టిడిపి నేతలు ప్రతి రోజూ వైఎస్ఆర్ సిపి నేతలపై హత్యలు, హత్యాయత్నాలు చేస్తున్నారని ఎపి మాజీ మంత్రి పేర్నినాని తెలిపారు. ఎపిలో నరకాసుర పాలన జరుగుతోందని, మనుషుల రూపంలో ఉన్న సైకోల పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. రాజకీయ ముసుగులో హత్యలు చేస్తున్నారని విమర్శించారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజల్లో ఏహ్యాభావం ఏర్పడిందని చెప్పారు. వైయస్ఆర్ సిపి వాళ్లకు పనులు చేయొద్దని చెబుతున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయని విమర్శించారు.

