loader

బీహార్‌ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్.. రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని.. అదే తరహాలో బీహార్‌లోనూ కుట్రలు చేసే అవకాశం ఉందని అన్నారు. ఎన్నికల సంఘం ప్యానెల్ నియామకాలతోనే బీజేపీ తన పన్నాగాలు మొదలుపెడుతుందని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో నకిలీ పేర్లు చేర్చడం, ఓటింగ్ శాతం పెంచడం వంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. రాహుల్ చేసిన ఈ ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు.. జనసేన

జనసేన పార్టీ కీలక ప్రకటన జారీ చేసింది. పార్టీ ముఖ్య నేతలను, నాయకులను ఉద్దేశించి కీలక ప్రకటన ఇచ్చింది. పార్టీ లైన్ దాటి ప్రవర్తించవద్దని.. ఎవరైనా హద్దు మీరి మాట్లాడితే కఠిన చర్యలు ఖాయమని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు జనసేన అధికారిక ఎక్స్ ఖాతా నుంచి ట్వీట్ చేసింది. గురువారం జనసేనకు చెందిన ఓ నేత చేసిన ట్వీట్ వైరల్ కాగా.. ఈ ప్రకటన ఆయనను ఉద్దేశించి చేసిందేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కీలక నేత హత్యకు ఎమ్మెల్యే అనుచరుల స్కెచ్?

తెలుగుదేశం పార్టీ నాయకుడు సుధాకర్ నాయుడు తనకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబటి వెంకటేశ్వర ప్రసాద్ అనుచరులతో ప్రాణహాని ఉందని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, సుధాకర్ నాయుడు తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం పిలిపించడంతో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్న దందాలను గుర్తు చేసినందుకే తనను అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టిడిపి అధిష్ఠానానికి సుధాకర్ చెప్పినట్టు తెలుస్తోంది.

అంబటి రాంబాబు- పట్టాభిపురంలో కేసు నమోదు

వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న అంబటి పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. వాళ్లపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. దీంతో పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులపై అంబటి రాంబాబు స్పందించారు. కాపులపై కేసులు తిరగదోడుతామన్న వాళ్లు తనపై కేసులు పెట్టకుండా ఉంటారా. . . ఇలాంటి కేసులకు తాను భయపడబోనని చెప్పుకొచ్చారు.

నాపై ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా: పల్లె రఘునాథ్ రెడ్డి

దొంగే దొంగ అన్నట్లుగా గొడ్డుమర్రి ఆదినారాయణ అనే వ్యక్తిమా కంపెనీ భూములు అక్రమంగా అన్ లైన్ చేసుకొని తానేదో సత్యహరిచంద్రుడిలా మాట్లాడుతున్నాడు నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్నాను. ఏ మచ్చ లేకుండా ప్రజలకు, కార్యకర్తలకు నాకు తోచిన విధంగా సేవ చేస్తున్నా.. నాపై వస్తున్న ఆరోపణలు ఎవరైనా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని ఏపీ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు.

వేదికపై కుప్పకూలిన మాజీమంత్రి బొత్స

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మాట్లాడుతు ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అక్కడ ఉన్న నాయకులు బొత్స సత్యనారాయణ హుటాహుటిన కారులోకి ఎక్కించి హాస్పిటల్‌కి తరలించారు. అయితే ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ఆరోగ్యం కుదుటపడిందని….ఆస్పత్రిలో కోలుకుంటున్నట్లు అనుచరులు తెలిపారు.

ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు: చంద్రబాబు ట్వీట్‌

ఏపీ కూటమి సర్కార్‌ ఏర్పడి ఏడాది పూర్తయ్యింది. ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాదైన సందర్భంగా సీఎం చంద్రబాబు ట్వీట్ ట్వీట్‌ చేశారు. జూన్ 4న ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు అని జూన్ 4 ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు అని వ్యాఖ్యానించారు. ఏపీ దశదిశను మార్చేందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పునకు ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకు నమస్కారాలంటూ సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.

అతడు నా గన్ మెన్ కాదు…వైసీపీ ఎంపీ గురుమూర్తి

వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. డ్రగ్స్ దందాలో దొరికిన కానిస్టేబుల్ ను తన గన్ మెన్ అంటూ టీడీపీ చేస్తున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. ఆ కానిస్టేబుల్ ఇప్పుడు త‌న గ‌న్‌మెన్ కాద‌ని స్ప‌ష్టం చేశారు. పోలీసు శాఖలో పనిచేస్తూ తప్పు చేస్తూ దొరికిపోతే తనకు ఆపాదించడం కరెక్ట్ కాదని అన్నారు. టీడీపీకి, ఆ పార్టీ సోషల్ మీడియాకు ఎదుటివారిపై నిందలు వేయడం, బురదజల్లడం అలవాటుగా మారిందని విమర్శించారు.

ఆపరేషన్ సిందూర్.. ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణకు సంబంధించి “బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ నాయకులపై కొంచెం ఒత్తిడి తెచ్చినా, వారు భయపడి పారిపోతారు. డొనాల్డ్ ట్రంప్ అక్కడి నుండి ఫోన్ చేసి.. నరేందర్.. లొంగిపోండి అని అన్నారు. ఇక్కడ, నరేంద్ర మోడీ ‘ఎస్ సార్’ అని యుద్ధం విరమించుకున్నారు” అని రాహుల్ అన్నారు.

కెసిఆర్ కు నోటీసులపై కవిత సీరియస్.. రేపు మహాధర్నా

మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర పూరితంగా కెసిఆర్ కు నోటీసులు ఇచ్చిందని మండిపడ్డారు. ఈ నోటీసులు వ్యతిరేకిస్తూ.. బుధవారం ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి  రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు మహాధర్నా చేపట్టనున్నట్లు  నిర్వహించనున్నట్లు కవిత తెలిపింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON