loader

వైఎస్ జగన్ చిత్తూరు పర్యటనలో హెలిప్యాడ్‌కు పోలీసుల అనుమతి

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటనలో హెలిప్యాడ్‌కు పోలీసులు అనుమతి ఇచ్చారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి వెంకటగిరి సమీపంలో తగ్గువారిపల్లి దగ్గర వైసీపీ అధినేత జగన్ హెలిప్యాడ్‌కు పోలీసులు నుంచి అనుమతి లభించింది. ఇటీవల ఆయన నెల్లూరు పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ హెలిప్యాడ్ కు అనుమతి రానందున జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.ైఎస్ జగన్ జులై 9న చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో పర్యటించనున్నారు.

లోకేష్‌తో కేటీఆర్ సీక్రెట్ మీటింగ్… ఎందుకోసం

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటాను పక్క రాష్ట్రాలకు దోచిపెట్టిన తెలంగాణ ద్రోహ్రం చేసిందని ఆరోపించారు. ఏపీ మంత్రి లోకేష్‌తో కేటీఆర్ సీక్రెట మంతనాలు జరుపుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. లోకేష్‌ను కేటీఆర్‌ కలిసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. లోకేష్‌ను ఎందుకు కలుస్తున్నారనేది సమాధానం చెప్పాలని కేటీఆర్‌ను డిమాండ్ చేశారు. లోకేష్‌ను కలవలేదని కేటీఆర్ అంటే తాను మళ్లీ స్పందిస్తానని… అబద్దం అని బుకాయిస్తే వివరాలు అన్నీ బయటా పెడతానని రామ్మోహన్ […]

తెలంగాణలో ఓటరు జాబితా నుంచి మాజీ ఎమ్మెల్యే పేరు తొలగింపు

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేములవాడ ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచిన చెన్నమనేని రమేష్ తన ఓటు హక్కును కోల్పోయారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ఆధారంగా ఆయన భారత పౌరుడు కాదని తేలింది. దీంతో ఎన్నికల అధికారులు అతని పేరును వేములవాడ ఓటరు జాబితా నుంచి తొలగించారు. ఈ అంశంపై అధికారులు మరింత స్పష్టత ఇచ్చారు. చెన్నమనేని నివాసానికి నోటీసులు అంటించారు.

20ఏళ్ల తర్వాత ఒకే వేదికపై అన్నదమ్ములు..

మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు నెలకొంటున్నాయి. రెండు దశాబ్దాల తర్వాత అన్నదమ్ములు ఇద్దరూ ఒకే వేదికపై కనిపించారు. .ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే. ఒకొరిని ఒకరు హగ్ చేసుకోవడం అక్కడ ఉన్నవారిని ఆకట్టుకుంది. 2005లో చివరిసారిగా ఒకే వేదికపై కలిసి కనిపించిన ఈ ఇద్దరూ.. మళ్లీ 20 ఏళ్ల తర్వాత కనిపించారు. 1 నుంచి 5వ తరగతి వరకు హిందీని బోధించాలని ఉత్తర్వుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్దవ్, రాజ్ సంయుక్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ముంబై పట్టణంలోని వర్లీలో […]

బాబు పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం : పేర్నినాని

టిడిపి నేతలు ప్రతి రోజూ వైఎస్ఆర్ సిపి నేతలపై హత్యలు, హత్యాయత్నాలు చేస్తున్నారని ఎపి మాజీ మంత్రి పేర్నినాని తెలిపారు. ఎపిలో నరకాసుర పాలన జరుగుతోందని, మనుషుల రూపంలో ఉన్న సైకోల పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. రాజకీయ ముసుగులో హత్యలు చేస్తున్నారని విమర్శించారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజల్లో ఏహ్యాభావం ఏర్పడిందని చెప్పారు. వైయస్ఆర్ సిపి వాళ్లకు పనులు చేయొద్దని చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయని విమర్శించారు.

72 గంటలు టైమ్ ఇస్తున్నాం.. రేవంత్‌కు కేటీఆర్ ప్రతిసవాల్

రైతురాజ్యంపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. డేట్, టైమ్, ప్లేస్‌ మీరు చెప్తారా? మమ్మల్ని చెప్పమంటారా అంటూ ప్రశ్నించారు? 72 గంటలు టైం ఇస్తున్నామని.. ప్రిపేర్ అయి రావాలంటూ సెటైర్లు వేశారు. అంతేకాకుండా రేవంత్ సవాల్‌ నుంచి పారిపోకుండా చర్చకు రావాలని కోరారు. ‘‘8వ తేదీన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు మేం వస్తాం. ఆ రోజు 11గంటలకు మీరు రండి. ఒక్కరుగా వచ్చినా.. గుంపుగా వచ్చినా మేం రెడీ. పాలు ఏంటో, నీళ్లు ఏంటో తేలుద్దాం’’ అంటూ కేటీఆర్ ప్రతి […]

కేంద్ర మంత్రి బర్త్‌డే.. టెన్త్‌ విద్యార్థిని,విద్యార్థులకు అదిరిపోయే కానుక

ఈనెల 11న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్సియల్ స్కూళ్లలో చదివే టెన్త్ క్లాస్ విద్యార్థినీ, విద్యార్థులకు భారీ ఎత్తున సైకిళ్లను పంపిణీ చేసేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే సైకిళ్లను కూడా ఆర్డర్‌ ఇచ్చారు. తన పార్లమెంట్ పరిధిలో 9,348 మంది బాలబాలికలు టెన్త్ క్లాస్ అభ్యసిస్తున్నారు.

సంచనలంగా మారిన ఏక్‌నాథ్‌ షిండే జై గుజరాత్‌ నినాదం

MNS కార్యకర్తలు దుకాణదారుడిపై దాడి చేసిన వివాదం కొనసాగుతున్న తరుణంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శుక్రవారం తన ప్రసంగాన్ని “జై హింద్, జై మహారాష్ట్ర, జై గుజరాత్” ఈ నినాదంతో ముగించారు. షిండే చేసిన జై గుజరాత్‌ నినాదంపై ప్రతిపక్ష సభ్యులు విమర్శలు గుప్పిస్తున్నారు. అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌కు చెందినవారు కాబట్టి షిండే ఈ నినాదం పలికారని, ఆయనకు “అధికార దాహం” ఉందనంటూ ఎన్‌సిపి (ఎస్పీ) నాయకుడు క్లైడ్ క్రాస్టో […]

వైసీపీ నేతపై టీడీపీ దాడి: జగన్ సంచలన వ్యాఖ్యలు

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామపంచాయతీ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావుపై ప్రత్యర్థులు అత్యంత పాశవికంగా ప్రత్యర్థులు దాడి చేశారు. టీడీపీ నేతలే హత్యాయత్నం చేశారని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబును ట్యాగ్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రెడ్‌ బుక్ రాజ్యాంగం నడుస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు.

ఢిల్లీలో ఉండే మోడీ రండీ తేల్చుకుందాం..రేవంత్

తెలంగాణలో రైతు సంక్షేమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎవరు ఎంత చేశారో తేల్చుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలను బహిరంగ చర్చకు ఆహ్వానించారు. “ కేడీ గల్లీలో ఉన్నా, మోడీ ఢిల్లీలో ఉన్నా… రైతు సమస్యలపై ముఖాముఖీకి రావాలండి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.కేవలం తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం తమ ప్రభుత్వ విజయాన్ని చూపుతున్నదని సీఎం స్పష్టం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON