ఓటర్లు అభ్యర్థిపై తిరుగబడ్డారు. కోటెడ్ వెండి కాయిన్లు పంపిణీ చేస్తావా..? అంటూ ఫైరయ్యారు. ఈ ఘనపై ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మున్సిపల్‌ పోలింగ్‌ మధ్యాహ్నం 1 వరకు 48.54 శాతం నమోదు

కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 1 వరకు 48.54 శాతం పోలింగ్ నమోదు మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ మందకొడిగా సాగుతోంది,సాయంత్రం వరకు పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నాం, వంద శాతం వెబ్ కాస్టింగ్‌తో పోలింగ్ జరుగుతోంది,చెదురుమదురు ఘటనలు తప్ప ఎలాంటి సమస్యలు లేవు అని ఓటర్లు అందరూ ఓటు హక్కును వినియోగించుకోండి అని ఓటర్లకు విజ్ఞప్తి చేసారు ఎస్‌ఈసీ రాణికుముదిని

బీఆర్‌ఎస్‌ పోలింగ్‌ ఏజెంట్‌ను ఈడ్చేసిన పోలీసులు..

మంచిర్యాల జిల్లాలోని బీఆర్ఎస్ ఏజెంట్‌లను పోలింగ్ బూత్‌ల లోపలికి వెళ్లకుండా పోలీసులతో కాంగ్రెస్‌ ప్రభుత్వం అడ్డుకుంటోంది. లక్సేట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 9వ, 10వ పోలింగ్ కేంద్రాల దగ్గర బీఆర్ఎస్ ఏజెంట్‌గా ఉన్న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్‌ను పోలింగ్ బూత్ లోపలికి వెళ్లకుం పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించడంతో పోలింగ్‌ కేంద్రం ఆవరణ నుంచి పక్కకు ఈడ్చుకెళ్లారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆయన పోలింగ్ కేంద్రం ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు

‘11వ తేదీ.. 11 మంది.. 11 నిమిషాలు’.. వైసీపీ సభ్యులపై ఏపీ స్పీకర్‌ వ్యంగ్య వ్యాఖ్యలు

బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభం రోజు గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా వైఎస్‌ జగన్‌, ఆయన పార్టీ సభ్యులు సభకు హాజరయ్యారు.దీనిపై ఏపీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు స్పందించారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ సభ్యులు కొద్దిసేపే సభలో ఉండి వెళ్లిపోవడంపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. వాళ్లు ‘11వ తేదీన, 11 మంది, 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారు! అంతకుమించి ఎక్కువ సమయం లేరుగా..!’ అని వ్యాఖ్యానించారు. అదేవిధంగా సభ్యులు సభా సంప్రదాయాలను పాటిస్తే మంచిదని హితవు […]

శాసనసభ రేపటికి వాయిదా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. సభాపతి అధ్యక్షతన కాసేపట్లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో, రాబోయే రోజుల అసెంబ్లీ కార్యక్రమాలు, చర్చల వ్యవధి, బిల్లుల ప్రవేశపెట్టే సమయాలపై బీఏసీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. .దీని తర్వాత ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశం జరగనుంది.

కొడంగల్​లో సీఎం రేవంత్​ రెడ్డి ఓటు – ఈ ప్రముఖులు ఎక్కడ వేశారంటే?

తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన నియోజకవర్గం కొడంగల్​లోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు వేశారు. | హుస్నాబాద్​లో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు.| కరీంనగర్ 50వ డివిజన్‌ జ్యోతినగర్‌లో కేంద్రమంత్రి బండి సంజయ్ కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు | నందికొండ మున్సిపాలిటీ ప్రభుత్వ జూనియర్ కళాశాల 5 వార్డులో మాజీ మంత్రి జానారెడ్డి కుటుంబ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON