loader

ఓట్ల చోరీ విషయంలో మోదీ, అమిత్ ​షా ఎక్కడికెళ్లినా​ దొరికిపోతారు: రాహుల్​ గాంధీ

ఓట్ల చోరీ విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్ ​షాలు​ దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా చివరకు దొరికిపోతారని కాంగ్రెస్​ ఎంపీ, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బిహార్​లోని కిషన్​గంజ్​లో జరిగిన ర్యాలీలో అన్నారు. బిహార్​లో 100శాతం ఇండియా కూటమి అధికారం చేపడుతుందని చెప్పారు. బీజేపీ, ఆరెస్సెస్‌లు దేశాన్ని విభజించేందుకు యత్నిస్తున్నాయని, మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటకల్లో ఓట్ల చోరీపై ఆధారాలు చూపించామని కానీ ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్​ షా, ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్​ […]

ఓటు చోరీని క‌ప్పిపుచ్చుకునేందుకే SIR : రాహుల్ గాంధీ

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో రాహుల్ విలేక‌రుల‌తో మాట్లాడుతూ, దేశంలో ప్ర‌జాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి జ‌రుగుతోంద‌న్నారు. హ‌ర్యానా మాదిరే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మ‌హారాష్ట్ర‌లోనూ ఓట్ల చోరీ జ‌రిగింద‌ని ఇందుకు సంబంధించిన ఆధారాలు వాటిని త్వ‌ర‌లోనే బ‌య‌ట‌పెడ‌తామ‌ని హెచ్చ‌రించారు. ఓటు చోరీని కప్పిపుచ్చుకునేందుకే స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ (SIR) నిర్వ‌హించార‌ని రాహుల్ వ్యాఖ్యానించారు. బీజేపీ, ఈసీ ఉమ్మ‌డి భాగ‌స్వామ్యంతోనే ఇదంతా జ‌రుగుతోంద‌ని ఆరోపించారు.

అత్యాచార ఆరోపణలు రావడంతో.. ఆస్ట్రేలియాకు పారిపోయిన ఆప్ ఎమ్మెల్యే..

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్‌ మాజ్రా దేశం విడిచి ఆస్ట్రేలియాకు పారిపోయినట్లు తెలుస్తోంది. అజ్ఞాతంలో ఉన్న పఠాన్‌ మాజ్రా.. ఆస్ట్రేలియాకు చెందిన ఒక పంజాబీ వెబ్ ఛానల్‌కు వీడియో ఇంటర్వ్యూ ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తనపై దాఖలైన ఈ కేసు కేవలం రాజకీయ కుట్ర అని పేర్కొన్నారు. పంజాబ్ ప్రజల కోసం మాట్లాడే గొంతుకలను అణచివేయడమే ఈ కుట్ర వెనుక లక్ష్యమని ఆయన ఆరోపించారు.

ఏపీ మోడల్‌ చూడండి..! బిహార్‌లో నారా లోకేష్.. రాహుల్ గాంధీపై విమర్శలు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ బిహార్ ఎన్నికల ప్రచారంలో  ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం చేశారు. బీహార్‌లో మోదీ, నీతీశ్ నాయకత్వంలా.. ఏపీలో నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయకత్వం ఉందని నారా లోకేష్ అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని విమర్శిస్తూ.. ఓవైపు ఆయన ఓట్ చోరీ అని ఆరోపణలు చేస్తునే.. మరోవైపు, ఓటర్ లిస్టులో అవకతవకలను సరి చేయడానికి చేపట్టిన ఎస్ఐఆర్‌ను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఆయన ఒకే వాదనకు కట్టుబడి ఉండాలని.. ఒకేసారి రెండు వాదనలు […]

30 శాతం కమీషన్లు… అందుకే ఆ రంగం పడిపోయింది: హరీష్ రావు

జూబ్లీహిల్స్ ఉప్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిలో ఓటమి ఫ్రస్ట్రేషన్‌ కనిపిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. బిజెపి, రేవంత్‌ మధ్య ఫెవికాల్ బంధం ఉందని, రేవంత్‌ సర్కార్‌ను బిజెపి కాపాడుతోందని ఆరోపణలు చేశారు. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిపోయిందని,రియల్ ఎస్టేట్ పర్మిషన్లకు, నిర్మాణాలకు ముఖ్యమంత్రి కమీషన్లు డిమాండ్ చేయడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నదని రియల్ ఎస్టేట్ పర్మిషన్లకు, నిర్మాణ పర్మిషన్లకు 30% కమీషన్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు.

ఆ విషయంలో కాంగ్రెస్ ఎంతో త్యాగం చేసింది: రేవంత్ రెడ్డి

మీట్ ది ప్రెస్ లో సిఎం రేవంత్, ప్రజాపాలన ప్రారంభమై రెండు సంవత్సరాలైందని తెలిపారు. రాష్ట్రం కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ఎంతో త్యాగం చేసిందని, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు నిర్ణయాలు హైదరాబాద్ అభివృద్ధికి బాటలు పడ్డాయని ప్రశంసించారు. గతంలో కాంగ్రెస్ హయాం లోనే అనేక కేంద్ర సంస్థలు హైదరాబాద్ ఏర్పాటు చేశారన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరు మార్చి నిధులు కొల్లగొట్టిందని, గతంలో నీళ్ల కోసం మహిళలు రోడ్డెక్కిన పరిస్థితులు ఉండేవన్నారు.

జనసేన పార్టీ ‘X’ ఖాతా హ్యాక్, లోగో తొలగింపు.. పార్టీ శ్రేణుల్లో ఆందోళన

ప్రముఖ రాజకీయ పార్టీ జనసేన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ‘X’ (గతంలో ట్విట్టర్) ఖాతా హ్యాక్‌కు గురైంది. శనివారం రాత్రి నుంచి ఈ ఖాతాలో అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన పార్టీ శ్రేణులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హ్యాక్ చేసిన అనంత‌రం ఖాతా ప్రొఫైల్ లోగోతో పాటు కవర్ ఫోటో తొలగించారు సైబ‌ర్ నేర‌గాళ్లు. అంతేగాకుండా పార్టీకి ఏ మాత్రం సంబంధం లేని కొన్ని డిజిటల్ లావాదేవీల కంపెనీల ట్వీట్లను ఈ ఖాతా నుంచి రీపోస్ట్ […]

టిడిపి ఎమ్మెల్యే సీటు కోసం అతడు రూ.7 కోట్లు వ‌సూలు చేశాడు: మాధవి

టిడిపి ఎమ్మెల్యే సీటు కోసం రైల్వేకోడూరు టికెట్ ఇప్పిస్తాననిరూ.7 కోట్లు వ‌సూలు చేశారని ఆ పార్టీ మహిళా నేత మాధవి ఆరోపణలు చేశారు. టిటిపి నేత వేమ‌న స‌తీష్ త‌న‌ను మోసం చేశాడ‌ని సదరు మహిళ మీడియా ముందు కన్నీంటిపర్యంతమయ్యారు. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు, మంత్రి లోకేష్ అంద‌రూ సతీష్ కు తెలుసునని చెప్పి తనని మోసం చేశాడన్నారు. డబ్బు అడిగితే కేసులు పెడతామని బెదిరిస్తున్నాడ‌ని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకున్నారు.

అగ్రనేత ఎల్‌.కె.అద్వానీ ఇంటికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్‌ నేత, మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్‌.కె.అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ.. అద్వానీకి పూలగుచ్ఛం అందజేసి ఆప్యాయంగా పలకరించారు. 98వ ఏట అడుగుపెట్టిన అద్వానీ ఈ ఏడాది భారత అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’తో సత్కరించబడిన విషయం తెలిసిందే.

బ్యాట్ పట్టుకోలేడు కానీ ఐసీసీ ఛైర్మనా ? జై షాపై రాహుల్ పంచ్ లు..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు, ఐసీసీ ఛైర్మన్ కూడా అయిన జై షాపై విమర్శలు గుప్పించారు. “మీరు అదానీ, అంబానీ లేదా అమిత్ షా కొడుకు అయితేనే మీరు పెద్దగా కలలు కనగలరు. అమిత్ షా కొడుకు (జై షా)కి బ్యాట్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు, పరుగు తీయడం మర్చిపోండి. కానీ ఆయన క్రికెట్ చీఫ్. క్రికెట్‌లో ప్రతి దానినీ ఆయన నియంత్రిస్తాడు. ఆయన ప్రతిదీ ఎందుకు నియంత్రిస్తాడు? […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON