loader

రేపు లోక్‌సభలో జమిలి ఎలక్షన్‌ బిల్లు..!

దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి రూపొందించిన రెండు కీలక బిల్లులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకే దేశం-ఒకే ఎన్నిక లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించే జమిలి ఎన్నికలపై లోక్‌సభలో బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలిసింది.

గుకేశ్ కు ఎలాన్ మ‌స్క్ అభినంద‌న‌లు . . .

భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ను ఎలాన్ మ‌స్క్ అభినంద‌న‌లు తెలిపారు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన విష‌యం తెలిసిందే. చైనాకు చెందిన డింగ్‌ లిరెన్‌ను ఓడించి గుకేశ్ ప్రపంచ ఛాంపియన్ గా అవ‌త‌రించాడు. 18 ఏళ్లకే ఇలా వ‌ర‌ల్డ్ చెస్ ఛాంపియ‌న్‌గా నిలిచాడు. త‌ద్వారా ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన (18ఏళ్ల 8నెలల 14రోజులు) ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

భార‌త రాజ్యాంగంపై కొత్త వెబ్‌సైట్ ..

భార‌త రాజ్యాంగానికి 75 ఏళ్ల నిండాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం .. రాజ్యాంగంపై కొత్త వెబ్‌సైట్‌ను https://constitution75.com రూపొందించింది. హ‌మారా సంవిధాన్‌, హ‌మారా స్వాభిమాన్ టైటిల్‌తో .. భారత రాజ్యాంగ గురించి ఆ సైట్‌లో పొందుప‌రిచారు. దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో రాజ్యాంగంపై చైత‌న్యం తీసుకువ‌చ్చేందుకు.. రాజ్యాంగ పీఠ‌క చ‌దువుకునే రీతిలో సైట్‌ను డిజైన్ చేశారు.

రాజ్యాంగంతో సామాజిక న్యాయం, స‌మ‌గ్రాభివృద్ధి ల‌క్ష్యాల‌ను అందుకున్నాం : రాష్ట్ర‌పతి ద్రౌప‌ది ముర్ము

భార‌త రాజ్యాంగానికి 75 ఏళ్లు నిండిన సంద‌ర్భంగా ఇవాళ ఢిల్లీలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము.. 75 ఏళ్ల సంస్మ‌ర‌ణ పోస్టేజ్ స్టాంప్‌ను, ఓ నాణాన్ని రిలీజ్ చేశారు. ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాల్‌లో ఆమె ప్ర‌సంగించారు.  స‌మాజంలో అన్ని రంగాల కోసం, ముఖ్యంగా బ‌ల‌హీన వ‌ర్గాల సంక్షేమం గురించి ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు ఆమె చెప్పారు.

బర్త్‌ డే స్పెషల్‌.. నయనతార Rakkayie టైటిల్‌ టీజర్‌

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న భామల్లో టాప్‌లో ఉంటుంది నయనతార. డెబ్యూ డైరెక్టర్ సెంథిల్‌ నల్లసామి దర్శకత్వంలో నయనతార నటిస్తోన్న తాజా చిత్రం Rakkayie. నయనతారకు బర్త్ డే విషెస్‌ తెలియజేస్తూ ఈ మూవీ టైటిల్‌ టీజర్‌ను విడుదల చేశారు.

అమెరికాలో అధ్యక్ష ఓటింగ్ ప్రారంభం

ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ప్రారంభంకానున్నాయి. ఈసారి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. హోరాహోరీ పోరుతో ఉత్కంఠ నెలకొనడంతో ఎన్నికలపై యావత్ ప్రపంచం దృష్టి అమెరికా వైపే ఉంది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 7 నుంచి 9 గంటలకు మధ్య పోలింగ్ ప్రారంభమవుతుంది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు . . .

ఐపీఎల్ రిటెన్షన్ జాబితాలు వచ్చేశాయి. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు జట్లు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలను ఆయా ఫ్రాంచైజీలు నేడు ప్రకటించాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సాధ్యమైనంత వరకు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ జట్టు కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ (18 కోట్లు), అభిషేక్‌ శర్మ (14 కోట్లు), నితీశ్‌కుమార్‌ రెడ్డి (6 కోట్లు), హెన్రిచ్‌ క్లాసెన్‌ (23 కోట్లు), ట్రవిస్‌ హెడ్‌ (14 కోట్లు) మరోసారి రిటైన్‌ చేసుకుంది.

దీపావళి శుభాకాంక్షలు

ఈ పండుగ యొక్క విశేషమైన రోజున, మీ ఇంట్లో ఆనందాలు వెలువడుతూ, ప్రతి క్షణం కాంతితో నిండాలని మనసారా కోరుకుంటున్నాము, అందుకే ఈ దీపావళి మీరు ఆనందంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాము.

ఇది దీపాల పండుగ.. పటాసుల పండుగ కాదు : అర్వింద్‌ కేజ్రీవాల్‌

దీపావళి (Diwali) పండుగ అంటే దీపాలు వెలిగించి జరుపుకునే పండుగ అని, పటాసులు కాల్చే పండుగ కాదని ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్‌, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి (Delhi former CM) అర్వింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఈ పండుగ సందర్భంగా ఎవరూ పటాసులు కాల్చవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని ఆయన చెప్పారు

మహారాష్ట్రలో ముగిసిన నామినేషన్ల పర్వం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మంగళవారంతో ముగిసింది. అయితే 15 సీట్లలో పోటీ చేసే అభ్యర్థులపై పార్టీల్లో ఇంకా స్పష్టత కొరవడింది. అధికార బీజేపీ, శివసేన, ఎన్సీపీ (అజిత్‌ పవార్‌) వర్గంలో నాలుగు సీట్లకు ఇంకా అభ్యర్థులను ప్రకటించ లేదు. ఇక విపక్ష మహా వికాస్‌ అఘాడీలోని శివసేన (యూబీటీ), కాంగ్రెస్‌, ఎన్సీపీ (శరద్‌ పవార్‌) పార్టీలు 11 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనపై మల్లగుల్లాలు పడుతున్నాయి.

PHONE NUMBER

+91 7569298753

EMAIL

admin@news4short.com

LOCATION

12-9-27/16
Prakashnagar,station road
beside Oxford School,
NARASARAOPET-522601-AP

DOWNLOAD APP

FOLLOW US ON